%1$s

ఇన్ఫ్లమేటరీ బోవేల్ డిసీజ్”(IBD)” పురోగతిపై యశోద హాస్పిటల్స్‌ నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్‌షాప్ విజయవంతం

యశోద హాస్పిటల్స్ హైటెక్-సిటీలో ‘IBD (ఇన్ఫ్లమేటరీ బోవేల్ డిసీజ్)’ చికిత్సలో అందుబాటులోకి వచ్చిన పురోగతులపై “అంతర్జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్”ను ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్ లో “ఇన్‌ఫ్లమేటరీ బో్వెల్ డిసీజ్” చికిత్సలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య విదానాలను జాతీయ మరియు అంతర్జాతీయ వైద్య నిపుణులతో ప్రత్యక్ష వర్క్ షాప్ & ఇంటరాక్టివ్ శిక్షణా సెషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన 300 మందికి పైగా జాతీయ మరియు అంతర్జాతీయ గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి.యస్. రావు మాట్లాడుతూ… నాణ్యమైన వైద్యం అందించేందుకు యశోద హాస్పిటల్స్ ఇలాంటి అంతర్జాతీయ సదస్సు‌ను నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. IBD (ఇన్ఫ్లమేటరీ బోవేల్ డిసీజ్) ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలోని న వేగంగా పెరుగుతున్న  వ్యాధులలో ఇన్‌ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి ఒకటి. గత దశాబ్దకాలంలో దక్షిణ భారతదేశంలో ఐబిడి కేసులు గణనీయంగా పెరిగాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా చుస్తే ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధిక సంఖ్యలో ఐబిడి కేసులు నమోదవుతున్నయన్నారు. రెగ్యులర్ లైఫ్ స్టైల్ ‌తో పాటు ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడం వల్ల ఐబిడి పేషెంట్లు కొన్ని ఇబ్బందికర లక్షణాలను అధిగమించవచ్చని తెలియజేశారు.

యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఐబిడి స్పెషలిస్ట్ డా. కిరణ్ పెద్ది మాట్లాడుతూ… గత రెండు సంవత్సరాల్లో IBD చికిత్సలో అత్యాధునిక చికిత్స విదానాలు అందుబాటులోకి వచ్చాయని, కొత్త మందులు మరియు బయోలాజికల్ ఏజెంట్ల లభ్యతతో, ముందుగానే గుర్తించి చికిత్స చేస్తే, 90 శాతం కంటే ఎక్కువ మంది పేషంట్ లలో మంచి స్పందన సాధించవచ్చని వివరించారు. అంతర్దృష్టితో కూడిన చర్చలు, సంచలనాత్మక పరిశోధన ప్రదర్శనలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను ఒకచోట చేర్చడంతో అంతర్జాతీయ ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ సమావేశం అద్భుతమైన విజయంతో నిర్వహించబడింది. ఈ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లో పరిశోధన, రోగ నిర్ధారణ, చికిత్సలను గురించి చెప్పడం జరిగింది. అంతర్జాతీయ IBD కాన్క్లేవ్ 1.0 అనేది మేము చూసిన ఒక అద్భుతమైన స్పందన అని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, IBD స్పెషలిస్ట్ మరియు సింపోజియం యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కిరణ్ పెద్ది, అన్నారు.

ఈ సింపోజియంలో 300 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు మరియు సర్జన్లు సదస్సుకు హాజరుకావడంతో కార్యక్రమం విజయవంతమైంది. ఈ సదస్సుకు హాజరైనవారిలో ప్రముఖ అంతర్జాతీయ అధ్యాపకులు ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ జాకోబ్ బెగన్ మరియు డాక్టర్ యూన్-క్యో ఆన్, సింగపూర్‌లోని APAGE ప్రెసిడెంట్ డాక్టర్ C.J ఓయి, UK నుండి డాక్టర్ చార్లీ లీస్ మరియు డాక్టర్ షాజీ సెబాస్టియన్ మరియు యునైటెడ్ స్టేట్స్ నుండి డాక్టర్ దీపక్ పరక్కల్ పాల్గొనడం జరిగింది.