అత్యాధునిక “క్రిటికల్ కేర్ నెఫ్రాలజీ” పై యశోద హాస్పిటల్స్ లో అంతర్జాతీయ సదస్సు
యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ లో తెలంగాణ గవర్నర్ శ్రీమతి డాక్టర్. తమిళిసై సౌందరరాజన్ గారిచే క్రిటికల్ కేర్ నెఫ్రాలజీ అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
హైదరాబాద్, జనవరి 27, 2024: అభివృద్ధి చెందుతున్న దేశాలలో గత మూడు దశాబ్దాలుగా గర్భధారణలో తీవ్రమైన మూత్రపిండాల గాయం (AKI) గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ, ఇది ఇప్పటికీ గర్బస్థ పిండం మరణాలు మరియు గర్భధారణలో ఉన్న వ్యక్తి అనారోగ్యంతో సంబంధం కలిగిన ఒక ముఖ్యమైన సమస్యగానే ఉంది. ప్రపంచం నలుమూలనుండి USA, UK, యూరప్, లాటిన్ అమెరికాల నుండి వచ్చిన 30 మందికి పైగా అగ్రశ్రేణి కిడ్నీ వైద్య నిపుణులు గర్భధారణ సమయంలో వచ్చే మూత్రపిండాల సమస్యలు, వాటికి ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య విధానాలతో ఆ సమయంలో చికిత్స ఎలా అందించాలనే దానిపై ఏర్పాటు చేసిన ఈ మూడురోజుల అంతర్జాతీయ సదస్సును తెలంగాణ రాష్ట్ర గవర్నర్, శ్రీమతి డాక్టర్. తమిళిసై సౌందరరాజన్ గారు ఈ రోజు ప్రారంభించారు.
యశోద హాస్పిటల్స్ క్రిటికల్ కేర్ నెఫ్రాలజీపై నిర్వహించిన ఈ అత్యాధునిక అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్, శ్రీమతి డాక్టర్. తమిళిసై సౌందరరాజన్ గారు యశోద యాజమాన్యాన్ని అభినందిస్తూ, “ఆధునికతను సంతరించుకుంటూ తన పరిధిని విస్తరించుకుంటున్న కిడ్నీ వైద్య విజ్ఞాన శాస్త్రంలో చోటుచేసుకుంటున్న సరికొత్త ఆవిష్కరనలపై దృష్టిసారించేoదుకు వివిధ దేశాల వైద్య నిపుణుల మధ్య వైద్య విజ్ఞానాన్ని పంచుకోవడానికి వేదికగా నిలిచింది” అని అన్నారు.
యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి గారు మాట్లాడుతూ, “AKI నిర్ధారణ సీరం క్రియేటినిన్ పెరుగుదలపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో దాదాపు 850 మిలియన్ ప్రజలు ఏదో ఒక మూత్రపిండాల వ్యాధితో సతమతమవుతున్నారు. వీరిలో 5 మిలియన్ నుంచి 10 మిలియన్ మంది వరకు డయాలిసిస్ కానీ మూత్రపిండాల మార్పిడి కానీ అవసరమౌతోంది. ప్రజల్లో మూత్రపిండాల వ్యాధులపైన, మూత్రపిండాల ఆరోగ్యం పైన అవగాహన పెంపొందించడానికి క్రిటికల్ కేర్ నెఫ్రాలజీపై ఆయా వ్యాధుల నిర్దిష్ట చికిత్సా విధానాల గురించి విస్తృతంగా చర్చించేదుకు, శిక్షణ ఇచ్చేందుకు అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన వైద్య నిపుణులు ఎందరో ఈ అంతర్జాతీయ సదస్సులో పాలుపంచుకోటానికి ఉత్సాహంగా ముందుకు రావటం హర్షణీయం” అని అన్నారు.
“ఈ సదస్సుకు హాజరైన 1000 మందికి పైగా యువ ఇంటెన్సివిస్ట్‌లు, అనస్థీషియాలజిస్టులు, సర్జన్లు, నెఫ్రాలజిస్ట్లకు అక్యూట్ కిడ్నీ గాయం (AKI) మరియు నిరంతర మూత్రపిండ పునఃస్థాపన చికిత్స (CRRT) లో ఉన్న వివిధ సంక్లిష్టతలను అర్థం చేసుకోవడంతోపాటు కిడ్నీ వైద్య రంగంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ అంతర్జాతీయ వైద్య నిపుణులతో వారి అనుభవాలను పంచుకునే విధంగా ఈ ముడు రోజుల అంతర్జాతీయ సదస్సును రూపొందించడం జరిగింది” అని యశోద హాస్పిటల్స్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్. రాజశేఖర చక్రవర్తి గారు తెలియజేసారు.
News Coverage:
- https://telanganatoday.com/hyderabad-three-day-conference-on-critical-care-nephrology-being-held-at-yashoda-hospitals
- https://www.uniindia.com/photoes/539370.html
- https://www.thehindu.com/news/national/telangana/telangana-governor-inaugurates-three-day-nephrology-conference/article67783433.ece
- https://www.ntnews.com/telangana/governor-tamilisai-soudararajan-inaugurated-at-yashoda-hospital-1450927
- https://newsmeter.in/science-health/doctors-discuss-critical-care-nephrology-in-3-day-conference-in-hitech-city-723915
- https://www.eenadu.net/telugu-news/districts/Hyderabad/529/124017852
- https://www.sakshi.com/telugu-news/telangana/telangana-governor-inaugurates-three-day-nephrology-conference-1932969
- https://hyderabadnow.in/2024/01/27/telangana-governor-inaugurates-three-day-nephrology-conference/
Youtube Coverage:
- https://youtu.be/odtcXRT81Y4?si=9gPQi0PD4K3QTBHN
- https://www.youtube.com/live/2dwdgNCyJ1Y?si=fjYxWuj996-Mqh-K
- https://youtu.be/8mbWoUkTlIU?si=akj-P-sbuA0bRZfb
- https://youtu.be/PdlU9OZ1goE?si=k_c3f9r9I_eUolgt
- https://youtu.be/JVldtUC-vN0?si=lh0Y3sO-J5B_78rf
- https://youtu.be/PdlU9OZ1goE?si=bNvwBGDZMu4bJSJp
- https://youtu.be/bKHTOQ0Imow?si=wiRLjuSAx_4n7TnU
- https://youtu.be/44rB1AAOXww?si=H03VefOBWjPUNGbF