%1$s

క్యాన్సర్ చికిత్స ఎంపికలు: కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఇమ్యునోథెరపీ మరియు మరిన్ని

Cancer Treatment Telugu Blog Banner

క్యాన్సర్, ఇది అనియంత్రిత కణాల పెరుగుదల ద్వారా వర్గీకరించబడిన వ్యాధి, క్యాన్సార్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ముఖ్యమైన ఆరోగ్య సవాలుగా మిగిలిపోయింది. కొంత సంక్లిష్టత ఉన్నప్పటికీ, వైద్య పరిశోధనలో పురోగతులు, సంచలనాత్మక ఆవిష్కరణలు మరియు మెరుగైన చికిత్స ఎంపికలు కనుగొనబడి విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి. సాంప్రదాయ చికిత్సల నుండి ఆధునిక ఇమ్యునోథెరపీల వరకు, మరిన్ని చికిత్సలు నేడు క్యాన్సర్‌కు అందుబాటులోకి వచ్చాయి. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయడం చాలా ముఖ్యం. రోగనిర్ధారణ మరియు ప్రారంభ చికిత్సలు క్యాన్సర్ను విజయవంతంగా ఎదుర్కొనడంలో ప్రధాన పాత్రలు పోషిస్తాయి.

క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది?

క్యాన్సర్ అనేది వివిధ శరీర అవయవాలు లేదా కణజాలాలలో ఉద్భవించే విభిన్న వ్యాధుల సమూహం. క్యాన్సర్ ముఖ్యంగా నియంత్రణ లేని కణాల పెరుగుదల వల్ల అభివృద్ధి చెందుతుంది. ఇది మానవ శరీరంలో ఒక చోట ప్రారంభమయ్యి ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. కణ విభజన అనేది కణాల పెరుగుదల మరియు అవసరమైన విధంగా కొత్త కణాలను ఏర్పరచడానికి జరిగే సాధారణ ప్రక్రియ. అయితే, ఈ ప్రక్రియ విచ్ఛిన్నమైనప్పుడు, అసాధారణమైన లేదా దెబ్బతిన్న కణాలు పెరిగి క్యాన్సర్ కణితులుగా ఏర్పడతాయి. 

ఈ క్యాన్సర్ కణితులు సమీపంలోని కణజాలాలలోకి వ్యాప్తి చెంది మెటాస్టాసిస్ ప్రక్రియ ద్వారా కొత్త వాటికి దోహాదపడతాయి. చాలావరకు క్యాన్సర్లు ఘన స్థితిలో ఉండే కణితులను ఏర్పరుస్తాయి, అయితే ఇవి రెండు రకాలుగా ఉన్నాయి, మొదటిది నిరపాయమైన (బినైన్) కణితులు, రెండవది క్యాన్సర్ కు దారితీసే (మాలిగ్నాన్ట్) కణితులు. ఈ బినైన్ కణితులు సమీపంలోని కణజాలాలపై వ్యాపించవు లేదా దాడి చేయవు. తొలగించినప్పుడు, నిరపాయమైన కణితులు సాధారణంగా తిరిగి పెరగవు, కానీ పెద్దవిగా ఉంటాయి మరియు కొన్ని సందర్భాలలో తీవ్రమైన లక్షణాలను కలిగిస్తాయి. అదేవిధంగా క్యాన్సర్ కణితులు ఇతర భాగాలలోకి వెళ్లి వ్యాప్తి చెంది క్యాన్సర్ కు దారితీస్తాయి.

మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

క్యాన్సర్ యొక్క దశలు మరియు కారణాలు

కణితిని కలిగి ఉన్న చాలా క్యాన్సర్లు సాధారణంగా ఐదు దశలలో నిర్దారించబడతాయి. ఆ అయిదు దశలు ఏమనగా:

దశ- 0: ఈ దశలో క్యాన్సర్ ఉండదు, అయినప్పటికీ క్యాన్సర్‌గా మారే అవకాశం ఉన్న అసాధారణ కణాలు నిర్దారణకు వస్తాయి. దీనినే ఆంగ్లములో కార్సినోమా ఇన్ సిటు అని కూడా అంటారు.

దశ- I అంటే క్యాన్సర్ కణితి చిన్నగా ఉండి ఒక ప్రాంతానికే పరిమితం అవుతుంది. దీనినే ప్రారంభ దశ క్యాన్సర్ అని కూడా అంటారు.

దశ- II మరియు దశ- III: ఈ దశలలో క్యాన్సర్ కణితులు పెద్దగా మారి,  సమీపంలోని కణజాలాలు లేదా శోషరస కణుపుల్లోకి వ్యాప్తి చెందడం ప్రారంభం అవుతాయి.

దశ- IV:  ఈ దశలో క్యాన్సర్ మీ శరీరంలోని ఇతర భాగాలకు బాగా వ్యాప్తి చెందుతుంది, ఈ దశని తీవ్రమైనది గాను లేదా మెటాస్టాటిక్ క్యాన్సర్ దశ అని కూడా పరిగణించడం జరుగుతుంది.

క్యాన్సర్ అనేది కణాల కార్యకలాపాలను నియంత్రించే జన్యువులలో ఉత్పరివర్తనాల ఏర్పడటం వల్ల వచ్చే జన్యుపరమైన రుగ్మత, దీని ఫలితంగా కణాలు అసాధారణంగా విభజించబడి గుణించబడతాయి, తద్వారా శరీరం యొక్క పనితీరుకు అంతరాయం కలుగుతుంది. క్యాన్సర్ రావడానికి గల ముఖ్య కారణాలు మరియు సంభావ్యతను పెంచే కారకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • కుటుంబ చరిత్ర: మీ కుటుంబ సభ్యుల్లో (తల్లిదండ్రులు, తోబుట్టువులు, తాతలు) క్యాన్సర్ ను కలిగి ఉంటే, మీలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • ధూమపానం: పొగాకు లేదా సిగరెట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
  • పర్యావరణ కారకాలు: ఆస్బెస్టాస్, పురుగుమందులు మరియు రాడాన్ వంటి విషపదార్ధాలకు గురికావడం క్యాన్సర్‌కు దారితీయవచ్చు.
  • పోషకాహార లోపం: అధిక కొవ్వు లేదా అధిక చక్కెర కలిగిన ఆహారాలు మరియు శారీరక శ్రమ లేకపోవడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
  • హార్మోన్ థెరపీ: మహిళలు మరియు AFAB హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీని తీసుకుంటున్న వారిలో, రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
  • రేడియేషన్కు బహిర్గతం అవడం: UV రేడియేషన్ కు బహిర్గతం కావడం కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

క్యాన్సర్ చికిత్సలు

క్యాన్సర్ చికిత్సకు చాలా ఎంపికలే ఉన్నాయి, అయినప్పటికీ చికిత్స అనేది క్యాన్సర్ రకాన్ని మరియు తీవ్రతను బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో కలియకలతో కూడిన చికిత్స పద్దతులను కూడా సూచించడం జరుగుతుంది. సహజంగా క్యాన్సర్ నిపుణులు మనిషిని బట్టి వారికి ఉన్న రుగ్మతను బట్టి ఎంపికలు చేస్తూ ఉంటారు. క్యాన్సర్ యొక్క చికిత్సా పద్ధతులు ఎన్ని రకాలు ఉన్నాయో ఈ క్రింద వివరించడం జరిగింది:

  • కీమోథెరపీ: కీమోథెరపీ అనేది క్యాన్సర్ చికిత్సలో ప్రధాన పాత్ర పోషిస్తుంది, ఇది క్యాన్సర్ కణాలను చంపడానికి మందులను ఉపయోగిస్తుంది. ఈ మందులు ఇంట్రావీనస్ లేదా నోటి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కీమోథెరపీ వివిధ క్యాన్సర్లను సమర్థవంతంగా నయం చేయగలదు, ఇది జుట్టు రాలడం, అలసట మరియు వికారం వంటి దుష్ప్రభావాలతో కూడుకున్నప్పటికీ, వైద్య శాస్త్రంలో వచ్చిన పురోగతులు ఈ దుష్ప్రభావాలను పూర్తిగా తగ్గించి, మెరుగైన చికిత్సా ఫలితాల అభివృద్ధికి నేడు దారితీశాయి.
  • రేడియేషన్ థెరపీ: ఇది క్యాన్సర్ కణాలను చంపడానికి అధిక-శక్తి కిరణాలను ఉపయోగిస్తుంది. కణితి వద్ద రేడియోధార్మికతను నేరుగా ఉంచడానికి ఒక యంత్రాన్ని ఉపయోగించి లేదా అంతర్గతంగా రేడియోధార్మిక పదార్థాలను నేరుగా కణితి లేదా సమీపంలోని కణజాలంలో ఉంచడం ద్వారా నిర్వహించబడుతుంది. అనేక రకాల క్యాన్సర్‌లకు చికిత్స చేయడంలో రేడియేషన్ థెరపీ ప్రభావవంతంగా పనిచేస్తుంది. 
  • హార్మోన్ థెరపీ: హార్మోన్ థెరపీ అనేది క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగించడానికి లేదా ఆపడానికి హార్మోన్లను ఉపయోగించి చికిత్స చేయడం జరుగుతుంది. ఇది సాధారణంగా రొమ్ము మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి హార్మోన్-సెన్సిటివ్ క్యాన్సర్‌లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. హార్మోన్ థెరపీ ద్వారా శరీరంలోని కొన్ని హార్మోన్ల ఉత్పత్తిని నిరోధించడం లేదా సింథటిక్ హార్మోన్లను ప్రవేశపెట్టడం వంటివి జరుగుతుంది. 
  • టార్గెటెడ్ థెరపీ: టార్గెటెడ్ థెరపీ అనేది క్యాన్సర్ కణాల పెరుగుదల మరియు మనుగడకు సంబంధించిన నిర్దిష్ట అణువులను లక్ష్యంగా చేసుకునే ఒక రకమైన క్యాన్సర్ చికిత్స. ఈ చికిత్సలు క్యాన్సర్‌ కు దారితీసే అసాధారణ ప్రక్రియలకు వ్యతిరేకంగా రూపొందించబడ్డాయి, ఆరోగ్యకరమైన కణాలకు జరిగే నష్టాన్ని టార్గెటెడ్ థెరపీ తగ్గిస్తుంది. ఈ టార్గెటెడ్ థెరపీ (లక్ష్య చికిత్సలు) వివిధ క్యాన్సర్‌లకు చికిత్స చేయడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపించినప్పటికీ, ఇవి అన్ని రకాల క్యాన్సర్‌లకు ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. క్యాన్సర్ రకాన్ని మరియు మనిషి యొక్క స్థితిని చూసిన తరువాత దీని యొక్క అనుకూలతను బట్టి సూచించడం జరుగుతుంది.
  • ఇమ్యునోథెరపీ: ఇమ్యునోథెరపీ అనేది క్యాన్సర్ కణాలతో పోరాడటానికి శరీరం యొక్క రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది. క్యాన్సర్ కణాలను గుర్తించి దాడి చేసే రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. చెక్‌పాయింట్ ఇన్హిబిటర్స్ మరియు CAR-T సెల్ థెరపీ వంటి వివిధ రకాల ఇమ్యునోథెరపీలు వివిధ క్యాన్సర్‌లకు చికిత్స చేయడంలో ప్రామాణికంగా ఉంది.   
  • స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (ఎముక మజ్జ మార్పిడి): స్టెమ్ సెల్ మార్పిడి అనేది ఒక సంక్లిష్టమైన వైద్య ప్రక్రియ, ఇందులో దెబ్బతిన్న లేదా వ్యాధిగ్రస్తులైన వారి యొక్క ఎముక మజ్జను ఆరోగ్యకరమైన మూలకణాలతో భర్తీ చేస్తారు. ఈ మూల కణాలు దాత (అలోజెనిక్ మార్పిడి) లేదా రోగి యొక్క స్వంత శరీరం (ఆటోలోగస్ ట్రాన్స్‌ప్లాంట్) నుండి తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియ లుకేమియా మరియు లింఫోమా వంటి వివిధ రక్త క్యాన్సర్‌లకు, అలాగే తీవ్రమైన అప్లాస్టిక్ అనీమియా వంటి ఇతర పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది. స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్లు ప్రాణాలను రక్షించగలవు, దీనికి స్పష్టమైన నిపుణుల పర్యవేక్షణ అవసరం.
  • శస్త్రచికిత్స: శస్త్రచికిత్స అనేది క్యాన్సర్ కణితులను తొలగించడానికి ఉపయోగించే ఒక వైద్య ప్రక్రియ, ఇవి సాధారణ చిన్నపాటి ప్రక్రియల నుండి మాస్టెక్టమీలు లేదా రాడికల్ రిసెక్షన్‌ల వంటి సంక్లిష్ట ప్రక్రియల వరకు చేస్తూ ఉంటారు.

Cancer Treatment

క్యాన్సర్‌కు వ్యతిరేకంగా చేసే పోరాటంలో ప్రారంభ రోగ నిర్ధారణ మరియు సత్వర చికిత్స కీలకం. ముందస్తుగా గుర్తించడం సకాలంలో జోక్యం అనేది క్యాన్సర్ చికిత్సలో విజయవంతమైన అవకాశాలను పెంచుతుంది. క్యాన్సర్ నిపుణులచే రెగ్యులర్ చెక్-అప్‌లు, ప్రమాద కారకాలపై అవగాహన కలిగి ఉండడం మరియు ఏదైనా అసాధారణ లక్షణాలపై తక్షణ సాయం కోరడం అనేవి చికిత్స ఫలితాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది.

యశోద హాస్పిటల్స్ సమగ్రమైన మరియు అధునాతన క్యాన్సర్ చికిత్సను అందించడానికి కట్టుబడి ఉంది. మా అనుభవజ్ఞులైన ఆంకాలజిస్టులు మరియు సిబ్బంది వారు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఇమ్యునోథెరపీ మరియు టార్గెటెడ్ థెరపీతో సహా అనేక రకాల చికిత్స ఎంపికలను అందిస్తారు. మేము అధునాతన స్క్రీనింగ్‌లు మరియు వివిధ రకాల పద్ధతుల ద్వారా క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించడానికి ప్రాధాన్యతనిస్తాము. నైపుణ్యం, అత్యాధునిక సాంకేతికత మరియు వ్యక్తిగతీకరించిన సంరక్షణ కలయికలతో సమర్థవంతమైన చికిత్సను అందించడం జరుగుతుంది.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262681 కి కాల్ చేయగలరు.

About Author –

Dr. Nikhil S Ghadyalpatil, Senior Consultant Medical Oncologist & Hemato-Oncologist,Yashoda Hospitals, Hyderabad

best Medical Oncologist in hyderabad

Dr. Nikhil S Ghadyalpatil

MD (Gen Med), DNB (G. Med), DM (Medical Oncology)
Director - Medical Oncology, Senior Consultant Medical Oncologist & Hemato-Oncologist

X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567