%1$s

ఆధునిక సాంకేతికతతో అన్ని రకాల క్యాన్సర్లకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి

types-cancer-treatment-precautions

మనదేశంలో ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో  కాన్సర్లు ముందున్నాయి. కాన్సర్ కారణంగా ప్రతీరోజు కనీసం 1300 వందల మంది మరణిస్తున్నారు. కాన్సర్ విజృంభిస్తున్న తీరు పట్ల  భారత వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్)తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. మనదేశంలో  కాన్సరు వ్యాధికి గురైన వారిలో కేవలం 12.5 శాతం మంది మాత్రమే వ్యాధి ప్రారంభ దశలో డాక్టర్లను సంప్రదిస్తున్నట్లు ఐ.సి.ఎం.ఆర్. అధ్యయనం వెల్లడయ్యింది. అత్యధికులు డాక్టర్లను సంప్రదించే నాటికే వ్యాధి బాగా ముదిరి ఉండటంతో ఆ పైన ఎడాది వ్యవధిలోనే మరణిస్తున్నారు. దీంతో ఓరల్, ఫారిన్క్స్, గాల్ బ్లాడర్, సర్వైకల్ కాన్సర్ల విషయంలో అత్యధిక కేసులతో మనదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది.  బారతీయుల జన్యుపరమైన ప్రత్యేకత, ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఇక్కడి వాతావరణం ప్రభావం వల్ల కొన్ని అవయవాలకు సోకే కాన్సర్లు అధికంగా, మరికొన్ని తక్కువగా ఉంటున్నాయి. కాన్సర్లు రావటానికి కారణాలు, వాటి  లక్షణాలను గూర్చి సామాన్య ప్రజలలో చైతన్యం పెంచటం వల్ల భారతీయులు భారీ సంఖ్యలో  కాన్సర్ల బారిన పడకుండా జాగ్రత్తపడటానికి అవకాశం ఉంటుందని దేశంలోని కాన్సర్ నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు సూచిస్తూన్నాయి. వ్యాధి లక్షణాలు తెలిసి ప్రారంభంలోనే గుర్తించగలిగితే  వెంటనే చికిత్స పొందటానికి అవకాశం కలుగుతుంది. బారతదేశానికే కాదు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు ఓ సవాలుగా తయారయ్యింది.

బ్యాంకు అధికారిగా చాలాకాలం పాటు ఇతర రాష్ట్రాలలో పనిచేసి ఇటీవలే హైదరాబాద్ కు బదిలీ అయి వచ్చిన  ఉషారాణి(46) కి ఒక రోజు కళ్లు పచ్చగా మారాయి. విడువని దురదలు బాధపెడతున్నాయి. ఆకలి మందగించటంతో నీరసంగా ఉండి రోజంతానిద్రవస్తున్నది. కడుపులో వికారంగా అనిపిస్తూ ఏ పనిపైన ఏకాగ్రత కుదరటంలేదు. జ్జపకశక్తి కూడా క్రమంగా మందగించింది. ఒక్కసారిగా అనారోగ్యం ముంచుకొచ్చిన స్థితిలో డాక్టరకు చూపించుకొన్నారు. డాక్టరు సూచనమేరకు ఆస్పత్రికి వెళ్లగా  రక్తపరీక్ష, ఫైబ్రోస్కాన్ (ట్రాన్సియంట్ ఎలాస్టోగ్రఫీ) చేసి కాలేయ కాన్సరును గుర్తించారు. వ్యాధి ముదిరిపోక ముందే

చికిత్స చేయించుకోవటం ద్వారా ఆమె పూర్తి ఉపశమనం పొందగలుగుతున్నారు.

మోహన్ నాయక్ (60) ఇటీవలే కేంద్ర ప్రభుత్వ సర్వీసు నుంచి రిటైర్ అయ్యారు. మూడు నెలల క్రితం  ముంబైలో ఉండగా మూత్రవిసర్జన ప్రారంభం  ఆలస్యం అవటమే కాకుండా రాత్రిళ్లు పదేపదే మూత్రానికి వెళ్లవలసి వచ్చేది. ఫామిలీ డాక్టరుకు చూపించుకుని ఆయన సూచనమేరకు పరీక్షలు చేయించగా                                                                      

ప్రోస్టేట్ కాన్సర్ మొదటి స్టేజ్ లో ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే చికిత్స ప్రారంభించటతో వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం లభించటంతోపాటు వ్యాధి ముదిరిపోయే ప్రమాదం తప్పింది.

రామలక్ష్మి(50)కి హఠాత్తుగా తిన్న అన్నం, చివరకు నీళ్లు కూడా మింగటం కష్టంగా తయారయ్యింది. తీవ్రమైన నొప్పి కలిగించింది. ఆస్పత్రికి వెళ్లి చూపించుకోగా ఈ లక్షణాలు అన్నవాహిక కాన్సరు తో సహా ఇతర గాస్ట్రో ఇంటస్టైనల్ కాన్సర్లు ఏదైనా అయ్యే అవకాశం ఉంటుందని అనుమానించిన డాక్టర్లు నిర్ధారణ పరీక్షలు చేయించారు. అయితే  చివరకు ఆమెకు అన్నవాహిక  తాలుకు కాన్సర్ తొలిదశలో ఉన్నట్లు గుర్తించి చికిత్స ప్రారంభించారు.

Consult Our Experts Now

వైద్యరంగాన్ని సవాలు చేస్తున్న కాన్సర్లు:

శరీరంలోని ఏ భాగంలోనైనా కాన్సర్లు తలెత్తవచ్చు. కాన్సర్ అన్న పేరు ప్రచారంలో ఉన్నా ఇది ఓకే ఒ఍క్క వ్యాధి ఎంతమాత్రం కాదు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాలు, పరిశీలనల ఆధారంగా దాదాపు వంద రకాల కాన్సర్లను గుర్తించారు.  వీటిలో ప్రతీ కాన్సర్ దానికది భిన్నమైనది మనదేశంలో కాన్సరు కారక మరణాలలో   స్త్రీలు అత్యధికంగా  రొమ్ము కాన్సరు కారణంగా, పురుషులు ఎక్కువగా నోటి కాన్సరు వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రెండింటితో సహా మనదేశంలో ఎక్కువగా కనిపిస్తున్నవి సర్వైకల్, ప్రొస్టేట్, లివర్, కిడ్నీ,  బ్లడ్, అండాశయం, ఊపిరితిత్తుల కాన్సర్లు. కాన్సర్లు ఘనరూపంలో (ఉదా. రొమ్ము, శ్వాసకోశాలు, ప్రొస్టేట్ కాన్సర్లు) లేదా ద్రవరూపంలో (బ్లడ్ కాన్సర్లు) ఉంటాయి.

అండాశయ కాన్సర్: మనదేశంలో అధికంగా కనిపిస్తన్న కాన్సర్లలో ఒవేరియన్ కాన్సర్ ఒకటి. మహిళకు సంబంధించిన కాన్సర్ కేసులలో 4శాతం వరకు ఈ కాన్సరువి ఉంటున్నాయి. ప్రాధమిక దశలో అధిక మూత్రం, పొట్టలో నొప్పి, కటివలయంలో నొప్పి వంటి సాధారణ సమస్యలు తప్పించి ఇతర కాన్సర్లలో వలే దీనిలో వ్యాధి లక్షణాలు, అండాశయ కాన్సర్ ప్రధానంగా వృద్ధమహిళలో కనిపిస్తుంది. ఈ వ్యాధిగ్రస్థ స్త్రీల సగటు వయస్సు 63 సం.లుగా గుర్తించారు.వంశపారంపర్యంగా రొమ్ము, అండాశయ కాన్సరుకు గురయిన కుటుంబాల మహిళలలో ఈ కాన్సర్ అధికంగా కనిపిస్తోంది. ఊబకాయం ఉన్న స్త్రీలు  పెద్ద సంఖ్యలో అండాశయ కాన్సరుకు గురవుతున్నారు. అయితే   ఒకసారి తలెత్తిన తరువాత వేగంగా విస్తరించే అండాశయకాన్సర్ వ్యాధిపీడితులలో ఎక్కువ మందికి మరణానికి కారణం అవుతున్నాయి.  అందువల్లనే కాన్సర్ వైద్య నిపుణులు దీనిని సైలెంటే కిల్లర్ అని పేర్కొంటున్నారు. గడచిన(2017) సంవత్సరం 26,800 మంది మహిళలో అండాశయ కాన్సరును గుర్తించగా 20 వేల మంది మృతిచెందారు. వ్యాధికి గురయిన వారిలో 75 శాతం మంది వ్యాధి మూడో, నాలుగో దశలలో మాత్రమే డాక్టర్లను సంప్రదిస్తుండటంతో ప్రాణనష్టాన్ని తగ్గించటం సాధ్యపడటంలేదు. 

Consult Our Experts Now

రొమ్ము కాన్సర్: రొమ్ములోని కణాలు అనియంత్రితంగా పెరిగి గడ్డగా ఏర్పడటం ద్వారా ఈ కాన్సర్ వస్తుంది. అక్కడి నుంచి అది మెడ – చంక భాగంలోని లింఫ్ నోడ్స్ ద్వారా,  చాతీ ఎముక – కాలర్ బోన్  గుండా శరీరంలోని  ఇతర భాగాలకు వ్యాపిస్తుంది.రొమ్ము వయస్సు పెరుగుతున్న కొలదీ రొమ్ముకాన్సర్ సోకే అవకాశాలు పెరుగుతుంటాయి. రొమ్ములో చిన్నది గా ప్రారంభమైన గడ్డ పెద్దదయి గట్టిగా తయారవుతుంది. రొమ్ము పరిమారణం, రూపం హఠాత్తుగా మారిపోతుంది. రొమ్ము చర్మంపై  దురదలు మొదలవుతాయి. చర్మం ఎర్రబారుతుంది.ఈ కాన్సర్ లక్షణాలలో రొమ్ము వాపు కూడా ఉంటుంది.

 భారతీయ మహిళలలో కనిపించే కాన్సర్లలో 25 నుంచి 32 శాతం వరకూ రొమ్ము కాన్సరే ఉంటున్నది. ప్రతీ ఇరవై ఎనిమిది మంది భారతీయ మహిళలో ఒకరికి జీవితకాలంలో రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు  అంచనా. రొమ్ము కాన్సర్ మనదేసంలోని నగరాలు, పట్టణ ప్రాంతాలలో మొదటి స్థానంలో, గ్రామీణ ప్రాంతాలలో రెండో స్థానంలో ఉంది. ఇదివరకటి రోజులతో పోలిస్తే ఇపుడు చిన్నవయసులోనే ఈ కాన్సర్ బయటపడుతోంది.  మనదేశంలో ప్రస్తుతం రొమ్ము కాన్సరు ఉన్నట్లు గుర్తించిన మహిళలలో దాదాపు 60 శాతం మంది 35-50 సంవత్సరాల మధ్య వయస్సు వారే.

సర్వైకల్(గర్భాశయ ముఖద్వార)కాన్సర్: రొమ్ముకాన్సర్ తరువాత అధిక సంఖ్యలో భారతీయ మహిళల మరణానికి కారణమవుతున్న కాన్సర్ ఇది. మనదేశంలో ఏటా కనీసం 75 వేల మంది స్త్రీలు  గర్భాశయ ముఖద్వార కాన్సర్ కారణంగా చనిపోతున్నారు. ఒక అంచనా ప్రకారం జనాభాలోని  ప్రతీ లక్షమందిలో 20-25 మందిలో ఈ కాన్సరు లక్షణాలు ఉన్నాయి. 1990 దశకంలో సుమారు 35 వేలు ఉండిన ఈ కాన్సర్ మరణాల సంఖ్య  పెరిగి 2016 సంవత్సరంలో డెబ్బయ్ అయిదు వేలకు చేరుకున్నది. నెలసరి సమయంలో అజాగ్రత్తగా (అపరిశుభ్రంగా) వ్యవహరించటం, చిన్నవయస్సులో పెళ్లి – లైంగిక సంబంధాలు ఏర్పరచుకోవటం, అధిక సంతానం,  లైంగిక వ్యాధుల తాలూకు బాక్టీరియాల కారణంగా ఈ కాన్సరు వస్తుంది.

నోటి కాన్సర్:  పురుషుల్లో అత్యధిక మరణాలకు కారణమవుతున్న కాన్సర్లు ఇవి. పెదవులు, నాలుక, నోటి దిగుభాగం, సైనస్, గొంతు భాగాలలో  నోటి కాన్సర్లు కనిపిస్తాయి. చాలా వరకు నాలుక , నోటి క్రింది  భాగం నుంచే ఈ కాన్సర్లు మొదలవుతాయి. అక్కడ చర్మం పై పొరలలో ప్రారంభమైన కాన్సరును గుర్తించి చికిత్సచేయటంలో ఆలస్యంతో అది నోటిలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. స్త్రీలతో కూడా నోటికాన్సర్లు వస్తున్నా వారితో  పోలిస్తే పురుషులు ఈ కాన్సరు బారిన పడే అవకాశాలు రెండు రెట్లు అధికం. పొగాకు వాడకం (పొగతాగటంతోపాటు, గుట్కా-నస్యం వంటి పొగలేని పొగాకు), మద్యపానం, పోషకాహార లోపం వంటివి ఈ కాన్సరుకు దారితీస్తున్నాయి.

ప్రొస్టేట్ గ్రంధి కాన్సర్: భారతీయ పురుషులలో సాధారణంగా కనిపిస్తూ పెద్ద సంఖ్యలో మరణాలకు కారణమవుతున్న  కాన్సర్లలో ఇది ఒకటి. దేశ జనాభాలోని ప్రతీ లక్ష మందిలో 9 మందికి ఈ కాన్సర్ వచ్చే అవకాశం ఉంది. వ్యక్తి వయస్సు పెరుగుతున్న కొలదీ ప్రొస్టేట్ కాన్సర్ తలెత్తే అవకాశాలు ఎక్కువ అవుతుంటాయి.  ప్రోస్టేట్ గ్రంధి పురుషులలో లైంగిక అంగానికి పై భాగంలో మూత్రకోశానికి దిగువన ఉంటుంది.  ఏభయో ఏటి నుంచీ ప్రొస్టేట్ గ్రంధిలో మార్పులు జరుగతూ కాన్సర్ ఏర్పడే అవకాశాలు చాలా వేగంగా పెరుగుతూంటాయి. వయస్సు పెరగటం, పొగతాగటం, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం, ఊబకాయం తోపాటు వంశపారంపర్యంగా కూడా ఈ కాన్సర్ వస్తునట్లు గుర్తించారు. ఇతర కాన్సర్ రకాలకు భిన్నంగా ప్రొస్టేట్ కాన్సర్ ఆ గ్రంధికే పరిమితం అవుతుంది.ఇతర శరీర భాగాలకు వ్యాపించదు.

శ్వాసకోశాల కాన్సర్: శ్వసకోశాలలో గడ్డ, బుడిపెగా ఈ కాన్సర్ ఏర్పడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణంగా కనిపిస్తున్న కాన్సర్ . మన దేశంలో పురుషుల మరణాలకు కారణమౌవుతున్న

కాన్సర్లలో ఇది రెండో స్థానంలో ఉంది. దేశంలో ఏటా నమోదయ్యే కాన్సర్ కేసులలో 6.9శాతం కేసులకు,9.3 శాతం కాన్సర్ మరణాలకు ఇది కారణమవుతున్నది . జనాభాలోని ప్రతీ లక్షమంది సుమారు 28 మంది ఈ వ్యాధి బారి పడుతున్నట్లు అంచనా. ఏటా పద్దెనిమిది లక్షల మందిలో ఈ కాన్సరును గుర్తిస్తున్నారు. దేశంలో శ్వాసకోశాల కాన్సర్ కేసులు 15 -20 శాతం వార్షిక రేటున పెరుగుతున్నాయి.  స్త్రీపురుషులు ఇద్దరిలోనూ ఈ కాన్సర్ కనిపిస్తున్నప్పటికీ పురుషులలోఅధికంగా ఉంటున్నది. 40 సం.లకు పై బడిన వారు ప్రధానంగా పొగతాగటం వల్ల ఊపిరితిత్తుల కాన్సరుకు గురవుతున్నారు.  పొగతాగా వారి పక్కన ఉండటం(పాసివ్ స్మోకింగ్), వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం కూడా ఈ కాన్సరుకు కారణం అవుతున్నాయి.

కాలేయపు కాన్సర్:  పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్న కాన్సరలో కాలేయ కాన్సర్ ఒకటి. దేశ జనాభాలోని ప్రతీ లక్షమందిలో 3-5 మంది కాలేయపుకాన్సర్ బారిన పడుతున్నట్లు అంచనా. ఏటా సగటున ఏభై వేల మందిలో  కొత్తగా కాలేయుపు కాన్సరును గుర్తిస్తున్నారు. హెపటైటిస్ బి, సి వైరసుల వల్ల, మితిమీరిన మద్యపానం వల్ల వచ్చే ఈ వ్యాధి బాగా ముదిరిన తరువాత గాని లక్షణాలు బయటపడకపోవటంతో మరణాలకు కారణం అవుతుంది. ఊబకాయం, షుగర్ వ్యాధి, ఇంట్రావీనస్ పద్దతిన మత్తుమందులు(డ్రగ్స్) ఉపయోగించటం వల్ల కూడా కాలేయపు కాన్సర్ వస్తున్నట్లు గుర్తించారు.

Consult Our Experts Now

సరైన సమయంలో చికిత్సచేస్తే కాన్సర్ ప్రాణాంతకం కాదు:

గడచిన కొన్ని దశాబ్దాల కాలంలో  కాన్సర్ల చికిత్స చాలా అభివృద్ధి చెందింది. కాన్సర్ ఔషధాలుగా ఉపయోగపడగల  కొత్త  రసాయనిక అణువుల ఆవిష్కరణతో కిమోథెరపీ అసాధారణ స్థాయిలో అభివృద్ధి చెందింది. ఆస్పత్రిలో చేరకుండా అవుట్ పేషంటుగా కూడా తమ వద్ద కిమోథెరపడీ చేయించుకోవచ్చునని, ఇందుకోసమని ప్రత్యేకంగా కీమోథెరపీ డిస్పెన్సింగ్ విభాగం పనిచేస్తోందని  యశోద హాస్పిటల్స్ కుచెందిన యశోద కాన్సర్ ఇనిస్టిట్యూట్ లోని వైద్యనిపుణులు చెప్పారు. కీమోథెరపీ దుష్ఫలితాలను దాదాపుగా అంతరించి వ్యాధి ఉపశమన వేగం పెరిగిందని అదే సమయంలో రేడియేషన్ థెరపీ కూడా అసాధారణ స్థాయి ఖచ్చితత్వంతో కాన్సర్ కణాలను నిర్మూలించగలుగుతోంది వారు  వెల్లడించారు. కీమోథెరపీ- రేడియేషన్ థెరపీ ద్వారా కాన్సర్ గడ్డ పరిమాణంలో కుదించుకుపోయేట్లు చేసి ఆపైన సర్జరీ చేయటం ఖచ్చితంగా కాన్సర్ నిర్మూలన సాధ్యపడుతుందనితెలిపారు. కాన్సరు చికిత్సకు  సంబంధించి తమ సంస్థలో అత్యాధునిక ఏర్పాట్లతోపాటు వివిధ విభాగాలలో విశేష అనుభవం ఉన్న నిపుణులు నిరంతరం  అందుబాటులో సమన్వయంతో పనిచేయటం ద్వారా  ద్వారా అత్యత్తమ ఫలితాలు సాధించగలుగుతున్నట్లు వారు చెప్పారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కాన్సర్ల చికిత్స రంగంలో విశేష కృషిచేస్తున్న ఆస్పత్రులు, వైద్యకేంద్రాలలో వలే  కాన్సర్లను  విజయవంతంగా అదుపుచేయ గలుగుతున్నామని వారు తెలిపారు.

 

యశోద కాన్సర్ ఇనిస్టిట్యూట్

యశోద హాస్పిటల్స్, హైదరాబాద్.

సికింద్రాబాద్ – సోమాజిగూడ – మలక్ పేట్

 

 

X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567