స్లీవ్ గాస్ట్రెక్టమీ మరియు గ్యాస్ట్రిక్ బైపాస్; ( వీటిలో మీకు తగినచికిత్స ఏది ?)
1. స్లీవ్ గాస్ట్రెక్టమీ అంటే ఏమిటి?
2. బరువు తగ్గడానికి స్లీవ్ గాస్ట్రెక్టమీ ఏవిధంగా సహాయపడుతుంది?
3. శస్త్రచికిత్సకు ఎంత సమయం పడుతుంది?
4. శస్త్రచికిత్స అనంతరం కలిగే ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా?
5. గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ అంటే ఏమిటి?
6. గ్యాస్ట్రిక్ బైపాస్ శస్త్రచికిత్స బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుంది?
స్లీవ్ గాస్ట్రెక్టమీ మరియు గ్యాస్ట్రిక్ బైపాస్ అనేవి సాధారణంగా చేయబడే బేరియాట్రిక్ శస్త్రచికిత్సలు.
BMI ఎక్కువగా ఉంటే, అధిక రక్తపోటు, టైప్ 2 మధుమేహం లేదా తీవ్రమైన స్లీప్ అప్నియా వంటి తీవ్రమైన బరువు సంబంధిత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. సాధారణంగా, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ లేదా గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ వంటి బేరియాట్రిక్ శస్త్రచికిత్సలు భారతీయ జనాభాలో తీవ్రమైన ఊబకాయం BMI 37.5 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వ్యక్తులకు సిఫారసు చేయబడతాయి. స్లీవ్ గాస్ట్రెక్టమీతో పోలిస్తే గ్యాస్ట్రిక్ బైపాస్ అనేది కొంచెం క్లిష్టమైన ప్రక్రియ. గ్యాస్ట్రిక్ బైపాస్ అనేది రెండు దశల ప్రక్రియ, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీలో కేవలం ఒక దశ మాత్రమే ఉంటుంది. బరువు తగ్గడానికి సిఫారసు చేసినప్పుడు శస్త్రచికిత్స రకం రోగి యొక్క ఆరోగ్యపరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఈ బ్లాగ్ రెండు శస్త్రచికిత్సల యొక్క లాభనష్టాలను వివరించుతుంది మరియు చికిత్స పొందాలనుకునేవారికి సరైన చికిత్స ప్రణాళికను గుర్తించడంలో సహాయపడుతుంది.
స్లీవ్ గాస్ట్రెక్టమీ అంటే ఏమిటి?
స్లీవ్ గాస్ట్రెక్టమీ శస్త్రచికిత్సలో, కడుపులో ఎక్కువ భాగం తొలగించబడుతుంది, ఇది కొత్త పొట్టను ఒక చిన్న ‘అరటి లాంటి గొట్టం “ గా చేస్తుంది. ఇది ఒకేసారి తీసుకోగల ఆహార పరిమాణాన్ని పరిమితం చేస్తుంది. అలాగే, పొట్టలోని fundus’ను తొలగించడంతో, ghrelin హార్మోన్ తగ్గుతుంది మరియు ఇది ఆ వ్యక్తికి ఆకలిని తగ్గిస్తుంది. ghrelin అనేది కడుపు యొక్క fundus ద్వారా ఉత్పత్తి చేయబడే హార్మోన్, ఇది ఒక వ్యక్తికి తినాలి అనే ఆసక్తిని మరియు ఆకలిని నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి అయ్యే కొద్దీ ఆకలి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉపవాసం ఉన్నప్పుడు, ఈ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది మరియు వారికి చాలా ఆకలిగా అనిపిస్తుంది.
బరువు తగ్గడానికి స్లీవ్ గాస్ట్రెక్టమీ ఏవిధంగా సహాయపడుతుంది?
ఒక వ్యక్తి తీసుకునే ఆహారం పరిమాణాన్ని తగ్గించడంపై, బరువు తగ్గడం అనేది పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఆహారం తీసుకోవడం తగ్గించడం ద్వారా, తీసుకునే కేలరీల పరిమాణాన్ని పరిమితం చేస్తుంది మరియు మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అందువల్ల, వైద్య పరంగా, ఈ ప్రక్రియను పూర్తిగా restrictive ప్రక్రియ అని కూడా అంటారు. శస్త్రచికిత్స తరువాత రాబోయే 6-12 నెలల్లో ఒక వ్యక్తి అధిక బరువులో 50-60% తగ్గుతారు అని ఆశించవచ్చు .
శస్త్రచికిత్సకు ఎంత సమయం పడుతుంది?
సాధారణంగా శరీరం తీరును బట్టి శస్త్రచికిత్స 1-2 గంటలు పడుతుంది. ఇది minimally invasive surgery , లాప్రోస్కోపిక్ ద్వార ఈ చికిత్స చేయబడుతుంది.మరియు శరీరంపై 4-5 చిన్న గాట్లు అవసరం అవుతాయి. శస్త్రచికిత్స తరువాత, నొప్పి మరియు వికారం ఇతర ఆరోగ్యపరిస్థితులను బట్టి రోగి కనీసం 1-2 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుంది.
శస్త్రచికిత్స అనంతరం కలిగే ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా?
అనుభవజ్ఞులైన మరియు నిపుణులు అయిన సర్జన్ల బృందం ద్వారా నిర్వహించబడినట్లయితే ఈ ప్రక్రియతో తక్షణ ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. అత్యంత సాధారణ దీర్ఘకాలిక ఇబ్బంది Gastroesophageal Reflux లేదా గుండెల్లో మంట కలగడం, ఇది రోగుల్లో 5% కంటే తక్కువ మందిలో జరగవచ్చు. ఈ పరిస్థితి నుంచి ఉపశమనం పొందడం కొరకు రోగి దీర్ఘకాలిక ప్రాతిపదికన యాంటాసిడ్లను ఉపయోగించాల్సి రావచ్చు.పొట్ట సాగిపోవటం దీనిలోని మరో సమస్య . ఒకవేళ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ సరిగ్గా చేయనట్లయితే, దాని ఫలితంగా బరువు తిరిగి పొందవచ్చు. రోగి క్రమం తప్పకుండా విటమిన్లను తీసుకొని, నియమానుసారంగా సర్జన్ మరియు డైటీషియన్ తో ఫాలోప్ చేసినట్లయితే, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీతో విటమిన్ లోపాల రేటు తక్కువగా ఉంటుంది.
గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ అంటే ఏమిటి?
గ్యాస్ట్రిక్ బైపాస్ శస్త్రచికిత్సలో, పొట్ట 2 భాగాలుగా విభజించబడుతుంది: మీ అన్నవాహిక లేదా ఆహార నాళంతో అనుసంధానించబడిన ఒక చిన్న సంచి మరియు గ్యాస్ట్రిక్ remnant అని పిలువబడే పెద్ద భాగం. పైన పేర్కొన్న చిన్నపౌచ్, చిన్న ప్రేగు భాగానికి కనెక్ట్ చేయబడుతుంది, ఇది మళ్లించబడుతుంది.
గ్యాస్ట్రిక్ బైపాస్ శస్త్రచికిత్స బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుంది?
శస్త్రచికిత్స వలన ఆహారం చిన్న సంచి నుండి నేరుగా చిన్న ప్రేగులోకి వెళుతుంది , ఫలితంగా మిగిలిన కడుపు, కాలేయం మరియు ప్యాంక్రియాటిక్ రసాల నుండి బైపాస్ అవుతుంది, ఇది తరువాత జీర్ణక్రియ మరియు శోషణను పరిమితం చేస్తుంది. ఇది శరీరం శోషించుకునే కేలరిలను గ్రహించాటాన్ని పరిమితం చేసే malabsorptionని సృష్టిస్తుంది. అందువల్ల, వైద్య పరంగా, ఈ ఆపరేషన్ ని నిర్బంధ మరియు malabsorption ప్రక్రియ యొక్క కలయిక అని అంటారు.
సాధారణ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ రోగి కంటే ఈ రోగుల్లో బరువు తగ్గడం కొంచెం ఎక్కువగా ఉంటుంది. శస్త్రచికిత్స తరువాత రాబోయే 12-18 నెలల్లో రోగి అధిక బరువులో 60-75% తగ్గుతుందని ఆశించవచ్చు.
ప్రేగు యొక్క రీ-రూటింగ్ ఇన్సులిన్ ను నియంత్రించే హార్మోన్లలో మార్పులను మరియు రెసిస్టన్స్ సృష్టిస్తుంది. దీని ఫలితంగా స్లీవ్ గ్యాస్ట్రెక్టమీతో పోలిస్తే ఈ సందర్భాల్లో డయాబెటిస్ మెల్లిటస్ లో గణనీయమైన మెరుగుదల ఏర్పడుతుంది.
ఈ శస్త్రచికిత్స సాధారణంగా అధికబరువు మరియు డయాబెటిస్ మెల్లిటస్ మరియు హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న రోగుల కోసం ముఖ్యంగా సూచించబడింది.
శస్త్రచికిత్సకు ఎంత సమయం పడుతుంది?
శస్త్రచికిత్స పూర్తి కావడానికి సాధారణంగా 2-3 గంటలు పడుతుంది. మరియు శరీరంపై 5-6 చిన్న గాటులతో లాప్రోస్కోపిక్ చికిత్సగా కూడా నిర్వహించబడుతుంది. సాధారణంగా, ఆపరేషన్ తరువాత రోగి 2-3 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుంది.
శస్త్రచికిత్స అనంతరము ఏర్పడే సమస్యలు ఏవైనా ఉన్నాయా?
ఈ శస్త్రచికిత్సవలన (dumping syndrome) డంపింగ్ సిండ్రోమ్ అభివృద్ధి చెందుట ఒకలోపం గా చెప్పవచ్చు .(కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారాలను తిన్న తరువాత పొట్టలోపోట్లు మరియు కొన్నిసార్లు మగతగా అనిపిస్తుంది). బైపాస్ పక్కన కడుపులో అల్సర్లు అభివృద్ధి చెందేఅవకాశం కూడా ఉంది . అనుభవజ్ఞులైన బృందం ద్వారా సరిగ్గా చికిత్స చేయబడినట్లయితే ఈ దుష్ప్రభావాలన్నింటినీ బాగా తగ్గించవచ్చు .
బరువు తగ్గడం అనేది వ్యక్తి మరియు శస్త్రచికిత్స చేసే విధానం పై ఆధారపడి ఉంటుంది.
ఈ రెండు ఆపరేషన్లు నిపుణుల చేతుల్లో నిర్వహించినట్లయితే గణనీయమైన బరువు తగ్గడానికి దారితీస్తుంది, ఇది మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ మరియు స్లీప్ అప్నియాతో సహా ఊబకాయం సంబంధిత పరిస్థితులను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. అందువల్ల, సర్జన్ తో పూర్తిగా చర్చించడం మరియు మార్గదర్శకాలను అనుసరించి తరువాత రోగి అవసరాన్ని బట్టి మరియు శరీర పరిస్థితిని బట్టి సరైనదానిని గుర్తించాలి. శస్త్రచికిత్స తరువాత సర్జన్ మరియు వైద్య బృందాన్ని రెగ్యులర్ గా కలుస్తూ ఉండడం కూడా రోగికి ముఖ్యం. ఏదైనా సమస్యలు రాకుండా ఉండడానికి మరియు, నిరోధించడానికి లేదా ఏదైనా శస్త్రచికిత్స తరువాత తిరిగి బరువురాకుండా ఉండడానికి ఇది సహాయపడుతుంది.