సైనసైటిస్ (సైనస్ ఇన్ఫెక్షన్): రకాలు, లక్షణాలు, కారణాలు మరియు చికిత్సలు
వాతావరణం మారిందంటే జలుబు చేయడం సహజం. కానీ, వాతావరణం తో సంబంధం లేకుండా తరచుగా జలుబు చేస్తూ ఉంటే మాత్రం అది సైనసైటిస్ ఇన్ఫెక్షన్ కి దారి తీయొచ్చు. ముఖంలో , కళ్ల దగ్గర, ముక్కు పక్క భాగాల్లోని ఎముకల్లో ఉండే సన్నని గాలితో నిండిన కావిటీస్ లను సైనస్‌లు అంటారు. ఈ భాగంలో ఇన్ఫెక్షన్ సోకి, ద్రవంతో నిండినప్పుడు, సూక్ష్మక్రిములు వృద్ధి చెందుతాయి మరియు సంక్రమణకు కారణమవుతాయి. ఈ పరిస్థితిని సైనసైటిస్ అంటారు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య వయస్సు మరియు లింగబేధం లేకుండా అందరికి వస్తుంది. సైనసైటిస్ సమస్య నిత్య జీవితంలో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది.
సైనసైటిస్ సమస్య కొంతమందిలో దీర్ఘకాలం గా బాధిస్తుంది. కొన్ని నెలల నుండి సంవత్సరాల వరకు బాధించే అవకాశం ఉంది.
సైనసైటిస్ రకాలు
సైనసిటిస్‌లో నాలుగు ప్రధాన రకాలు ఉన్నాయి:
ఫ్రంటల్ సైనసైటిస్: నుదిటి ఎముక లోపల ఉంటుంది. ఈ రకమైన సైనసైటిస్ తో బాధపడే వారిలో కనుబొమ్మల వద్ద నొప్పి ఉంటుంది.
మాగ్జిలరీ సైనసైటిస్: మన చెంప ఎముకలతో అనుసంధానమయ్యి ముక్కుకు ఇరువైపులా ఉంటుంది ఈ రకమైన సైనసైటిస్ తో బాధపడే వారిలో దవడ ఎముకల వద్ద నొప్పి ఉంటుంది.
స్పెనాయిడ్ సైనసైటిస్: ముక్కుకు చాలా వెనుకగా ఉంటుంది. ఈ రకమైన సైనసైటిస్ తో బాధపడే వారిలో తల మధ్యలో లేదా వెనకవైపు నొప్పి ఉంటుంది.
ఎథ్మాయిడ్ సైనసైటిస్: కళ్ల మధ్య మన ముక్కుకు ఇరువైపులా ఉంటుంది. ఈ రకమైన సైనసైటిస్ ఉన్న వారిలో కళ్ల చుట్టూ నొప్పి ఉంటుంది.
సైనసైటిస్ యొక్క వర్గీకరణ & దశలు
లక్షనాల తీవ్రతను బట్టి, సైనసిటిస్‌ను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు:
అక్యూట్ సైనసైటిస్: ఇది సైనసైటిస్ యొక్క అత్యంత సాధారణ రకం. 4 వారాల కంటే తక్కువ కాలం పాటు సైనస్‌లు ఎర్రబడినప్పుడు మరియు ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పుడు ఇది సంభవిస్తుంది. తీవ్రమైన సైనసిటిస్ సాధారణంగా వైరస్ & బ్యాక్టీరియాల వల్ల వస్తుంది.
సబాక్యూట్ సైనసైటిస్: ఈ రకమైన సైనసైటిస్ 4 -12 వారాల వరకు ఉంటుంది. ఇది సాధారణంగా బ్యాక్టీరియా వల్ల వస్తుంది, అయితే ఇది వైరస్ లేదా ఫంగస్ వల్ల కూడా రావొచ్చు.
దీర్ఘకాలిక సైనసిటిస్: దీర్ఘకాలిక సైనసిటిస్ ను క్రానిక్ సైనసిటిస్ లేదా దీర్ఘకాలిక రైనోసైనసిటిస్ అని కూడా పిలుస్తారు. ఈ సైనసైటిస్ యొక్క లక్షణాలు 12 వారాల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు నిర్ధారణ అవుతుంది. ఇది సాధారణంగా బ్యాక్టీరియా వల్ల వస్తుంది.
సైనసైటిస్ యొక్క లక్షణాలు
- సాధారణ జలుబు
-
తల భారం
-
ముక్కు దిబ్బడ & దురద
- కళ్ల చుట్టూ & కనుబొమ్మల వద్ద నొప్పి
-
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- వాసన తెలియకపోవడం
- గొంతు నొప్పి
- గొంతు బొంగురు పోవడం
- ముక్కు నుంచి రక్తం కారడం
-
దవడల చుట్టూ నొప్పి
- కఫం గొంతు వెనకభాగంలోకి రావడం
కొన్నిసార్లు దగ్గు, కళ్లు ఉబ్బినట్లు అనిపించడమే కాక ముఖం మొత్తం వాపు, కోపం,విసుగు, అలసట, పనిపై శ్రద్ధ లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
సైనసైటిస్ కు గల కారణాలు
సైనసైటిస్ సమస్యకు అనేక కారణాలు కలవు.
• కాలుష్యం, జలుబు, వైరల్ ఇన్‌ఫెక్షన్లు, బ్యాక్టీరియా & ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి ఇన్‌ఫెక్షన్లు ముక్కులోని నిర్మాణాలను ప్రభావితం చేసి వాపుకు దారితీస్తాయి
• అలెర్జీలు, పొగ, వాతావరణ కాలుష్యం, గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంది
• డయాబెటిస్, ఊపిరితిత్తుల సిస్టిక్ ఫైబ్రోసిస్, హెచ్‌ఐవి, కీమోథెరపీ వంటి వైద్య పరిస్థితులు రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచి, సైనసైటిస్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి
• ముక్కులో ఎముక వంకరగా ఉన్నా, పిల్లల్లో ఎడినాయిడ్ సమస్యతో బాధపడుతున్న కూడా సైనసైటిస్ సమస్యకు గురవుతుంటారు
• ముక్కు లోపలి రుగ్మతల వాళ్ళ (సెప్తాల్ దేవియేషన్, నసల్ పోలీప్స్) సైనసైటిస్ తీవ్రతను పెచుతాయి.
• చల్లని వాతావరణం, కాలుష్యం మరియు ధూమపానం కూడా సైనస్ ఇన్ఫెక్షన్లు సహాయపడతాయి.
సైనసైటిస్ యొక్క నివారణ చర్యలు
సైనస్ సమస్య తీవ్రంగా వేధించినప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లలో తప్పకుండా మార్పులు చేసుకోవాలి.
• ముఖ్యంగా సైనస్ బాధల్ని పెంచే అలర్జీ కారకాలైన దుమ్ము ధూళి, కాలుష్యం ఉన్న ప్రదేశంలో వెళ్లకూడదు.
• ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసిన డ్రింక్స్, ఆహార పదార్థాలు తీసుకోవడం మరియు చల్ల గాలికి తిరగడం చేయకూడదు.
• సైనసైటిస్ సమస్య ఉన్న వారు ఫ్యాన్ కింద పడుకోవడం చేయకూడదు, దీనివల్ల సమస్య మరింత తీవ్రతరమవుతుంది.
• చలికాలంలో చెవులకు చల్లని గాలి తగలకుండా చెవిలో దూది పెట్టుకోవాలి.
• నాసికా రంధ్రాలు మూసుకుపోయినట్లు అనిపించినా లేదా తరచుగా ముక్కు కారుతున్న సమయంలో ఆవిరి తీసుకోవడం వల్ల కొంతమేర ఉపశమనం కలుగుతుంది.
• సైనస్ క్లియర్‌గా ఉంచే వ్యవస్థను ధూమపానం అలవాటు పాడుచేస్తుంది కావున స్మోకింగ్ ను మానేయడం మంచిది.
• ఈత కొలనులో ఎక్కువ సమయం కేటాయించవద్దు. ఎందుకంటే అది ముక్కు లోపలి దళసరి చర్మాన్ని దెబ్బతింటుంది.
• సైనసైటిస్ సమస్యతో బాధపడే వారు ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం మంచిది. (ఇది మీ శరీరం యొక్క ఇన్ఫ్లమేషన్ తో పోరాడటానికి సహాయపడుతుంది).
• మద్యం సేవించడం వల్ల సైనస్ సమస్యలు మరింతగా పెరుగుతాయి. కావున, మద్యం తీసుకోకపోవడం మంచిది.
• రోగ నిరోదక శక్తినీ ప్రభావితం చేసే డయాబెటిక్, క్యాన్సర్, హెచ్‌ఐవీ ఉన్నటువంటి పేషెంట్లు, అవయవ మార్పిడి చేసుకున్న వారు కూడా వైద్య నిపుణులను సంప్రదించాలి.
సైనసైటిస్ చికిత్స పద్దతులు
సైనసైటిస్ లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. జలుబు, అలర్జీలను తగ్గించే ముందులు, ముక్కు దిబ్బడను తగ్గించే డీ-కంజెస్టెంట్స్ను వాడటం ద్వారా ముక్కు రంధ్రాలను శుభ్రం చేయడంతో సైనస్ బాధలను స్వీయ రక్షణ ద్వారా నియంత్రించుకోవచ్చు.
సైనస్ లక్షణాలను త్వరగా గుర్తించి, చికిత్స తీసుకోవడం ఉత్తమం. నేసల్ ఎండోస్కోపీ, సీటీ స్కాన్ విధానం ద్వారా ముక్కులో ఏదైనా సమస్య తెలుస్తుంది. ఆపరేషన్ అంటే భయంతో చాలామంది సైనస్ ట్రీట్ మెంట్ తీసుకోవడానికి వెనుకంజ వేస్తుంటారు. కానీ, ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన అధునాతనమైన పద్ధతుల వల్ల చాలా సులువుగా సర్జరీ పక్రియ అయిపోతుంది. అయినా మందులు క్రమం తప్పకుండా వాడితే చాలావరకు ఆపరేషన్ అవసరం లేకుండానే సైనసైటిస్ సమస్య నుంచి బయటపడవచ్చు.
మాటిమాటికి జలుబు అవుతుందనుకున్నా, చల్లని వాతావరణంలో, చల్లని వస్తువుల వల్ల తలనొప్పి వస్తున్నా, వెంటనే అవసరమైన టెస్టులు చేయించి సమస్య పెద్దది కాకుండానే చికిత్స చేయించుకోవడం ఉత్తమం. నాలుగు వారాల కంటే ఎక్కువగా సైనసైటిస్ లక్షణాలు కనిపిస్తే ఈఎన్‌టీ వైద్యుడిని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఒకవేళ చికిత్స తీసుకోవడంలో మరింత ఆలస్యం జరిగితే సైనస్ ఇన్ఫెక్షన్లు ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు సైతం దారి తీయవచ్చు.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262676 మాకు కాల్ చేయగలరు.