%1$s

వేసవి కాలంలో కాబోయే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Precautions to be taken by expectant mothers during the summer

వేసవి కాలం, వేడి గాలులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.

అధిక ఉష్ణోగ్రతలకు ఎక్కువగా గురికావడం వల్ల వేడి అలసటకు దారితీస్తుంది, ఇది అధికవేడి  మరియు వడదెబ్బకు దారితీస్తుంది.

పిల్లలు (శిశువులు మరియు పసిబిడ్డలు) మరియు వృద్ధులు (>65 సంవత్సరాలు), కాబోయే తల్లులలో వేసవి సమస్యలు ఎక్కువగా  ఉంటాయి. 

అధిక శారీరిక శ్రమచేసేవారిలో లేదా ఎక్కువ గంటలు ఎండకు బహిర్గతం అయ్యే వ్యక్తులలో మరియు కొన్ని రకముల  ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో కూడా వేసవి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

ఈ సమస్యను అధిగమించడానికి నిర్జలీకరణకు గురి కాకుండా ఉండటానికి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.

కాబోయే తల్లులు – వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

1) చల్లగా మరియు హాయిగా ఉండే గదిలో విశ్రాంతి తీసుకోండి.

2) ఎండ ఎక్కువగా ఉన్నపుడు, బయట తిరగకండి. బయటకి వెళ్లాల్సి వస్తే – గొడుగు, మంచినీరు తప్పనిసరి తీసుకొనివెళ్ళండి. SPF  ఎక్కువ ఉండే సన్స్క్రీన్ ధరించండి.

3) కాటన్ మరియు వదులుగా ఉండే దుస్తులు ధరించండి.

4) నూనె పదార్థాలు, మసాలా పదార్థాలు నివారించండి. పండ్లు, కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.

5) తరచుగా మంచినీరు మరియు ద్రవాలు, ప్రతి రెండు గంటలకు ఒకసారి తీసుకోవలెను.

6) రోజుకు రెండుసార్లు స్నానం చేయడం ద్వారా మీ శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.

7) తేలికపాటి వ్యాయామాలు చేయవలెను.

8) ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. ఉప్పు తక్కువగా స్వీకరించండి.

9) కాళ్ళు కొంచెం ఎత్తులో పెట్టుకొని పడుకోవాలి.

10) మధ్యాహ్నం కనీసం అరగంట విశ్రాంతి తీసుకోవాలి.

11)  దానిమ్మ, పుచ్చకాయ వంటి పండ్లను, కొబ్బరి నీరు, చెరుకురసం వంటి ద్రవాలను తరచుగా తీసుకోవటం వలన నిర్జలీకరణకు గురికాకుండా కాపాడుకోవచ్చు.

గర్భిణీ స్త్రీలు సరిగ్గా తినలేక ఈ ఎండలు వల్ల తీవ్ర సమస్యకు గురవుతుంటారు. మానసికంగా కూడా ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఇటువంటి సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. 

ఈ వేసవిలో, ఆరోగ్యంగా, సురక్షితంగా, చల్లగా మరియు హైడ్రేటెడ్ గా ఉండండి. అదేవిధంగా, ఒకవేళ మీరు నిర్జలీకరణం లేదా వడదెబ్బ యొక్క ఏవైనా లక్షణాలను ఎదుర్కొంటున్నట్లయితే, దయచేసి వైద్య నిపుణులను సంప్రదించండి.

About Author –

Dr. M. V. Jyothsna, Consultant Gynaecologist, Yashoda Hospital, Hyderabad
MS (Obs & Gynecology)

Best Gynaecologist in India

Dr. M. V. Jyothsna

MBBS, MS (Obs & Gyn), Fellow in Robotic Surgery (FICRS), Fellow in Artificial Reproductive Technique (IVF/ICSI) (Delhi)
Laparoscopic Surgeon & Robotic Surgeon, Consultant Obstetrician & Gynecologist

X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567