%1$s

పోస్ట్- వైరల్ ఆర్థరైటిస్ గురించి పూర్తి అవగాహన మరియు సమాచారం

Viral Arthritis Telugu Banner

కొంతమంది వ్యక్తులకు, వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తరువాత కూడా కీళ్లలో వాపు మరియు నొప్పి కొనసాగవచ్చు ఈ పరిస్థితినే పోస్ట్-వైరల్ ఆర్థరైటిస్ అంటారు. మీరు అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత కూడా కీళ్లలో నొప్పి మరియు అసౌకర్యంతో బాధపడుతుంటే, అది ఎందుకు జరుగుతుందో మరియు దానిని ఎలా నిర్వహించాలో అర్థం చేసుకోవడానికి ఈ బ్లాగ్ మీకు సహాయపడవచ్చు.

పోస్ట్- వైరల్ ఆర్థరైటిస్ అంటే ఏమిటి

పోస్ట్-వైరల్ ఆర్థరైటిస్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత సంభవించే కీళ్ల వాపు. ఇన్ఫెక్షన్ పోయినప్పుడు, రోగనిరోధక వ్యవస్థ యొక్క ప్రతిస్పందన కొన్ని సార్లు ఆలస్యం కావచ్చు, దీని వలన మీ కీళ్లలో మంట మరియు నొప్పి వస్తుంది. ఇతర ఆర్థరైటిస్ వలే కాకుండా పోస్ట్- వైరల్ ఆర్థరైటిస్ లో వైరస్ నేరుగా కీళ్లపై దాడి చేయదు. బదులుగా, మీ రోగనిరోధక వ్యవస్థ స్పందించే విధానం వల్ల ఆర్థరైటిస్ వంటి లక్షణాలకు దారితీస్తుంది.

పోస్ట్-వైరల్ ఆర్థరైటిస్‌కు కారణమయ్యే అత్యంత సాధారణ వైరస్‌లు:

  • చికున్‌గున్యా (CHIKV)
  • డెంగ్యూ (ఎడెస్ ఈజిప్టి)
  • ఇన్‌ఫ్లుఎంజా లేదా (ఫ్లూ)
  • రుబెల్లా మరియు రెట్రోవైరస్లు
  • హెపటైటిస్ B మరియు C
  • పార్వోవైరస్ B19
  • కోవిడ్-19

పోస్ట్-వైరల్ ఆర్థరైటిస్ సమస్య సాధారణంగా స్వల్పకాలికంగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సమస్య దీర్ఘకాలిక దశకు చేరుకోవచ్చు, అలాంటి సందర్భాల్లో కీళ్ల వాపు లేదా కీళ్ల నొప్పులు వారాలు, నెలలు లేదా కొన్నిసార్లు సంవత్సరాల పాటు కూడా కొనసాగవచ్చు.

పోస్ట్-వైరల్ ఆర్థరైటిస్ లక్షణాలు

వైరల్ ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు మీరు కలిగి ఉన్న వైరల్ ఇన్ఫెక్షన్ రకాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సాధారణంగా పోస్ట్-వైరల్ ఆర్థరైటిస్ ఉన్న వారు క్రింది లక్షణాలను అనుభవించవచ్చు.

  • కీళ్ల నొప్పి ( చాలా సాధారణంగా చేతులు, మోకాలు, చీలమండ లేదా మణికట్టులో నొప్పి)
  • ప్రభావిత కీళ్లలో వాపు మరియు నొప్పి
  • ముఖ్యంగా ఉదయం మేల్కొన్న తర్వాత లేదా విశ్రాంతి తీసుకున్న తర్వాత కీళ్లు దృఢత్వం గా మారడం
  • సాధారణం కంటే ఎక్కవ అలసట
  • జ్వరం: ఈ లక్షణాలు తరచుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఇతర రకాల ఆర్థరైటిస్‌లను పోలి ఉంటాయి, అయితే సాధారణంగా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే జ్వరం ప్రారంభమవుతుంది.
ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

పోస్ట్-వైరల్ ఆర్థరైటిస్‌ నిర్థారణ

మీకు పోస్ట్-వైరల్ ఆర్థరైటిస్ ఉందో లేదో తెలుసుకోవడానికి, రుమాటాలజిస్ట్ మీకు ఇటీవల వచ్చిన వైరల్ ఇన్‌ఫెక్షన్‌ల గురించి అడిగి తెలుసుకోవచ్చు. తరువాత శారీరక పరీక్ష నిర్వహించి, రక్త పరీక్షలు మరియు కొన్ని సందర్భాల్లో, కీళ్ల వాపు యొక్క తీవ్రతను అంచనా వేయడానికి X- Ray లేదా అల్ట్రాసౌండ్‌ల వంటి ఇమేజింగ్ పరీక్షలు కూడా చేస్తారు.

పోస్ట్-వైరల్ ఆర్థరైటిస్ కు నూతన చికిత్స ఎంపికలు

పోస్ట్-వైరల్ ఆర్థరైటిస్ అనేది సాధారణంగా దానంతట అదే తగ్గిపోతుంది, అయితే  కొన్ని లక్షణాలను మెరుగుపరచడంలో ఈ క్రింది చికిత్సలు సహాయపడతాయి.

  • నొప్పి నివారణ: ఇబుప్రోఫెన్ లేదా న్యాప్రోక్సెన్ వంటి ఓవర్-ది-కౌంటర్ నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు (NSAIDs) కీళ్లనొప్పి మరియు వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
  • కార్టికోస్టెరాయిడ్: పోస్ట్-వైరల్ ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు తీవ్రంగా ఉంటే, మంటను తగ్గించడానికి కార్టికోస్టెరాయిడ్స్ యొక్క చిన్న కోర్సును వాడమని రుమాటాలజిస్ట్  సిఫార్సు చేయవచ్చు.
  • విశ్రాంతి: మీ కీళ్ళ నొప్పిని నయం చేయడానికి విశ్రాంతి చాలా అవసరం అంతే కాకుండా నొప్పిని మరింత తీవ్రతరం చేసే కఠినమైన పనులను నివారించుకోవడం ఉత్తమం.
  • వ్యాయామం: నడక లేదా ఈత వంటి సున్నితమైన, తక్కువ-ప్రభావ వ్యాయామాలు  చేయడం వల్ల కీళ్ల కదలికను ప్రేరేపించి మరియు కండరాలు కీళ్లు దృఢత్వంగా మారుతాయి.
  • వేడి మరియు చల్లని కాపు: కండరాలు మరియు కీళ్ల నష్టం కారణంగా సంభవించే నొప్పికి వేడి మరియు చల్లని కాపు వల్ల తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు.

క్రానిక్ (దీర్ఘకాలిక) పోస్ట్-వైరల్ ఆర్థరైటిస్

చాలా సందర్భాలలో, పోస్ట్-వైరల్ ఆర్థరైటిస్ కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు ఉంటుంది. అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా చికున్‌గున్యా వంటి ఇన్‌ఫెక్షన్‌లతో కీళ్లనొప్పులు దీర్ఘకాలికంగా మారవచ్చు మరియు నెలలు లేదా సంవత్సరాల వరకు కూడా కొనసాగవచ్చు. ఆర్థరైటిస్ యొక్క ఈ దీర్ఘకాలిక  స్థితి రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను పోలి ఉంటుంది.

ఈ సమస్యకు క్రింది నిర్వహణలు అవసరం కావచ్చు:

  • ఫిజికల్ థెరపీ ద్వారా కీళ్ల కదలికలను (జాయింట్ మొబిలిటీ) నిర్వహించడం
  • దీర్ఘకాలిక పరిచర్య:  తీవ్రమైన సందర్భాల్లో కీళ్ల  వాపు మరియు నొప్పిని నిర్వహించడానికి యాంటీరైమాటిక్ మందులు (DMARDs)ను ఉపయోగించబడతాయి.
మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

పోస్ట్-వైరల్ ఆర్థరైటిస్ యొక్క నివారణ చర్యలు

  • హైడ్రేటెడ్ గా ఉండడం: పుష్కలంగా నీరు త్రాగడం వల్ల కీళ్ల మంటను తగ్గించుకోవచ్చు.
  • ఆరోగ్యకరమైన ఆహారం: ఆకు కూరలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉండే చేపలు మరియు పండ్లు వంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆహారాలను తీసుకోవడం
  • విశ్రాంతి మరియు నిద్ర: వ్యాధి నుంచి కోలుకోవడానికి శరీరానికి తగినంత విశ్రాంతి & నిద్ర చాలా కీలకం.
  • శ్రమ నిర్వహణ మరియు విశ్రాంతి: అధిక శ్రమను నివారించండి, అయితే కీళ్లను అనువైనదిగా ఉంచడానికి సున్నితమైన వ్యాయామాలతో చురుకుగా ఉండటానికి ప్రయత్నించండి.

పోస్ట్-వైరల్ ఆర్థరైటిస్ ఉన్న చాలా మంది పేషంట్ లు సాధారణంగా వారాల నుంచి నెలలలోపు కోలుకుంటారు, ఈ విధంగా కోలుకోవడం సాధారణంగా వారికి సానుకూల దృక్పథాన్ని సూచిస్తుంది. అయితే, మీరు ఆరు వారాల కంటే ఎక్కువ కాలం పాటు నిరంతర కీళ్ల నొప్పులను అనుభవిస్తే, రుమటాలజిస్ట్‌ను తప్పకుండా సంప్రదించాలి. అంతే కాకుండా చికున్‌గున్యా మరియు డెంగ్యూ వంటి కొన్ని ఇన్‌ఫెక్షన్‌లలో నిరంతర ఆర్థరైటిస్ తరచుగా కనిపిస్తుంది కావున,ఆ ఇన్ఫ్ క్షన్ ల నుంచి కోలుకున్న అనంతరం నొప్పులకు చికిత్స అవసరం కావచ్చు.

మీరు రుమటాలజిస్ట్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

ఈ క్రింది పరిస్థితుల్లో రుమటాలజిస్ట్‌ని కలవడం చాలా అవసరం:

  • రోజు రోజుకు కీళ్ల నొప్పులు తీవ్రతరం అవ్వడం
  • ఎరుపు, వాపు మరియు కీళ్ల  కదలికలో సమస్య కలిగి ఉండడం
  • పైన తెలిపిన లక్షణాలు కొన్ని నెలల కంటే ఎక్కువ కాలం పాటు కొనసాగుతు లేదా నొప్పి తీవ్రమవుతున్నట్లు అనిపిస్తుండడం
  • జ్వరం, దద్దుర్లు లేదా ఇతర కొత్త లక్షణాలతో బాధపడుతుండడం

పై లక్షణాలను మీరు రుమటాలజిస్ట్ కు తెలియజేసిన తరువాత అదనపు చికిత్సలు అవసరమా లేదా వేరొక పరిస్థితి ఏమైనా మీ లక్షణాలకు దోహదపడుతుందా అని నిర్ణయించడం జరుగుతుంది.

సారాంశం

పోస్ట్-వైరల్ ఆర్థరైటిస్ అనేది చికున్‌గున్యా, డెంగ్యూ మరియు ఇన్‌ఫ్లుఎంజా వంటి సాధారణ వైరల్ ఇన్‌ఫెక్షన్ల తర్వాత వచ్చే సాధారణ స్వల్పకాలిక పరిస్థితి. చాలా మంది వ్యక్తులు పూర్తిగా కోలుకున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో, ఆర్థరైటిస్ దీర్ఘకాలికంగా మారవచ్చు మరియు ఈ సమస్యకు దీర్ఘకాలిక నిర్వహణ అవసరమని గుర్తించడం ముఖ్యం. మీరు అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత కీళ్ల నొప్పులను ఎదుర్కొంటుంటే, లక్షణాలకు ఉపశమనం అందించే మార్గాలు మరియు అవసరమైన వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం. వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత కీళ్ల నొప్పి మరియు లక్షణాలు ఊహించిన దానికంటే ఎక్కువ కాలం కొనసాగితే రుమటాలజిస్ట్‌ను సంప్రదించటం చాలా ఉత్తమమైన చర్య.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262681 మాకు కాల్ చేయగలరు.

About Author –

Dr. Keerthi Talari, Consultant Rheumatologist, Yashoda Hospital, Hyderabad
MD, DM (Rheumatology)

best rheumatologist in hyderabad

Dr. Keerthi Talari Bommakanti

MBBS (JIPMER), MD (JIPMER), DM Rheumatology (NIMS) (Gold Medalist), European LAR Certified in Lupus
Sr. Consultant Rheumatologist & Clinical Immunologist

X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567