%1$s

ఆస్టియోపోరోసిస్ వ్యాధి లక్షణాలు, నిర్ధారణ, చికిత్స మరియు జాగ్రత్తలు.

ప్రతీయేటా అక్టోబర్ 20న ప్రపంచ ఆస్టియోపోరోసిస్ దినోత్సవంగా జరుపుకుంటాము. మోనోపాజ్ తరువాత మహిళలను ఇబ్బంది పెట్టే సమస్యలలో ఆస్టియోపోరోసిస్ (బోలు ఎముకల వ్యాధి) కూడా ఒకటి. దీనిలో ఎముక సాంద్రత తగ్గి, పటుత్వం కోల్పోయి అవి గుల్లబారతాయి. ఎముక గుల్లబారటం చాలా నెమ్మదిగా జరగటం వలన చాలా మందిలో ఎముకలు విరిగేంతవరకు ఎలాంటి లక్షణాలు కనబడవు. 2015లో WHO సర్వే ప్రకారం యాభై పైబడినవారిలో మన దేశంలో ప్రతీ ముగ్గురు స్త్రీలలో ఒకరు. ప్రతీ ఎనిమిది మంది మగవారిలో ఒకరు ఆస్టియోపోరోసిస్తో బాధపడుతున్నారు. సుమారుగా 2015 నాటికి 5 కోట్ల మంది ఈ వ్యాధికి లోనైయ్యారు. జీవనశైలిలో మార్పులు, పౌషకాహారం తీసుకోవడం, సరియైన వ్యాయామం చేయడం మరియు వ్యాధిని తొలిదశలో గుర్తించడం వలన ఆస్టియోపోరోసిస్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

 ఆస్టియోపోరోసిస్ ఎందుకు వస్తుంది :

సాధారణంగా ఎముక నిర్మాణం మరియు ఎదుగుదలలో భాగంగా ఎముకలోని పాతకణాలు పోయి కొత్తకణాలు చేరతాయి. దీన్ని ఎముక రిమాడలింగ్ (Bone Remodelling) అంటారు. ఈ ప్రక్రియ చిన్నతనంలో మొదలై కౌమారదశ వరకు అతివేగంగా ఉండి సుమారుగా 30 ఏళ్లకు పూర్తి స్థాయికి చేరుతుంది. ఈ దశలో కొత్తకణాలు ఎక్కువగా ఉండి ఎముక   దృఢంగా ఉంటుంది. ఈ దశను Peak Bone Mass అంటారు. దీని తర్వాత క్రమేణా కొత్త కణాలు చేరడం తగ్గుతుంది. తద్వారా 50 యేళ్ళు వచ్చేసరికి ఎముక సాంద్రత తగ్గి గుల్లబారుతుంది.

ఆస్టియోపోరోసిస్ అనేది ప్రధానంగా రెండు రకాలు-ప్రైమరీ మరియు సెకండరీ.. పైన చెప్పిన విధంగా మోనోపాజ్ తర్వాత మరియు 65 ఆపైన ఎముక క్రమంగా సాంద్రత తగ్గడం వల్ల వచ్చే ఆస్టియోపోరోసిస్ ను ప్రైమరీ అంటారు. ఇస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ లాంటి కొన్ని హార్మోన్లు, కాల్షియం, విటమిన్ డి లాంటి పోషకాలు ఈ ఎముక రిమాడలింగ్ను కొంత వరకు ప్రభావితం చేస్తాయి.

 సెకండరీ ఆస్టియోపోరోసిస్ :

ఎముక రిమాండలింగ్ ప్రక్రియను నిరోధించే కారకాల వలన 50 యేళ్ళ లోపే ఆస్టియోపోరోసిస్ రావచ్చు. దీర్ఘకాలిక కిడ్నీ మరియు లివర్ సమస్యలు, కొన్ని రకాల జీర్ణకోశ వ్యాధులు, రుమటాయిడ్ వ్యాధులు, థైరాయిడ్ మరియు డయాబెటిస్ కొన్ని కారణాలు .ఇవే కాకుండా జన్యుపరమైన కారణాలు, స్టెరాయిడ్స్, ఫిట్స్ మందులు, హెపారిన్ మందులు చాలా రోజులు వాడటం, అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం, పొగత్రాగడం, శారీరక శ్రమ లేకపోవడం, అతి తక్కువ బరువు, కాల్షియం, విటమిన్ డి లోపం వలన కూడా ఆస్టియోపోరోసిన్ రావచ్చు.

secondary osteoporosis

వ్యాధి లక్షణాలు :

ఆస్టియోపోరోసిస్ ను Silent Disease అంటారు. చాలా మందికి ఎముకలు విరిగేంతవరకు ఎలాంటి లక్షణాలు కనపడవు. నెమ్మదిగా నడుము వంగిపోవడం, వెన్నునొప్పి, ఎత్తుతగ్గడం, అలసట.. లాంటివి కొంత మందిలో కనిపిస్తాయి. అన్ని ఎముకలు దీనితో ప్రభావితం చేయబడినా, వెన్నుపూస, తుంటి మరియు ముంచేతి ఎముకలకు ఇది ఎక్కువగా వస్తుంది.

 వ్యాధి నిర్ధారణ ఎలా?:

ఎక్స్ రే (X-Ray) / CT స్కాన్లతో ఫ్రాక్చర్స్ కనుక్కొవడం జరుగుతుంది. బిఎండి (BMD-Bone Mineral Density) పరీక్ష / Dexa Scanతో ఎముక సాంద్రతను పరీక్ష చేస్తారు. దీంట్లో T. Score అనే విలువ -2.5 లేదా అంతకన్నా తక్కువ ఉంటే ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ అయినట్లే. వెన్నుపూస, తుంటి భాగంలో ఈ పరీక్ష చేస్తారు.

 బిఎండి పరీక్ష ఎవరు చేసుకోవాలి ?

  • 65 మరియు ఆపైబడిన స్త్రీలు
  • 70 మరియు ఆ పైబడిన పురుషులు
  • మోనోపాజ్ తరువాత మహిళలో పైన చెప్పిన సెకండరీ కారణాలు ఉండటం, లేదా ఒకసారి ఎముక విరగడం|

చికిత్స:

బిఎండి పరీక్ష ఫలితాలు మరియు మీకు ఉన్న అనుబంధిత (Secondary) కారణాలను దృష్టిలో పెట్టుకొని మీరు మాత్రలు వాడాలా లేదా అన్నది వైద్యులు నిర్ధారిస్తారు.

బిస్ఫోస్పోనేట్స్ (Bisphosphonates), టేరీపరటైడ్ (Teriparatide), కాల్సిటోనిన్ (Calcitonin), డెనోసోముబాబ్ (Denosumab) మరియు కొన్ని రకాల హార్మోన్ మందులు ఆస్టియోపోరోసిస్కి వాడుతారు. దీనితో పాటు కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది.

 

దృష్టిపెట్టాల్సిన జాగ్రత్తలు:

  1. శరీరం సాధ్యమైనంత వరకు చురుగ్గా ఉంచుకోవడం. రోజూ 20-30ని||లు నడక, వ్యాయామం, జాగింగ్ లేదా డ్యాన్స్ చేయడం,వెయిట్ వ్యాయామం, పరుగు, ఏరోబిక్స్ వ్యాయామం వంటివి చేయడం వలన ఎముకలతో పాటు కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
  2. పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, మాంసం, గింజ మరియు తృణధాన్యాలు, చేపలు, గుడ్లు లాంటి కాల్షియం అధికంగా ఉన్న ఆహారం క్రమం తప్పకుండా రోజువారీ తీసుకోవడం.
  3. విటమిన్ డి మన శరీరం కాల్షియంను స్వీకరించడానికి అవసరం. విటమిన్ డి ఆహారంలో తక్కువగా లభిస్తుంది. కాబట్టి కొంత సమయం ఎండలో ఉండడం, అవసరమైతే విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవాలి.
  4. 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్న స్త్రీలు, 18 నుండి 70 వయస్సు మగవారికి రోజుకి 1000 మి.గ్రాల కాల్షియం, 400-600 IU విటమిన్ డి అవసరం. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, 50పైబడిన మహిళలు, 70పైబడిన మగవారికి 1200 మి.గ్రా.ల కాల్షియం, 800-1000 IU విటమిన్ డి తీసుకోవాలి. ఇవి సాధ్యమైనంతవరకు ఆహారంలో భాగమై ఉండాలి.
  5. వృద్ధులు ముఖ్యంగా పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సరియైన వెలుతురులో ఉండడం, కంటి పరీక్షలు క్రమంగా చేసుకోవడం, మెట్లు దిగేటప్పుడు, బాత్రూమ్ లో గోడ లేదా పట్టాల సహాయం తీసుకోవడం, మత్తు కలిగించే మందులను సాధ్యమైనంత వరకు తగ్గించడం.. మొదలగునవి దృష్టిలో పెట్టుకోవాలి.
  6. ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ అయిన వారు డాక్టరు ఇచ్చిన మందులను క్రమ పద్ధతిగా వాడాలి.

About Author –

Dr. Sunitha Kayidhi, Consultant Rheumatologist, Yashoda Hospitals - Hyderabad
MD (Internal medicine), DM (Rheumatology)

X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567