నరాల సంబంధిత వ్యాధుల రకాలు, కారణాలు, లక్షణాలు & నిర్ధారణ పరీక్షలు
నరాల సంబంధిత రుగ్మతలు అంటే నాడీ వ్యవస్థ మొత్తం మీద ప్రభావం చూపే వ్యాధులు. నాడీ సంబంధిత పరిస్థితులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనారోగ్యం మరియు వైకల్యానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఇవి కేంద్ర నాడీ వ్యవస్థ యొక్క (CNS) న్యూరాన్లు లేదా వెన్నుపాము, మెదడు లేదా దాని భాగాలలో ఒకదానిని ప్రభావితం చేస్తాయి. నాడీ వ్యవస్థ రుగ్మతలనే న్యూరో-సిస్టమ్ డిజార్డర్స్ అని కూడా పిలుస్తారు. కేంద్ర నాడీ వ్యవస్థ మెదడు మరియు వెన్నుపాముతో రూపొందించబడింది. ఇది శరీరాని జరిగే ప్రతి క్రియలని స్వాధీనములో(“కమాండ్ సెంటర్”) ఉంచుటకు సహాయ పడుతుంది. వెన్నుపాము నుండి మెదడుకు, మరియు మెదడు నుండి సంకేతాలను పంపుతుంది. మెదడు వాటిని అర్థం చేసుకుని మన క్రియలను నియంత్రిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వ్యవస్థ మన ఇంద్రియాలను సమన్వయం చేయడమే కాక మాట్లాడటం, నేర్చుకోవడం మరియు గుర్తుంచుకోవడంలోనూ సహాయపడుతుంది. నాడీ సంబంధిత రుగ్మతలు స్త్రీలతో పోలిస్తే పురుషులలో ఎక్కువ. ఇవి ఏ వయసులోనైనా,ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు మరియు లక్షణాలు వ్యక్తి వ్యక్తికి మారుతూ ఉంటాయి.
నరాల సంబంధిత వ్యాధుల యొక్క లక్షణాలు
నాడీ వ్యవస్థ రుగ్మతలతో సంబంధం ఉన్న లక్షణాలు చాలా ఉన్నాయి, వాటిలో ప్రధానమైనవి:
- తలనొప్పి & వెర్టిగో
- వెన్నునొప్పి & మెడ నొప్పి
- వణుకు & కండరాల బలహీనత
- శరీరంలో తిమ్మిరి మరియు జలదరింపు
- ఇంద్రియజ్ఞానం కోల్పోవడం
- దృష్టి నష్టం
స్పర్శ కోల్పోవడం
- చెవులలో శబ్ధం రావడం
- వినికిడి లోపం
- వాసన మరియు రుచి కోల్పోవడం
- నిద్ర పట్టకపోవడం
- నిద్రలో అనియంత్రిత కదలికలు
- గురక ఎక్కువగా రావడం
- మూర్ఛపోవడం
- గందరగోళానికి గురికావడం
- జ్ఞాపకశక్తి కోల్పోవడం లేదా అభిజ్ఞా క్షీణతను లోనవ్వడం
- ప్రవర్తనలో మార్పులు
- నెమ్మదిగా మాట్లాడటం లేదా మాట తడబడడం
నరాల సంబంధిత రుగ్మతలు ప్రతి వ్యక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో లేదా ఎప్పుడు ప్రభావితం చేస్తుందో అంచనా వేయడం కష్టం. మీరు లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా పై లక్షణాలతో బాధపడుతున్నారని తెలిసి ఉంటే, వీలైనంత త్వరగా సరైన వైద్య సహాయం పొందడానికి మీరు హైదరాబాద్ లో గల యశోద హాస్పిటల్స్ లోని ఉత్తమ న్యూరాలజిస్ట్‌ను సందర్శించగలరు. న్యూరోలాజికల్ డిజార్డర్స్‌తో బాధపడుతున్న వారికి సహాయం చేయడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి యశోద హాస్పిటల్స్ భారతదేశంలోనే అత్యుత్తమ న్యూరాలజిస్ట్‌లు ఉన్నారని మరవద్దు.
న్యూరోలాజికల్ డిజార్డర్స్ కు గల కారణాలు
న్యూరోలాజికల్ డిజార్డర్ యొక్క నిర్దిష్ట కారణం రుగ్మతపై ఆధారపడి మారవచ్చు, కానీ కొన్ని సాధారణ కారణాలు:
జన్యుశాస్త్రం: కొన్ని నాడీ సంబంధిత రుగ్మతలు వంశపారంపర్యంగా లేదా నిర్దిష్ట జన్యు ఉత్పరివర్తనల ఫలితంగా సంభవిస్తాయి.
గాయం: తలకు గాయాలు మరియు వెన్నుపాము గాయాలు చాలా వరకు నరాల సమస్యలకు దారి తీయవచ్చు.
ఇన్ఫెక్షన్లు : కొన్ని ఇన్ఫెక్షన్లు నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి మరియు రుగ్మతలకు దారితీస్తాయి. వైరస్లు (ఉదా, హెర్పెస్ సింప్లెక్స్, HIV), బాక్టీరియా (ఉదా, మెనింజైటిస్) మరియు పరాన్నజీవులు (ఉదా, లైమ్ వ్యాధి) సహా వివిధ అంటువ్యాధులు నాడీ వ్యవస్థను ప్రభావితం చేయవచ్చు.
ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్: ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్‌లో, రోగనిరోధక వ్యవస్థ నాడీ వ్యవస్థతో సహా శరీరం యొక్క స్వంత కణాలు మరియు కణజాలాలపై పొరపాటున దాడి చేస్తుంది.
మెటబాలిక్ డిజార్డర్స్: ఉపచయాపచయ సంబంధమైన మరియు రసాయనాలు, పదార్థాలలో అసమతుల్యత నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. మధుమేహం లేదా జీవక్రియ రుగ్మతలు వంటి పరిస్థితులు నరాల దెబ్బతినడానికి దారితీయవచ్చు.
పర్యావరణ కారకాలు: రసాయనాలు (టాక్సిన్స్) లేదా పర్యావరణ కారకాలు లేదా దీర్ఘకాలిక మద్యపానం వల్ల కూడా నాడీ సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది.
రక్తనాళ సంబంధమైన సమస్యలు: మెదడు లేదా వెన్నుపాముకు రక్త ప్రసరణలో సమస్యలు రుగ్మతలకు దారితీస్తాయి.
న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్స్: మెదడు మరియు వెన్నుపాములోని నరాల కణాలు స్ఖినీంపచేసే వ్యాధులు, ఇవి క్రమంగా పనితీరును కోల్పొయెల చేస్తాయి. ఈ రుగ్మతలు ఆలోచించడం, కదిలించడం మరియు గుర్తుంచుకోవడం అనే వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
పోషకాహార లోపాలు : విటమిన్లు మరియు మినరల్స్ వంటి అవసరమైన పోషకాలను తగినంతగా తీసుకోకపోవడం వల్ల కూడా నరాల సంబంధిత సమస్యలు సంభవిస్తాయి.
హార్మోన్ల అసమతుల్యత: థైరాయిడ్ రుగ్మతలలో కనిపించే హార్మోన్ల ఆటంకాలు నరాల సంబంధిత వ్యవస్థను ప్రభావితం చేస్తాయి మరియు వణుకు, కండరాల బలహీనత వంటి లక్షణాలకు దారితీస్తాయి.
ఎదుగుదల లోపాలు: కొన్ని నరాల సంబంధిత వ్యాధుల వలన, గర్భధారణ సమయంలో లేదా చిన్నతనంలో నరాల యొక్క అసాధారణ పరివర్తనను ప్రేరేపించుతాయి.
పుట్టుకతో వచ్చే అసాధారణతలు: ఇవి పుట్టుకతో వచ్చే మెదడు లేదా వెన్నుపాము యొక్క నాడీ సంబంధిత పుట్టుక లోపాలు లేదా రుగ్మతలు.
నాడీ సంబంధిత రుగ్మతల యొక్క రకాలు
నాడీ వ్యవస్థ రుగ్మతలు మెదడు, వెన్నుపాము, నరాలు మరియు పరిధీయ నిర్మాణాలతో సహా దానిలోని వివిధ భాగాలను ప్రభావితం చేయవచ్చు. నాడీ వ్యవస్థ రుగ్మతల యొక్క కొన్ని సాధారణ రకాలు:
600 కంటే ఎక్కువ నాడీ సంబంధిత రుగ్మతలు ఉన్నాయి, వాటిలో కొన్ని ప్రధానమైనవి:
అల్జీమర్స్ వ్యాధి: అల్జీమర్స్ మెదడులో కణాలు క్షీణింపచేయడంవల్లన వచ్చే నాడీ సంబంధిత వ్యాధి. అల్జీమర్స్ వ్యాధి సాధారణంగా 65 ఏళ్ల పై బడిన వారిలో కనిపిస్తుంది.
హంటింగ్టన్’స్ డిసీజ్: అసంకల్పిత కదలికలు, అభిజ్ఞా క్షీణత మరియు భావోద్వేగ ఆటంకాలు కలిగించే జన్యుపరమైన రుగ్మత
మల్టిపుల్ స్క్లెరోసిస్ (MS) అనేది కేంద్ర నాడీ వ్యవస్థ (CNS)తో కూడిన దీర్ఘకాలిక పరిస్థితి. ఇది ప్రధానంగా యువకులను ప్రభావితం చేస్తుంది. ఇది మైలిన్ అని పిలువబడే నరాల ఫైబర్స్ యొక్క రక్షణ కవచాన్ని దెబ్బతీసి వివిధ నాడీ సంబంధిత విధులను తీవ్ర ఆటంకం కలిగిస్తుంది.
కండరాల బలహీనత: కండరాల బలహీనత అనేది అరుదైన నాడీ కండరాల సమస్య. ఈ సమస్య నొప్పిలేకుండా ఉన్నట్టుంది కండరాలను బలహీనపరుస్తుంది. దీనికి మూలం రక్తంలో పోటాషియం మోతాదులు తగ్గడం ప్రధాన కారణం. నాడీ ప్రచోదనాల ప్రసారానికి, కండరాల సంకోచ వ్యాకోచాలకు పోటాషియం అత్యవసరం ..ఇది లోపించినప్పుడు కండరాల బలహీనత సమస్య వస్తుంది.
అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్: అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ALS) అనేది మెదడు, వెన్నుపాము, మరియు మెదడు కాండంలోని నాడీ కణాలను ప్రభావితం చేస్తుంది. ఇది వచ్చిన వ్యక్తులు కండరాల కదలికను నియంత్రించే కణాలను క్రమంగా కోల్పోతారు.
మూర్ఛ (ఫిట్స్): మూర్ఛ వ్యాధి (ఎపిలెప్సీ) అనేది ఒక న్యూరాలజికల్ డిజార్డర్. ఇది మెదడు నరాలకు సంబంధించిన వ్యాధి. ఈ సమస్యతో బాధపడుతున్న వారి మెదడులోని కార్యకలాపాలు అసాధారణంగా మారుతాయి.
మైగ్రేన్లు: ఇవి అప్పుడప్పుడు వచ్చే అసౌకర్యాల నుంచి బలహీనపరిచే పరిస్థితుల వరకు ఉంటాయి. తలనొప్పి వివిధ రూపాల్లో ఉండవచ్చు, అత్యంత ప్రబలంగా టెన్షన్-టైప్ తలనొప్పి, మైగ్రేన్లు మరియు క్లస్టర్ తలనొప్పి
తలనొప్పి : అంతర్లీన కారణాన్ని బట్టి అనేక రకాల తలనొప్పి కారణం ఆవొచ్చుటెన్షన్-టైప్ తలనొప్పి తరచుగా ఒత్తిడి లేదా కండరాల ఒత్తిడి వల్ల ఉత్పన్నమవుతుంది, ఫలితంగా బ్యాండ్ లాంటి నొప్పి తలని చుట్టుముడుతుంది.క్లస్టర్ తలనొప్పి అనేది అసాధారణమైన తలనొప్పి. ఇది ఒక వైపు తల నొప్పిలగా సంభవిస్తుంది
బ్రెయిన్ స్ట్రోక్స్: మెదడు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు స్ట్రోక్స్ సంభవిస్తాయి.
- 1. ఇస్కీమిక్ స్ట్రోక్: మెదడులో ధమనులు బ్లాక్ అయినప్పుడు ఈ సమస్య వస్తుంది. మెదడుకు రక్త ప్రసరణ రక్తం గడ్డకట్టడం ద్వారా నిరోధించబడినప్పుడు ఇస్కీమిక్ స్ట్రోక్ సంభవిస్తుంది.
- 2. హెమరేజిక్ స్ట్రోక్: హెమరేజిక్ స్ట్రోక్ అనేది మెదడులోని రక్తనాళం చీలిపోయినప్పుడు సంభవించే నాడీ సంబంధిత అత్యవసర పరిస్థితి. రక్తస్రావం మెదడు కణాలు మరియు కణజాలాలను దెబ్బతీస్తుంది, ఇది దీర్ఘకాలిక వైకల్యం లేదా మరణానికి దారితీస్తుంది.
మెదడు గాయం: తలపై నేరుగా దెబ్బ తగలడం వల్ల, మెదడులో రక్తస్రావం మరియు వాపు ఏర్పడి, ఇది తలనొప్పి, తల తిరగడం, వికారం మరియు స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలకు దారితీస్తుంది.
స్పైనా బిఫిడా: స్పినా బిఫిడా అంటే వెన్నెముక మరియు వెన్నుపాము యొక్క పుట్టుకతో వచ్చే వైకల్యం. సాధారణంగా గర్భధారణ ప్రారంభంలో ఏర్పడి, తర్వాత మెదడు మరియు వెన్నుపాములోకి అభివృద్ధి చెందే న్యూరల్ ట్యూబ్, పిండం అభివృద్ధి సమయంలో పూర్తిగా మూసివేయబడనప్పుడు ఇది సంభవిస్తుంది.
వెన్నుపాము గాయం: వీపు భాగంలో ప్రమాదాలు, జారిపడి పడిపోవడం లేదా వెన్నెముకకు లేదా వెన్ను పాము నుంచి నరములకు అకస్మికంగా ఏదైనా గాయం లేదా దెబ్బ తగలడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.
కార్పల్ టన్నెల్ సిండ్రోమ్: కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ (CTS) అనేది మణికట్టులోని మధ్యస్థ నాడి కుదించబడినప్పుడు ఏర్పడే పరిస్థితి. ఇది బొటనవేలు, చూపుడు, మధ్య మరియు ఉంగరపు వేలు యొక్క భాగంలో నొప్పి, జలదరింపు, తిమ్మిరి లేదా బలహీనతకు కారణమవుతుంది
నరాల బలహీనత (పరిధీయ నరాల వ్యాధి): ఈ నరాల బలహీనత శరీరం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. నరాలు బలహీనం కావడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగక పోవడంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
బెల్స్ పాల్సీ : అనేది నాడీ సంబంధిత రుగ్మత, ఇది ముఖం యొక్క ఒక వైపున పక్షవాతం లేదా బలహీనతను కలిగిస్తుంది. ముఖంలోని కండరాలను నియంత్రించే నరాలలో ఒకటి గాయపడినప్పుడు లేదా సరిగ్గా పనిచేయడం ఆగిపోయినప్పుడు ఇది సంభవిస్తుంది. ముఖ పక్షవాతం యొక్క అత్యంత సాధారణ కారణం
నాడీ సంబంధ వ్యాధుల నిర్ధారణ మరియు పరీక్షలు
నరాల సంబంధిత సమస్యలతో మీరు వైద్యులను సంప్రదించగానే అతను ఇంతకు ముందు మీ వైద్య రికార్డులను గమనిస్తాడు మరియు మెదడు మరియు వెన్ను పాము ద్వారా కలిగే సమస్యలను తెలుసుకోవడానికి శారీరక పరీక్షను సైతం చేస్తారు. వీటితో పాటుగా:
రక్త పరీక్షలు: నరాల బలహీనత లేదా పక్షవాతం కలిగించే ఇన్ఫెక్షన్లు లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ద్వారా వచ్చే సమస్యలను గుర్తించడానికి రక్త పరీక్షలు సహాయపడతాయి.
కండరాల బయాప్సీ: కండరాలు మరియు నరాల బలహీనతలను ప్రభావితం చేసే పరిస్థితులను నిర్ధారించడం కోసంఈ పరీక్షను చేస్తారు.
ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ (EEG) పరీక్ష: ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ (EEG) అనగా మెదడు యొక్క విద్యుత్ కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలను కనుగొనడానికి ఉపయోగించే నాన్-ఇన్వాసివ్ పరీక్ష. ఇందులో మూర్ఛ లేదా నిద్ర రుగ్మతలు, మెదడు కణితులు మరియు ఇతర నరాల సంబంధిత సమస్యల వంటి పరిస్థితులను నిర్ధారించడం జరుగుతుంది.
ఎలక్ట్రోమియోగ్రఫీ (EMG): కండరాలు మరియు నరాల యొక్క విద్యుత్ కార్యకలాపాలను కొలవడానికి మరియు కండరాల బలహీనత, ఏ రకమైన కండరాల సమస్య వల్ల బలహీనత లేదా పక్షవాతం వచ్చిందా అని నిర్ధారించడానికి ఈ పరీక్ష చేస్తారు.
ఇమేజింగ్ పరీక్షలు: ఏవైనా కంప్రెస్డ్ నరాలు లేదా పక్షవాతం వల్ల కలిగే ట్యూమర్ పెరగుదల లేదా హెర్నియేటెడ్ వెన్నుపాము గాయాలను గుర్తించడంలో X- ray, MRI మరియు CT స్కాన్‌లు సహాయపడతాయి.
నరాల ప్రసరణ అధ్యయనం (NCS): శరీరంలోని నరాల గాయం యొక్క ఉనికి మరియు తీవ్రతను గుర్తించడానికి నరాల ప్రసరణ అధ్యయన పరీక్ష సహాయపడుతుంది.
లంబార్ పంక్చర్ (స్పైనల్ ట్యాప్): ఇది సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ (CSF) ను సేకరించడానికి దిగువ వీపులో సూదిని చొప్పించే ప్రక్రియ. ఇన్ఫెక్షన్ లేదా వ్యాధి సంకేతాల కోసం ఈ ద్రవం పరీక్షించబడుతుంది.
నాడీ సంబంధ వ్యాధుల నివారణ చర్యలు
నరాల సంబంధ వ్యాధులను నివారించడంలో సహాయపడే మార్గాలు:
- మెదడు ఆరోగ్యం కాపాడుకోవడానికి మరియు స్ట్రోక్ వంటి పరిస్థితులను తగ్గించుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
- పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు మంచి కొవ్వులతో కూడిన సమతుల్య ఆహారం మెదడు పనితీరుకు మరియు నాడీ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి
- నరాల సంబంధిత సమస్యలకు దారితీసే తల గాయాలను నివారించడానికి బైకింగ్ లేదా క్రీడలు ఆడేటప్పుడు హెల్మెట్ ధరించండి
- మెదడుని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ధ్యానం మరియు లోతైన శ్వాస వంటి వ్యాయమాలు చేయడం మంచిది
- సాంఘికంగా ఉండటం మరియు ఇతరులతో నిమగ్నమవ్వడం మీ మెదడును పదునుగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు అభిజ్ఞా క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తుంది
- ధూమపానం మరియు మద్యపానం తీసుకోవడం లేదా డ్రగ్స్ వంటివి మెదడుకు హాని కలిగించటమే కాక నరాల సంబంధిత రుగ్మతలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి కావున వాటికి దూరంగా ఉండడం మంచిది
- శారీరక శ్రమ మరియు వ్యాయామం చేయడం వల్ల నరాల పనితీరు మెరుగుపడి నరాల బలహీనతకు గురికాకుండా ఉంటాము
- నాడీ వ్యవస్థ శక్తిమంతంగా ఉండేందుకు విటమిన్-డి చాలా అవసరం. దీని కోసం ప్రతి రోజూ తగినంత సేపు ఎండలో తప్పనిసరిగా నడవాలి
- ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉండే చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల కూడా నరాలకు బలం చేకూరుతుంది
- ఫాస్ట్ ఫుడ్ లకు దూరంగా ఉండడమే కాక అధికంగా నూనెతో తయారుచేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది
- వేపుళ్ళు మరియు తీపి పదార్థాలకు, సాధ్యమైనంత దూరంగా ఉండాలి (ఇవి నరాల ఆరోగ్యానికి మరింత హానిని కలుగజేస్తాయి)
నరాల సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి సరైన సమయంలో వైద్యున్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకున్నట్లైతే, ఈ సమస్య బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే, కొన్ని సార్లు ఈ వ్యాధుల చికిత్సలో నిర్లక్ష్యం వహించినట్లు అయితే దీర్ఘకాలిక, ప్రాణాంతక సమస్యలకు సైతం దారి తీయవచ్చు.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262681మాకు కాల్ చేయగలరు.
About Author –
Dr. Kandraju Sai Satish,Consultant Neurologist & Epileptologist, Yashoda Hospital, Hyderabad