%1$s

మైగ్రేన్ తలనొప్పి: రకాలు, లక్షణాలు, కారణాలు & చికిత్స పద్దతులు

Migrane Headache telugu blog banner

ప్రస్తుత జీవనశైలి కారణంగా ఎంతో మంది ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వాటిలో మైగ్రేన్ కూడా ఒకటి. కాస్త పని ఒత్తిడి ఎక్కువగా అవ్వగానే   తీవ్రమైన  తల నొప్పి మొదలవుతుంది. దీంతో రోజు వారి పనులను చేసుకోవడంలో కూడా ఇబ్బందిపడాల్సి వస్తుంది. మైగ్రేన్‌ తలనొప్పినే పార్శ్వనొప్పి అని కూడా అంటారు. మైగ్రేన్ తో బాధపడే వారిలో ముఖ్యంగా తలలో ఒకవైపు మాత్రమే నొప్పి ఉంటుంది. ఈ తలనొప్పి ఆడవారిలో ఎక్కువ. మైగ్రేన్ బాధితులు గంటల నుంచి రోజుల వరకు తీవ్రమైన తలనొప్పిని అనుభవించవచ్చు. ఒక్కసారి ప్రారంభమైన ఈ మైగ్రేన్ తలనొప్పి కొన్ని గంటల వరకూ లేదా కొన్నిరోజులు ఉంటుంది. కొన్నిసార్లు ఇది తల మొత్తం కూడా నొప్పిని కలిగిస్తుంది. మైగ్రేన్ తలనొప్పి వయసు, జాతీ, వర్గం, భేదం లేకుండా ఎప్పుడైనా, ఎవరికైనా రావొచ్చు. మైగ్రేన్‌లకు ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ, అవి జన్యుపరమైన, పర్యావరణ కారకాలు మరియు పలు రకాల కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. 

మైగ్రేన్ తలనొప్పి లక్షణాలు

Migrane Headache symptoms

మైగ్రేన్ తలనొప్పి యొక్క సాధారణ లక్షణాలు:

  • తలలో ఒక వైపు తీవ్రమైన నొప్పి
  • వికారం 
  • వాంతులు
  • తల తిరగడం
  • చేతులు, కాళ్ళలో జలదరింపు
  • కళ్లు ఎర్రబడడం
  • కళ్లలో నీళ్లు రావడం
  • మాట్లాడలేకపోవడం
  • చెవులలో శబ్ధాలు రావడం
  • కళ్ల ముందు జిగ్ జాగ్ లైన్లు కనపడటం
ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

మైగ్రేన్ తలనొప్పికి గల కారణాలు

ఈ మైగ్రేన్ తలనొప్పి ఈ కారణాల వల్ల వస్తుందని చెప్పడం కష్టం. కానీ మైగ్రేన్‌ను ప్రేరేపించే కొన్ని పరిస్థితులు:

  • క్రమ రహిత జీవనశైలి
  • భావోద్వేగ ఒత్తిడి మరియు అందోళన
  • తీవ్రమైన శారీరక శ్రమ
  • డీహ్రేడేషన్
  • చల్లటి పానీయాలను ఎక్కువగా తీసుకోవడం
  • సరైన సమాయానికి తినకపోవడం
  • ఎక్కువగా ప్రయాణాలు చేయడం
  • వాతావరణంలో మార్పులు సంభవించడం
  • అధిక వెలుగు మరియు శబ్దాల తీవ్రత వల్ల
  • మెడ లేదా వెన్నెముక సమస్యలు
  • ఎక్కువగా ధూమపానం & మద్యపానం సేవించడం
  • స్త్రీలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు, ఋతుచక్రం ముందు లేదా తరువాత కూడా మైగ్రేన్ రావొచ్చు.
  • ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటి కొన్ని రకాల మందులు వాడడం
  • కొన్నిసార్లు నిరాశ, ఆందోళన, లేదా నిద్ర రుగ్మతలు వంటి ఇతర పరిస్థితుల వల్ల కూడా మైగ్రేన్  వచ్చే అవకాశం ఉంటుంది.

మైగ్రేన్ తలనొప్పి దశలు

మైగ్రేన్ లో ప్రొడ్రోమ్, ఆరా, అటాక్, పోస్ట్ డ్రోమ్ అనే 4 దశలుంటాయి. 

మొదటి దశ ప్రొడ్రోమ్ ఇందులో తలనొప్పి గంట నుంచి రోజంతా కొనసాగవచ్చు. ఈ దశలో చికాకు, క్రేవింగ్స్ (కొన్ని పదార్థాలను తినాలనిపించడం) అలసట, నిద్రలేమి, తరచూ మూత్ర విసర్జన చేయవలసి రావడం, వెలుగు, శబ్దాలను భరించలేకపోవడం వంటివి ఉంటాయి. ఈ లక్షణాలను  బట్టి ముందుగానే మైగ్రేన్ రాబోతున్నట్లు గ్రహించవచ్చు. 

రెండో దశ ఆరా ఇది అందరిలో రాదు. మైగ్రేన్ ఆరా లక్షణాలు తరచుగా తలనొప్పి రాకముందు లేదా అదే సమయంలో సంభవించవచ్చు. ఈ రకమైన మైగ్రేన్  ప్రకాశవంతమైన లైట్లు, శబ్ధాల వల్ల మరింత తీవ్రత చెందుతుంది. ముఖం లేదా అవయవాలలో తిమ్మిరి మరియు జలదరింపు, చెవులలో రింగింగ్, మైకము లేదా మాట్లాడటంలో ఇబ్బంది వంటి మార్పులను గమనించవచ్చు. 

దీని తర్వాత దశ అటాక్ ఈ దశలో భరించలేని తలనొప్పి మొదలైపోతుంది. ఈ నొప్పి సాధారణంగా 4 గంటల నుంచి 72 గంటల వరకు కొనసాగవచ్చు. ఈ దశలో తలకు ఒక పక్కన విపరీతమైన నొప్పి వేధిస్తుంది. వెలుగు శబ్దాలను భరించలేకపోవడం, వాంతి వస్తున్నట్లు అనిపించడం, పనులు చేసుకోలేకపోవడం, తలనొప్పి బాధించే ప్రదేశం సున్నితంగా మారడం వంటివి ఉంటాయి. 

చివరిదశ పోస్ట్ డ్రోమ్‌, దీన్ని మైగ్రేన్ హ్యాంగోవర్ అంటారు, ఈ దశ 1-2 రోజులు ఉండవచ్చు. ఏకాగ్రతలో ఇబ్బందులు, నిస్సత్తువ గా ఉండడము, అలసట వంటివి ఈ పోస్ట్ డ్రోమ్ యొక్క లక్షణాలు.

మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

మైగ్రేన్ తలనొప్పి నివారణ చర్యలు

  • మానసిక ఆందోళనలు తగ్గించుకోవడం
  • శరీరానికి సరిపడా నీళ్లు తాగడం
  • సరైన సమాయానికి తినడం మరియు నిద్రపోవడం
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
  • ఎండలోకి వెళ్తే కూలింగ్ గ్లాసెస్, క్యాప్, గొడుగు వంటివి వాడడం 
  • మైగ్రేన్ ఉన్న వాళ్లు చీజ్, నట్స్,  ధూమపానం, మద్యపానంకు దూరంగా ఉండాలి
  • గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మరియు యోగా, మెడిటేషన్ వంటి చేయడం
  • తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, కాంతి లేనిచోట నిశ్శబ్దంగా ఉన్నచోట విశ్రాంతి తీసుకొవడం
  • తాజా పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ.. ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, అధిక చక్కెర, కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండడం
  • ముఖ్యంగా లినోలెయిక్ యాసిడ్ అనే పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ తక్కువగా ఉండే నూనెలను వాడడం
  • మైగ్రేన్​తో బాధపడేవారు ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కీటోజెనిక్ డైట్, మాడిఫైడ్ అట్కిన్స్ డైట్ ను పాటించడం మంచిది
  • కొద్దిగా కెఫీన్ కలిగి ఉన్న కప్పు కాఫీ లేదా టీ వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా మైగ్రేన్ నొప్పిని తగ్గించుకోవచ్చు.

మైగ్రేన్ తలనొప్పి యొక్క చికిత్స పద్దతులు

సాధారణంగా 1 నుంచి 2 గంటల పాటు తలలో ఒక వైపు తీవ్రమైన నొప్పి వేధిస్తు ఉంటే ఆ సమస్యను  మైగ్రేన్ తలనొప్పిగా చెప్పవచ్చు. అయితే 50 నుంచి 55 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత ఈ సమస్య క్రమేపి తగ్గుముఖం పడుతుంది. ఈ సమస్యకు నియంత్రిత చికిత్స మాత్రమే అందుబాటులో ఉంది. 

 ఈ మైగ్రేన్ సమస్యకు అక్యూట్‌, ప్రివెంటివ్ అనే రెండు రకాల చికిత్సలు అందుబాటులో ఉంటాయి. 

అక్యూట్‌ చికిత్సలో  మైగ్రేన్ ద్వారా వచ్చే నొప్పి తగ్గడానికి మందులు వేసుకోవాల్సి ఉంటుంది.

ప్రివెంటివ్ చికిత్సలో రాబోయే అటాక్‌ ను అక్కడికక్కడే ఆపేసి పురోగతి చెందకుండా నిరోధించే మందులు ఉంటాయి. మైగ్రేన్ లక్షణాలు మొదలైన వెంటనే మందులు వేసుకుంటే ఈ సమస్య అక్కడితో ఆగిపోతుంది. అలా కాకుండా నొప్పి వచ్చినప్పుడు లేదా మైగ్రేన్ మొదలైన తర్వాత మందులు వేసుకుంటే ఫలితం ఉండదు, కాబట్టి  మైగ్రేన్ నొప్పి మొదలయ్యే ముందే వైద్యులు సూచించిన పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం మంచిది.

నెలలో 4 లేదా అంతకు మించి ఎక్కువ సార్లు మైగ్రేన్ తో బాధపడే వాళ్ళు తప్పనిసరిగా వైద్యుని సంప్రదించి మందులు వేసుకోవడం చాలా ఉత్తమమైన చర్య. ఇలా కనీసం 3 నుంచి 6 నెలలపాటు చికిత్స తీసుకున్నట్లు అయితే సాధ్యమైనంత వరకు మైగ్రేన్ ను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

మైగ్రేన్ రావడానికి కొన్ని ప్రమాద కారకాలు ఉంటాయి. వీటిని ఎవరికి వాళ్లు గమనించుకోవడం అవసరం. కొంతమందికి స్వీట్స్ తిన్నప్పుడు, ఇంకొందరికి ఎండలో తిరిగినప్పుడు, మరికొందరికి ప్రయాణించినప్పుడు, అలాగే నిద్ర తగ్గిన, సమయానికి భోజనం చేయకపోయినా, డిహైడ్రేషన్ కు లోనైనా, ఘాటు వాసనలు పీల్చినా, ఒత్తిడికి లోనైనా, మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలను ఎవరికి వారు గమనించుకొని జాగ్రత్తగా వహించినట్లయితే చాలావరకు ఈ మైగ్రేన్ తలనొప్పి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262676 మాకు కాల్ చేయగలరు.

X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567