%1$s

కిడ్నీ వ్యాధి రకాలు, లక్షణాలు మరియు ముఖ్యమైన అంశాల గురించి వివరణ

Kidney Diseases Types main banner telugu

శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు (మూత్రపిండాలు) ప్రధానమైనవి. ఇవి సక్రమంగా పనిచేస్తే శరీర అవయవాలు కూడా చక్కగా పనిచేస్తాయి. కిడ్నీలకు ఏ చిన్న సమస్య వచ్చినా శరీరమంతా మలినమైపోతుంది. కిడ్నీలు శరీరంలో పక్కటెముకల కింద ఉండి రక్తంలోని వ్యర్థాలను, శరీరానికి అనవసరమైన మినరల్స్‌ను మూత్రం ద్వారా బయటికి పంపించి, స్వచ్ఛమైన రక్తాన్ని శరీరమంతటా పంపిణీ చేస్తాయి. అలాగే ఎలక్ట్రోలైట్స్ స్థాయిలు స్థిరంగా ఉండేలా చేస్తాయి. ఎర్ర రక్త కణాలు తయారు చేసేందుకు దోహదం చేసే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. అలాగే రక్త స్థాయిలను నియంత్రించి ఎముకలు బలంగా ఉండేందుకు దోహదపడతాయి. అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నంత కాలం మనకు ఎలాంటి సమస్యలు ఉండవు కానీ, కిడ్నీలు గనుక విఫలమైతే శరీరంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కిడ్నీ వ్యాధులు చాలా సమస్యాత్మకమైనవి. బాగా ముదిరిపోయే వరకూ బయటపడవు. కిడ్నీ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాల వల్ల మరియు మహిళల్లో రజస్వల మరియు ప్రసూతి సమయంలో ఈ ఇన్ఫెక్షన్ లు ఏర్పడతాయి.

కిడ్నీ వ్యాధుల యొక్క లక్షణాలు

సాధారణంగా కిడ్నీ వ్యాధులు లక్షణాలు మొదటి దశలోనే కనిపించవు. అయితే రోజు రోజుకీ వ్యాధి ముదురుతున్నప్పుడు కనిపించే సాధారణ లక్షణాలు:

  • తీవ్రమైన అలసట
  • వికారం &  వాంతులు
  • ఆకలి లేకపోవడం
  • కడుపు నొప్పి
  • జ్వరం 
  • కళ్లు ఉబ్బడం
  • కండరాల నొప్పులు
  • నిద్రలేమి
  • కాళ్లు, పాదాలు & మడమలు ఉబ్బడం
  • పొడి చర్మం మరియు దురద
  • మూత్ర విసర్జన సమయంలో నొప్పి & మంట
  • మూత్రం దుర్వాసన రావడం
  • మూత్రంలో రక్తం రావడం
  • తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం
  • కిడ్నీలు శరీరం వెనుక వెన్నుపూసకు ఇరువైపులా ఉంటాయి. కిడ్నీలకు సమస్య వస్తే నడుము నొప్పి కూడా వస్తుంది.
ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

కిడ్నీ వ్యాధులు రావడానికి ప్రధాన కారణాలు

కిడ్నీ వ్యాధులు రావడానికి అనేక కారణాలున్నాయి. వాటిలో ప్రధానమైనవి:

Kidney Diseases causes

  • మూత్రనాళం చిన్నదిగా ఉండడం (బ్యాక్టీరియా బయటి నుంచి మూత్రాశయంలోకి వెళ్లడాన్ని సులభతరం చేస్తుంది)  
  • బలహీనమైన రోగనిరోధక వ్యవస్థను కలిగి ఉండడం
  • మూత్ర కాథెటర్ ను ఉపయోగించడం
  • అధిక రక్తపోటు మరియు మధుమేహం (డయాబెటిస్) వ్యాధుల బారిన పడడం
  • ఎక్కువసేపు మూత్ర విసర్జన చేయకుండా ఆపుకోవడం
  • నీటిని చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవడం
  • అధిక బరువును కలిగి ఉండడం
  • ఉప్పును ఎక్కువగా తీసుకోవడం
  • శరీరంలోని ఇతరభాగంలో ఇన్‌ ఫెక్షన్‌ సోకడం (చీముగడ్డలు, టిబి, టాన్సిల్స్‌, గ్రంథులకు సోకే ఇన్‌ఫెక్షన్లు మొదలైనవి రక్తం ద్వారా కిడ్నీలకు చేరడం)
  • మూత్రం వెలుపలికి వెళ్లవలసిన దారిలో కిడ్నీ స్టోన్స్ మరియు ఇతరత్రా అడ్డంకులు ఏర్పడటం 
  • ఇవేకాక పుట్టుకతో వచ్చే  పుట్టుకతో వచ్చే అనేక వ్యాధుల వల్ల కూడా కిడ్నీ వ్యాధులు దరిచేరే అవకాశం ఉంటుంది.

 

సాధారణ కిడ్నీ వ్యాధుల రకాలు

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కిడ్నీ ఫెయిల్యూర్ కాకపోయినప్పటికీ, ఇది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. మూత్ర కోశ మార్గాల్లో వచ్చే ఇన్ఫెక్షన్ లు (UTI) ముఖ్యంగా కిడ్నీలు, మూత్ర నాళాలు, మూత్రాశయం, ప్రసేకం (మూత్రాశయం నుంచి మూత్రాన్ని బయటకు తీసుకొని పోయే వాహిక) మొదలైన భాగాలలో రావొచ్చు. మూత్ర కోశ మార్గాల్లో ఇన్ఫెక్షన్లు అనేవి ఎక్కువగా సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాల ద్వారానే వస్తాయి.వెన్నునొప్పి, జ్వరం, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, పొత్తికడుపు నొప్పి, మూత్రంలో రక్తం, వికారం, వాంతులు వంటివి ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు.

IgA నెఫ్రోపతి: ఇదో రకమైన కిడ్నీ వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి బాల్యం, లేదా కౌమార దశలో మొదలవుతుంది. ఇది కిడ్నీలోని ఫిల్టర్ల(గ్లోమెరులి) లోపల ఇమ్యునోగ్లోబిన్ ఏ(ఐజీ ఏ) ప్రొటీన్ పేరుకుపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధిలో  మూత్రం వచ్చేటప్పుడు దానితో పాటు రక్తం కూడా వస్తుంది. వ్యాధి నిర్ధారణ పరీక్ష మరియు బయాప్సీ ద్వారా మాత్రమే ఈ వ్యాధిని గుర్తించవచ్చు.

పాలిసిస్టిక్ కిడ్నీవ్యాధి: ఇది కిడ్నీలలోని తిత్తులకు సంబంధించినది. కాలక్రమేణా ఇవి పెరిగి మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తాయి. ఇది దాదాపు జన్యుపరంగా సంక్రమించే వ్యాధి. పొత్తికడుపు పైభాగంలో మరియు పక్కన, వెన్నునొప్పి, మూత్రంలో రక్తం, తరచుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు గురవ్వడం వంటివి ఈ వ్యాధి యొక్క లక్షణాలు.

దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (సీకేడీ): దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి (CKD) అనేది మూత్రపిండం యొక్క మృదుకణజాలం నెమ్మదిగా దెబ్బ తినడం వల్ల కిడ్నీ సామర్థ్యం క్షీణించి, కోలుకోలేని పరిస్థితి ఏర్పడడం. ఈ వ్యాధికి గురైన వారి కిడ్నీలు క్రమంగా రక్తాన్ని వడకట్టే సామర్థ్యాన్ని కోల్పోతాయి, తద్వారా ఇది శరీరంలో వ్యర్థ పదార్థాలు మరియు ద్రవాలు పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.  ఈ వ్యాధి మధుమేహం(డయాబెటిస్ లేదా షుగర్), అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారిలో చాలా సాధారణం. వికారంగా ఉండడం, వాంతులు, ఆకలి లేకపోవడం, పాదాలు, చీలమండ వద్ద వాపు, తక్కువగా శ్వాస తీసుకోవడం, నిద్రలేమి, ఎక్కువగా లేదా తక్కువగా మూత్రవిసర్జన చేయడం వంటివి ఈ వ్యాధి యొక్క లక్షణాలు.

కిడ్నీలో రాళ్లు:  కిడ్నీల్లో పేరుకుపోయే మినరల్స్ లేదా ఇతర ధాతువులు స్పటిక రూపంలో ఏర్పడటాన్ని కిడ్నీలో రాళ్లు రావడం అంటారు.  నీళ్లు తక్కువగా తాగడం, ఊబకాయం, జీవనశైలి సమస్యలు, ఆహారం కారణంగా ఈ సమస్య వస్తుంది. మూత్రవిసర్జన సమయంలో నొప్పి, మూత్రంలో రక్తం, మూత్రనాళంలో అడ్డంకులు వంటి లక్షణాలు సంభవిస్తాయి.

డయాబెటిక్ నెఫ్రోపతి: మధుమేహం ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు కిడ్నీ వైఫల్యానికి గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కిడ్నీవ్యాధులకు మధుమేహం  ప్రధాన కారణం.  మధుమేహం నియంత్రణలో లేని వ్యక్తుల్లో ఈ డయాబెటిక్ కిడ్నీ వ్యాధి సాధారణంగా కనిపిస్తుంది. కాళ్లు ఉబ్బడం, మూత్రవిసర్జనలో నురుగు రావడం, నీరసంగా ఉండడం, బరువు తగ్గడం, దురదలు, వికారం, వాంతులు వంటివి ఈ వ్యాధి యొక్క లక్షణములు

కిడ్నీ ఇన్ఫెక్షన్: ఇది మూత్రపిండాల సంబంధిత సంక్రమణ యొక్క అత్యంత సాధారణ రూపం. ఇది అకస్మాత్తుగా సంభవిస్తుంది మరియు సాధారణంగా మూత్రాశయం నుంచి కిడ్నీలకు వ్యాపించే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) ఫలితంగా అభివృద్ధి చెందుతుంది. అధిక జ్వరం, చలి, తీవ్రమైన వెన్నునొప్పి, వికారం, వాంతులు మరియు మూత్రవిసర్జన సమయంలో మంట, ఈ వ్యాధి యొక్క లక్షణాలు.

హైపర్‌టెన్సివ్ నెఫ్రోస్ల్కెరోసిస్: మధుమేహంతో పాటు కిడ్నీలను ప్రభావితం చేసే మరో సమస్య అధిక రక్తపోటు. రక్తపోటు వ్యాధి, కిడ్నీల్లోని రక్తనాళాలను దెబ్బతీస్తుంది, తద్వారా కిడ్నీల పనితీరుపై ప్రభావం పడుతుంది. ఇది రక్తం నుంచి అనవసరమైన వ్యర్థాలు, ధాతువుల తొలగింపు విధులను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. వికారం, వాంతులు, తలతిరగడం, నీరసంగా ఉండడం, తలనొప్పి, మెడనొప్పి వంటివి ఈ వ్యాధి యొక్క లక్షణాలు.

మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

కిడ్నీ వ్యాధుల నిర్ధారణ పద్దతులు

కిడ్నీ సమస్యలతో మీరు వైద్యులను సంప్రదించగానే ఈ క్రింది పరీక్షల ద్వారా కిడ్నీ వ్యాధి నిర్ధారిస్తారు:

వైద్య మరియు శారీరక పరీక్ష: మీరు అనుభవిస్తున్న లక్షణాలు మరియు పలు రకాల ప్రమాద కారకాలను గురించి అడిగి తెలుసుకుంటారు.

మూత్ర నమునా పరీక్ష: ఇన్ఫెక్షన్‌ని సూచించే బ్యాక్టీరియా, రక్తం లేదా తెల్ల రక్త కణాల కోసం మూత్ర నమూనాను పరీక్షించడం.

మూత్రపరీక్ష (కల్చర్): ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే నిర్దిష్ట బ్యాక్టీరియాను గుర్తించడానికి ఈ  పరీక్షసహాయపడుతుంది.  

రక్త పరీక్షలు: రక్త పరీక్షలు అత్యంత సాధారణ వైద్య పరీక్షలలో ఒకటి. సాధారణ ఆరోగ్యాన్ని అంచనా వేయడం, ఇన్‌ఫెక్షన్ గుర్తించడం, కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది.

ఇమేజింగ్ పరీక్షలు: అల్ట్రాసౌండ్‌లు లేదా CT స్కాన్‌లను ఉపయోగించి మూత్ర వ్యవస్థలో చీము, ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతాన్ని గుర్తిస్తారు.

కిడ్నీ ఫంక్షన్ టెస్ట్: కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ 24 గంటల్లో మూత్రంలో అల్బుమిన్ యొక్క స్ధాయిని తెలుసుకోవచ్చు. (మూత్రంలో అధిక అల్బుమిన్ స్ధాయి మూత్రపిండాల వ్యాధిని సూచిస్తుంది)

కిడ్నీ వ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు

  • కిడ్నీ వ్యాధులు చాలా వరకు మూత్రాశయ ఇన్‌ఫెక్షన్‌తో మొదలవుతుంది, కాబట్టి మూత్ర నాళంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
  • డయాబెటిస్, హైబీపీ ఉన్నవారు కచ్చితంగా వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి
  • అంటువ్యాధులను నివారించడానికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మరియు ఎవరికి వారు  స్వీయ శుభ్రతను పాటించడం చాలా అవసరం
  • శరీరంలోకి ప్రవేశించే హానికరమైన బ్యాక్టీరియాను నివారించడానికి ఎల్లప్పుడూ  వేడిగా వండిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది
  • మన ఆహారంలో ఉప్పును చాలా తక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎక్కువ మోతాదులో ఉండే బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు, నిల్వ ఆహారాలకు దూరంగా ఉండాలి.
  • రక్తంలో కొవ్వు, కొలెస్ట్రాల్‌ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు కొవ్వు ఎక్కువగా ఉండే మాంసాహారం తక్కువగా తీసుకుంటూ, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి
  • ప్రతి రోజు క్రమం తప్పకుండా కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ఉత్తమం
  • ధూమపానం మరియు మద్యపానం మానేయడం
  • మూత్ర, మల విసర్జన తర్వాత శుభ్రమైన నీటితో జననాంగాలను శుభ్రం చేసుకోవడం
  • సంభోగం (సెక్స్) తర్వాత వీలైనంత త్వరగా మూత్ర విసర్జన చేయడం
  • విటమిన్ C అధికంగా ఉండే సిట్రస్ పండ్లు, బ్రోకలీ, దోస కాయ, ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవడం 
  • కిడ్నీ సమస్యలతో బాధపడే వారు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి
  • పొటాషియం తక్కువగా ఉన్న ఆహారాలను (ఆపిల్స్, కాబేజ్, కారెట్లు, బీన్స్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ) తీసుకోవడం
  • యూరినరీ ఇన్ఫెక్షన్స్‌ని సరైన పద్ధతిలో, సరైన మందులతో సరైన సమయంలో వైద్యం చేయించుకుని, పూర్తిగా తగ్గేలా చూసుకోవాలి
  • రక్తపోటు, మధుమేహం, రక్త హీనత, నీరసం, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలు ఉన్న వారు తరుచూ పరీక్ష చేసుకుంటూ వైద్యుల నుంచి సరైన మందులు వాడడం
  • కిడ్నీ వ్యాదిగ్రస్తులు వైద్యులు సూచించిన యాంటిబయోటిక్  మందులను మాత్రమే వాడాలి. నొప్పి నివారణ మందుల వంటి కొన్ని ఔషధాలు దీర్ఘకాలంలో కిడ్నీలను దెబ్బతీసే అవకాశం ఉన్నందున డాక్టర్ సలహా లేనిదే ఎట్టి పరిస్థితుల్లోనూ నొప్పిని నివారించే మందులు మరియు స్టెరాయిడ్స్ వాడకూడదు.

కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించి సరైన సమయంలో వైద్యున్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకున్నట్లైతే, ఈ సమస్య బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే, కొన్ని సార్లు ఈ  వ్యాధులకు చికిత్స చేయకుండా వదిలేస్తే మాత్రం దీర్ఘకాలిక, ప్రాణాంతక సమస్యలకు సైతం దారి తీస్తుంది

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262681 మాకు కాల్ చేయగలరు.

About Author –

Dr. Sashi Kiran A, Consultant Nephrologist, Yashoda Hospitals - Hyderabad
MD (Pediatrics), DM (Nephrology)

best Nephrologist Doctor

Dr. Sashi Kiran A

MD (Pediatrics), DM (Nephrology)
Consultant Nephrologist

X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567