గులియన్ బారే సిండ్రోమ్: రకాలు, లక్షణాలు, నిర్ధారణ పరీక్షలు మరియు నివారణ
గులియన్ బారే సిండ్రోమ్ (GBS) అనేది ఒక అరుదైన ఆటో ఇమ్యూన్ న్యూరోలాజికల్ డిజార్డర్. నరాల్లో చూట్టు ఉండే పొర దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ప్రధానంగా గులియన్ బారే సిండ్రోమ్ (GBS) వ్యాధి మన శరీర ఇమ్యూనిటీని పరిధీయ నాడీ వ్యవస్థ (PNS)పై ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి సాధారణంగా కాంపిలోబాక్టర్ జెజుని (Campylobacter jejune) బ్యాక్టీరియల్ ఇన్ప్‌క్షన్‌ల వల్ల సంభవిస్తుంది. అంతే కాకుండా ఈ సమస్య ప్రధానంగా బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫ్‌క్షన్‌ల బారిన పడిన తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి కారణంగా నరాలు దెబ్బతిని, కండరాలు బలహీనమైపోయి కొన్ని సార్లు పక్షవాతం కూడా రావొచ్చు. ఈ వ్యాధి ఎవరికైనా రావొచ్చు. అయితే ప్రధానంగా 50 ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధికి గురైన వారిలో ప్రధానంగా తిమ్మిరి మరియు కండరాల బలహీనత వంటివి అధికంగా ఉంటాయి.
ఇప్పటికే వైరల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వారిలో గులియన్ బారే సిండ్రోమ్‌కు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. మధుమేహం, రక్తపోటు, ఇమ్యూన్ డిఫిషియెన్సీ ఉన్న వారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ. దగ్గు, జలుబు, జ్వరం, అతిసారం, ఏదైనా టీకా లేదా సర్జరీ కారణంగా ఈ సిండ్రోమ్ శరీరంలోకి ప్రవేశించవచ్చు. ఇది ఒక తాత్కలిక వ్యాధి అయినప్పటికీ దీని నుంచి కోలుకోవడానికి కొన్ని నెలలు సమయం పట్టవచ్చు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే మార్గాలపై దృష్టి సారించాలి. పలు రకాల అనారోగ్యం కారణంగా మరియు తీవ్రమైన వ్యాధులకు గురికావడం మూలాన 3-5 శాతం మంది వృద్ధాప్యంలో మరణాలకు గురవుతున్నారు.
గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు
సాధారణంగా, ఈ వ్యాధితో బాధపడుతున్న వారి చేతులు, కాళ్ళలో, చీలమండలు లేదా మణికట్టులో జలదరింపు & తిమ్మిరి ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు. వీటితో పాటుగా:
- నడవడం లేదా మెట్లు ఎక్కడం కష్టంగా మారడం
- కండరాల బలహీనత
- మాట్లాడటంలో తడబాటు
- నమలడం లేదా మింగడంలో ఇబ్బంది
- కళ్లు లేదా ముఖాన్ని కదల్చలేకపోవడం
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- నోట్లో లాలజలం మింగలేకపోవడం
- రక్తపోటు (BP) స్థిరంగా లేకపోవడం
- వీపు కింది భాగంలో భరించలేని నొప్పి
- గుండె కొట్టుకునే సామర్థ్యం వేగంగా పెరగడం మరియు పక్షవాతం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి
గులియన్ బారే సిండ్రోమ్ కు గల కారణాలు
గులియన్ బారే సిండ్రోమ్ రావడానికి కచ్చితమైన కారణం తెలియనప్పటికీ ఈ వ్యాధి ప్రధానంగా బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫ్‌క్షన్‌ల బారిన పడిన తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది.
కోవిడ్-19, ఇన్ ఫ్లూయెంజా, డెంగీ వంటి వైరస్‌లు గులియన్ బారే సిండ్రోమ్ (GBS) ప్రమాదాన్ని మరింతగా పెంచుతాయి. ముఖ్యంగా గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధికి కాంపిలోబాక్టర్ జెజుని (Campylobacter jejune) బాక్టీరియా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అయితే ఈ వైరస్ కలుషిత ఆహారం మరియు నీటి ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది. అంతే కాకుండా కొన్ని రకాల వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత కొంత మంది వ్యక్తులకు కూడా గులియన్ బారే సిండ్రోమ్ (GBS) వచ్చే అవకాశం ఎక్కువ.
.
గులియన్ బారే సిండ్రోమ్ (GBS) రకాలు
ఈ వ్యాధిలో అనేక రకాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి:
అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమిలినేటింగ్ పాలీరాడిక్యులోన్యూరోపతి (AIDP): ఇది గ్విలియన్-బార్రే సిండ్రోమ్ (GBS) యొక్క అత్యంత సాధారణ రూపం. ఇది పరిధీయ నరాల మైలిన్ కోశంపై దాడి చేసి, అవయవాలలో బలహీనత, ఇంద్రియ నష్టం వంటి లక్షణాలను కలిగిస్తుంది. ముఖ్యంగా యూరప్ మరియు ఉత్తర అమెరికా జనాభాలో ఈ తరహా వ్యాధి ఎక్కువ.
మిల్లర్ ఫిషర్ సిండ్రోమ్ (MFS): మిల్లర్ ఫిషర్ సిండ్రోమ్ అనేది ఒక అరుదైన రుగ్మత, ఇది మీ రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేయడానికి కారణమవుతుంది, ఈ రకంలో మొదట కళ్ల చుట్టూ నల్లగా చారల్లా ఏర్పడి ఫేసియల్ పెరాలసిస్ కి దారి తీస్తుంది. అంతే కాకుండా నడక నిలకడగా ఉండదు. ఈ పరిస్థితి ఆసియా దేశాలలో ఎక్కువ.
అక్యూట్ మోటార్ యాక్సోనల్ న్యూరోపతి (AMAN): ఈ రకం తీవ్రమైన పక్షవాతం మరియు కంటి చూపు మందగించినప్పుడు మాత్రమే నిర్ధారణ అవుతుంది. సాధారణంగా ఈ రకం సిండ్రోమ్ మెక్సికో, చైనా మరియు జపాన్ వంటి దేశాల్లో సంభవిస్తుంది.
అక్యూట్ మోటార్-సెన్సరీ యాక్సోనల్ న్యూరోపతి (AMSAN): AMSAN అనేది గులియన్-బారే సిండ్రోమ్ (GBS) యొక్క తీవ్రమైన రూపం. ఇది బలహీనత, లోతైన స్నాయువు ప్రతిచర్యలు కోల్పోవడం, ఇంద్రియ లక్షణాల వంటి లక్షణాల ద్వారా గుర్తించవచ్చు.
గులియన్ బారే సిండ్రోమ్ నిర్ధారణ పరీక్షలు
నరాల సమస్యలతో మీరు వైద్యులను సంప్రదించగానే అతను ఇంతకు ముందు మీ వైద్య రికార్డులను గమనిస్తాడు మరియు నరాల ద్వారా కలిగే పలు సమస్యలను తెలుసుకోవడానికి శారీరక పరీక్షను సైతం చేస్తారు. వీటితో పాటుగా:
నరాల ప్రసరణ అధ్యయనం (NCS) & ఎలక్ట్రోమియోగ్రఫీ (EMG): శరీరంలోని నరాల గాయం యొక్క ఉనికి మరియు తీవ్రతను గుర్తించడానికి & కండరాలు మరియు నరాల యొక్క విద్యుత్ కార్యకలాపాలను కొలవడానికి మరియు కండరాల బలహీనత, ఏ రకమైన కండరాల సమస్య వల్ల బలహీనత లేదా పక్షవాతం వచ్చిందా అని నిర్ధారించడానికి ఈ పరీక్షలు చేస్తారు.
లంబార్ పంక్చర్ (స్పైనల్ ట్యాప్): ఇది సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ (CSF) ను సేకరించడానికి దిగువ వీపులో సూదిని చొప్పించే ప్రక్రియ. ఇన్ఫెక్షన్ లేదా వ్యాధి సంకేతాల కోసం ఈ ద్రవం పరీక్షించబడుతుంది.
రక్త పరీక్షలు: నరాల బలహీనత లేదా పక్షవాతం కలిగించే ఇన్ఫెక్షన్లు లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ద్వారా వచ్చే సమస్యలను గుర్తించడానికి రక్త పరీక్షలు సహాయపడతాయి.
ఇమేజింగ్ పరీక్షలు: ఏవైనా కంప్రెస్డ్ నరాలు లేదా పక్షవాతం వల్ల కలిగే ట్యూమర్ పెరగుదల లేదా హెర్నియేటెడ్ వెన్నుపాము గాయాలను గుర్తించడంలో X- ray, MRI మరియు CT స్కాన్‌లు సహాయపడతాయి.
నరాలు మరియు కండరాల బయాప్సీ: కండరాలు మరియు నరాల బలహీనతలను ప్రభావితం చేసే పరిస్థితులను నిర్ధారించడం కోసంఈ పరీక్షను చేస్తారు.
జీవరసాయన మరియు జన్యు పరీక్ష
.
గులియన్ బారే సిండ్రోమ్ (GBS) చికిత్స విధానాలు
- గులియన్ బారే సిండ్రోమ్ (GBS) చికిత్సలో స్టెరాయిడ్లు చాలా పరిమిత పాత్రను కలిగి ఉంటాయి.
- గులియన్ బారే సిండ్రోమ్ (GBS) చికిత్సలో IV ఇమ్యునోగ్లోబులిన్ (IVIG) మరియు ప్లాస్మాఫెరెసిస్ అనే పద్దతులను ఉపయోగించి రోగనిరోధక వ్యవస్థను మార్చడం ద్వారా ఆటో ఇమ్యూన్ రుగ్మతలు మరియు కొన్ని నాడీ సంబంధిత పరిస్థితులను చికిత్స చేస్తారు.
- గులియన్ బారే సిండ్రోమ్ (GBS) నివారణలో ఫిజియోథెనపీ మరియు ఆక్యుపేషనల్ థెరపీ వంటివి చాలా ముఖ్యమైనవి.
- సాధారణంగా ఈ గులియన్ బారే సిండ్రోమ్ (GBS) వ్యాధి బారిన పడిన కొందరు 6-12 నెలల లోపు పూర్తిగా కోలుకోవడం జరుగుతుంది. మరికొందరు 3 ఏళ్లు వరకు ఈ వ్యాధి లక్షణాలను కలిగి ఉంటారు.
గులియన్ బారే సిండ్రోమ్ నివారణ చర్యలు
గులియన్ బారే సిండ్రోమ్ సమస్యను పూర్తిగా నివారించలేకపోయినా.. దానిని ప్రేరేపించే ఇన్ఫ్‌క్షన్‌ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
- సిండ్రోమ్ బారిన పడకుండా ఉండటానికి, వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షించుకోవడం చాలా ముఖ్యం.
- ఈ వ్యాధిని నివారించడం కోసం పరిశుభ్రమైన కాచిన నీటిని తాగాలి
- పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు మంచి కొవ్వులతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి
- ధూమపానం మరియు మద్యపానం తీసుకోవడం లేదా డ్రగ్స్ వంటివి తీసుకోవడం వల్ల నరాల సంబంధిత రుగ్మతలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి కావున వాటికి దూరంగా ఉండాలి
- శారీరక శ్రమ మరియు వ్యాయామం చేయడం వల్ల నరాల పనితీరు మెరుగుపడి నరాల బలహీనతకు గురికాకుండా ఉంటాయి.
- నాడీ వ్యవస్థ శక్తిమంతంగా ఉండేందుకు విటమిన్-డి చాలా అవసరం.
- ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉండే చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల కూడా నరాలకు బలం చేకూరుతుంది
గులియన్ బారే సిండ్రోమ్ (GBS) అంటువ్యాధి కాదు మరియు తగిన చికిత్స తీసుకుంటే నయం చేసుకునే వీలుటుంది. ఏవరైనా వైరస్, బాక్టీరియా సంబంధ వ్యాధుల బారినపడి కోలుకున్న తరువాత గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తే మాత్రం సరైన సమయంలో వైద్యున్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకున్నట్లైతే, ఈ సమస్య బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే, కొన్ని సార్లు ఈ వ్యాధి చికిత్సలో నిర్లక్ష్యం వహించినట్లు అయితే ప్రాణాంతక సమస్యలకు సైతం దారి తీయవచ్చు. చాల మంది తమ ఆరోగ్య సామర్థ్యాలను తిరిగి పొందడానికి లేదా మెరుగుపరచుకోవడానికి కొన్ని నెలలుగా పునరావాసం పొందాల్సి ఉంటుంది, ఆ సమయంలో వారికి కుటుంబం నుంచి లభించే మద్దతు లేదా సహకారం మరియు డాక్టర్ యొక్క పర్యవేక్షణ ప్రధానమైనది.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.
M Dr. G. V. Subbaiah Chowdhary
MD, DM (Neurology)