%1$s

మలబద్ధకం: రకాలు, లక్షణాలు, కారణాలు మరియు నివారణ చర్యలు

Constipation Types, Symptoms, Causes and preventative measures_telugu blog banner

ప్రస్తుత ఆధునిక జీవన శైలి మరియు అస్తవస్థమైన ఆహారపు అలవాట్ల వల్ల ఈ రోజుల్లో చాలా మంది, మలబద్దక సమస్యలతో బాధపడుతున్నారు. ఒక వ్యక్తి వారానికి మూడు కంటే తక్కువ సార్లు మల విసర్జన చేయడం లేదా మలం విసర్జించడంలో ఇబ్బందిగా ఉండే పరిస్థితిని మలబద్ధకం అంటారు. అయితే, ప్రతి ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుంది- ఇబ్బంది లేకుండా, సాధారణంగా మల విసర్జన అనేది ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి మారుతూ ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ సమస్యలకు గురవతుంటారు. మలబద్దకం మన దైనందిన జీవితాన్ని చాలా ఇబ్బంది పెట్టడమే కాక, అనేక అనారోగ్య సమస్యలకు గురిచేస్తుంది.  ఈ సమస్యను బయటకు చెప్పుకోలేక బాధపడే వాళ్లు చాలా మంది ఉంటారు.

అడపాదడపా మలబద్దకం సమస్య చాలా సాధారణమే అయినప్పటికీ, ఒకవేళ రోజుల తరబడి నిర్లక్ష్యం చేస్తే మాత్రం అనేక ఆరోగ్య సమస్యలతో (హెమరాయిడ్స్‌, పైల్స్‌, అనల్ ఫిషర్, జీర్ణవ్యవస్థ సమస్యలు) అవస్థ పడాల్సి వస్తుంది.

మలబద్ధకానికీ గల కారణాలు

  • మలబద్ధకం అనేక కారణాల వల్ల సంభవించవచ్చు, కొన్ని రోజువారీ అలవాట్లకు సంబంధించినవి కాగా, మరికొన్ని ఆరోగ్య సమస్యలకు సంబంధించినవి
  • ఆహారం: ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం
  • డీహైడ్రేషన్: తగినంత నీరు త్రాగకపోవడం వల్ల, పేగులలోని మలం గట్టిపడి మలవిసర్జన చేయడం కష్టమవుతుంది.
  • జీవనశైలి: దైనందిన జీవితంలో ఎక్కువ సమయం ఒకే చోట కూర్చోని ఉండడం మరియు వ్యాయామం లేకపోవడం వల్ల, జీర్ణక్రియ మందగించి మలబద్దకం వచ్చే అవకాశం ఉంటుంది.
  • మందులు: నొప్పి నివారణలు మరియు యాంటాసిడ్లు వంటి కొన్ని మందులు కూడా మలబద్ధకానికి దారితీయవచ్చు.
  • మలవిసర్జన ప్రేరేపణను విస్మరించడం: మలవిసర్జన చేయాలనే కోరికను విస్మరించడం లేదా ఎక్కువ కాలం పాటు నీయంత్రించి ఉంచడం వల్ల కాలక్రమేణా మలబద్ధకం ఏర్పడుతుంది.
  • హార్మోన్ల అసమతుల్యత కూడా మలబద్ధకానికి కారణం కావచ్చు
  • ఫిషర్స్‌, పైల్స్‌, ఫిస్టులా నొప్పి కారణంగా కాలక్రమేణ మాల విసర్జన సాఫీగా అవ్వక, మలబద్దకం సమస్య వస్తుంది.
  • మలద్వార మరియు పెద్దపేగు క్యాన్సర్లు ఉన్నప్పుడు కూడా మలబద్ధకం సమస్యకు గురవుతుంటారు
మీ ఆరోగ్య సమస్యపై పూర్తి అవగాహన పొందడానికి

మలబద్ధకం యొక్క రకాలు:

మలబద్ధకాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు

క్రియాత్మకమైన మలబద్ధకం: మలబద్ధకం యొక్క అత్యంత సాదరమైన రకం, క్రియాత్మకమైన మలబద్ధకం. క్రియాత్మకమైన మలబద్ధకం అనేది, శరీర నిర్మాణం లేదా శారీరక కారణాల వల్ల కాకుండా, జీవనశైలి లేదా ఆహార అలవాట్లు మరియు మానసిక ఒత్తిడి మూలంగా వస్తుంది.

ఆర్గానిక్ మలబద్ధకం: ఈ రకమైన మలబద్ధకం ఔషధ-ప్రేరిత మలబద్ధకం (ఓపియాయిడ్లు లేదా యాంటాసిడ్స్ వంటి మందులు) లేదా పెద్దప్రేగులో అడ్డంకి లేదా మల విసర్జనను శారీరకంగా నిరోధించే క్యాన్సర్ వంటి నిర్మాణపరమైన సమస్యల వల్ల కలుగుతుంది.

మలబద్దకం యొక్క లక్షణాలు

Constipation Symptoms telugu

  • మలంలో రక్తం
  • బరువు తగ్గడం
  • తీవ్రమైన కడుపు నొప్పి
  • వారానికి 3 కంటే తక్కువ సార్లు మల విసర్జన చేయడం
  • గట్టి ముద్దగా ఉండే మలం
  • మల విసర్జన సమయంలో ఒత్తిడి & నొప్పి
  • పొత్తికడుపులో నొప్పి లేదా ఉబ్బరం
  • అధిక అపానవాయువు (గ్యాస్) 

జీవనశైలిలో మార్పులు ఉన్నప్పటికీ నిరంతర మలబద్ధకానికి గురికావడం, 50 ఏళ్లు పైబడిన వారిలో జీర్ణక్రియలో గణనీయమైన మార్పులు రావడం, ఒకవేళ అలసట లేదా శ్వాస ఆడకపోవడం వంటి రక్తహీనత లక్షణాలలో దేనికైన లోనైతే, వీలైనంత త్వరగా వైద్య సంరక్షణను పొందడం చాలా ముఖ్యంగా పరిగణించాలి.

ఈ లక్షనాలు కలిగి ఉంటె

మలబద్దకం యొక్క నివారణ చర్యలు

ఎక్కువగా ఫైబర్ ఉన్న ఆహారాలను తీసుకోవడం: ఆహారంలో పండ్లు, కూరగాయలు, నట్స్, సీడ్స్ మరియు తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం మూలంగా, మలవిసర్జన సాఫీగా మరియు సులభం అవుతుంది.

శరీరాన్నీ హైడ్రాటెడ్గా ఉంచాలి (నీరు తప్పకుండా త్రాగాలి ) : రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి. ఎక్కువ నీరు మీ శరీరంలోని మలాన్ని ప్రేగుల ద్వారా సులభంగా బయటకి పయనింపజేస్తుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం: శారీరక శ్రమ మీ జీర్ణవ్యవస్థను ప్రేరేపిస్తుంది. రోజువారీ నడక వల్ల కూడా మలబద్దకం ను నివారించుకోవచ్చు

దినచర్యను ఏర్పరచుకోండి: మీ శరీరం యొక్క సహజ లయను నియంత్రించడంలో సహాయపడటానికి, బ్రెక్ పాస్ట్ లేదా భోజనం చేసిన తర్వాత ప్రతి రోజూ ఒకే సమయంలో బాత్రూమ్‌కి వెళ్లడానికి కేటాయించండి.

ఆలోచనాత్మక మలవిసర్జన: మలవిసర్జన అనేది అసంకల్పితంగా కాకుండా ప్రయత్నపూర్వకంగా ఉండాలి. మీరు బాత్రూంలో ఉన్నప్పుడు మీ ఫోన్‌ని ఉపయోగించడం, వార్తాపత్రిక చదవడం లేదా ఫోన్‌లో మాట్లాడటం వంటి పరధ్యానాలను నివారించండి. 

మలవిసర్జన చర్యపై దృష్టి కేంద్రీకరించడం వలన శరీరం విశ్రాంతిని మరియు ప్రక్రియను సులభతరం చేసే సామర్థ్యాన్ని పెంచుతుంది.

బ్రెడ్‌, పాస్తా ,పిజ్జా, బర్గర్,ఫ్రెంచ్‌ఫ్రెస్‌, జంక్ ఫుడ్ మరియు షుగర్‌ కంటెంట్ ఎక్కువగా ఉండే బేకరీ ఐటమ్స్‌ (కేక్‌ లు, కుకీలు) తినడం తగ్గించాలి.

మద్యపానం మరియు ధూమపానం వంటి అలవాట్లను, పూర్తిగా మానుకోవడం ఉత్తమం.

మలబద్దకం  యొక్క  చికిత్సా విధానం

మలబద్ధకం నిర్ధారణ పద్దతులు

సాధారణ జీవనశైలి సమస్యలే మలబద్ధకానికి కారణమని ఒకవేళ భావించి చికిత్స అందిస్తే, ఆ సమస్య నివారణ కాకుండా మరింత పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన వైద్య చరిత్ర మరియు శారీరక పరీక్ష ఆధారంగా మలబద్ధకాన్ని నిర్ధారించి చికిత్స చేయాలి. నిర్ధారణ సమయంలో, మీ డాక్టర్ మీ యొక్క అలవాట్లు, ఆహారం, జీవనశైలి మరియు మీరు తీసుకుంటున్న ఏవైనా మందుల గురించి పలు ప్రశ్నలు అడుగవచ్చు. కొన్ని సందర్భాల్లో, థైరాయిడ్ రుగ్మతలు లేదా ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వంటి వ్యవస్థీకృతమైన కారణాలు తెలుసుకోవడాని పలు పరీక్షలు కూడా చేయవచ్చు. ఆర్గానిక్ మలబద్ధకమా అన్నది తెలుసుకోవడానికి కొలనోస్కోపీ లేదా సిగ్మాయిడోస్కోపీ అనే టెస్టులు అవసరం అవుతాయి. అదనంగా, ప్రేగు కదలికలు ఎంత బాగా ఉన్నాయో అంచనా వేయడానికి మరియు సరైన చికిత్సకు మార్గనిర్దేశం చేయడానికి ప్రత్యేక అధ్యాయనాలు ఉన్నాయి.

దీర్ఘకాలంగా మలబద్దకంతో బాధపడుతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా మీ దేగ్గర్లో ఉన్న యశోద హాస్పిటల్ గాస్ట్రోఎంటరోలాజిస్ట్ డాక్టర్ ను సంప్రదించి, సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే ఈ సమస్య తీవ్రతరం కాకుండానే నీవారించుకోవచ్చు.

 మీ సమస్యకు ఉత్తమ చికిత్సకై  

మలబద్దకం  యొక్క  చికిత్స విధానం

జీవనశైలి మార్పులు మలబద్దకాన్ని అరికట్టెందుకు ప్రధమ మరియు ముఖ్యమైన చర్య 

  • ఎక్కువ మోతాదులో ఫైబర్ తీసుకోవడం: సహజ ఆహార వనరుల నుంచి  రోజుకు కనీసం 25 గ్రాముల డైటరీ ఫైబర్‌ని పొందడానికి పండ్లు మరియు కూరగాయలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
  • క్రమం తప్పకుండా మలవిసర్జన చేయడం: రోజు 5 నిమిషాలు, రోజుకు ఒకటి లేదా రెండుసార్లు, తిన్న 30 నిమిషాల తర్వాత మలవిసర్జనకు వెళ్లాలి మలవిసర్జన చేయాలని అనిపించకపోయినా-మలవిసర్జన ప్రయత్నం చేయాలి. ఇది సహజమైన గ్యాస్ట్రో-కోలోనిక్ రిఫ్లెక్స్‌ను ఉపయోగించుకుంటుంది (భోజనం తర్వాత పెద్దప్రేగు కదలికలలో పెరుగుదల సహజంగా సంభవిస్తుంది).
  • కమోడ్ స్థానం: భారతీయ కమోడ్ శైలిని ఉపయోగించడం ఉత్తమం. పాశ్చాత్య కమోడ్‌ని ఉపయోగించే వారికి, వారి పాదాల కింద ఒక చిన్న స్టూల్ (కమోడ్‌లో సగం ఎత్తు) ఉంచడం సహాయపడుతుంది. ఇది మరింత అనుకూలమైన స్థితికి అనుమతిస్తుంది, ఎందుకంటే తొడలు పొత్తికడుపుపై ​​ముడుచుకుని, పిరుదులను బాగా వేరుచేయడాన్ని ప్రోత్సహిస్తుంది మరియు సులభంగా మలవిసర్జనను సులభతరం చేస్తుంది.ఒకవేళ జీవనశైలి మార్పులతో మలబద్ధక సమస్య నివారించలేకపోతే, మరికొన్ని ఇతర చికిత్స మార్గాలను తెలుసుకోండి.
  • డైటరీ ఫైబర్ సప్లిమెంట్స్: ఆహారం నుంచి తగినంత పీచు పధార్థాలు పొందడంలో ఇబ్బంది ఉన్న వ్యక్తులకు, డైటరీ ఫైబర్ సప్లిమెంట్స్  ప్రయోజనకరంగా ఉంటాయి.
  • లాక్సిటివ్స్: ఆహార మరియు ఇతర మార్పులు చేసినా ఫలితం లేనప్పుడు, ఈ మందులు సహాయపడతాయి. వీటిని అవసరమైనప్పుడే, మరియు డాక్టర్ సూచించిన మోతాదులో మాత్రమే వాడాలి.
  •  మందులు: ఒకవేళ మలబద్దకం తీవ్రంగా ఉన్నవారికి, ప్రేగు కదలికలను ప్రేరేపించడంలో సహాయపడే మందులను వైద్యులు సూచించవచ్చు. చాలామంది మలబద్ధకం ఉన్నప్పుడు ఆహారంలో మార్పులు చేసుకోకుండా లాక్జేటివ్‌ (మలవిసర్జన ప్రేరకాలు) మందులను వాడుతుంటారు. ఇది అస్సలు మంచిది కాదు. డాక్టర్ సలహా లేనిదే, సొంతంగా మందులు వాడకపోవడం మంచిది.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262681 మాకు కాల్ చేయగలరు.

Dr. Gopi Srikanth

About Author –

Best Gastroenterology doctor in Hyderabad

Dr. Gopi Srikanth

MD (PGIMER, Chandigarh)
DM & Fellowship (AIIMS, New Delhi)
EUS Fellowship (WISE, WEO)
Consultant in Gastroenterology, Hepatology, and
Advanced Endoscopy

X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567