%1$s

పెద్దప్రేగు (కోలన్) క్యాన్సర్: లక్షణాలు, కారణాలు, దశలు & చికిత్సలు

Colorectal Blog telugu banner

ప్రస్తుతం కాలంలో వచ్చిన జీవనశైలి మార్పుల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సహజ క్యాన్సర్లలో ప్రేగు క్యాన్సర్ కూడా ఒకటి. ప్రస్తుతం యువతలో పెద్ద పేగు క్యాన్సర్ కేసులు రోజు రోజుకు వేగంగా పెరుగుతున్నాయి. ఇది పురుషులకు వచ్చే మూడో అత్యంత సాధారణ క్యాన్సర్. అలాగే మహిళలకు వచ్చే రెండో అత్యంత సాధారణ క్యాన్సర్ గా చెప్పవచ్చు. 

కడుపులో అనేక అవయవాలు ఉన్నాయి. దాని వ్యవస్థలు వివిధ మార్గాల్లో పనిచేస్తాయి. వాటిలో జీర్ణవ్యవస్థ  ఒకటి. పెద్దప్రేగు అనేది జీర్ణవ్యవస్థలో ఒక ప్రధాన భాగం. ఇది శరీరంలో చాలా ముఖ్యమైన విధులు నిర్వహిస్తుంది. ఆహారంలోని నీటిని, పొటాషియమ్ వంటి లవణాలను, కొవ్వులో కరిగే విటమిన్లను గ్రహించి శరీరానికి అందించడమే కాక శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపటంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. పెద్దప్రేగును వైద్యపరిభాషలో కోలాన్ అని అంటారు. అందులో వచ్చే క్యాన్సర్‌ను పెద్ద  ప్రేగు  (కోలన్) క్యాన్సర్ అని అంటారు. ఈ క్యాన్సర్ పెద్దపేగును ప్రభావితం చేస్తుంది. క్యాన్సర్ లేని కణం చిన్న గుంపుగా ప్రారంభమవుతుంది. ఇదే రానురాను క్యాన్సర్ గా మారుతుంది. సాధారణ నీళ్ల విరోచనాలు మొదలుకొని ప్రమాదకర క్యాన్సర్ల వరకు ఎన్నో సమస్యలు పెద్దప్రేగులో కనిపిస్తాయి.

పెద్దప్రేగు క్యాన్సర్ యొక్క లక్షణాలు

ప్రారంభ దశలో, పెద్దప్రేగు క్యాన్సర్ ఎటువంటి లక్షణాలను కలిగించకపోవచ్చు. అలాగే, పెద్దప్రేగు క్యాన్సర్ యొక్క లక్షణాలు క్యాన్సర్ పాలిప్స్ యొక్క స్థానం మరియు పరిమాణాన్ని బట్టి మారుతూ ఉంటాయి. పురుషులు మరియు స్త్రీలలో పెద్దప్రేగు క్యాన్సర్ యొక్క కొన్ని ముందస్తు హెచ్చరిక సంకేతాలు మరియు లక్షణాలు:

  • 4 వారాల కంటే ఎక్కువ కాలం పాటు మలబద్దకం లేదా విరోచనాలు కావడం
  • మల విసర్జన సమయంలో రక్తస్రావం
  • పురీషనాళం & మలంలో రక్తం పడడం
  • గ్యాస్ ఎక్కువగా పోతూ ఉండటం
  • అలసట మరియు నీరసం
  • రక్తహీనత 
  • మల విసర్జనకు వెళ్లినా ఇంకా మళ్లీ వెళ్లాలని అనిపించడం
  • కారణం లేకుండా బరువు తగ్గడం
  • మల విసర్జన తరువాత కూడా కడుపు ఖాళీ అయినట్లు అనిపించకపోవడం
  • పొత్తి కడుపులో అసౌకర్యంతో పాటూ గ్యాస్‌, తిమ్మిరి లేదా  నొప్పి కలగడం
  • పొట్ట కింది భాగంలో నొప్పి మరియు పొట్ట నిండుగా, ఉబ్బరంగా ఉండడం

అయితే, ఈ లక్షణాలన్ని ఉన్నంత మాత్రాన పెద్ద పేగు క్యాన్సర్ వచ్చినట్లు కాదు. ఒకవేళ ఈ లక్షణాలు మూడు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కొనసాగితేే, తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.

ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

పెద్దప్రేగు క్యాన్సర్ కు గల కారణాలు

Colorectal Blog Reasons

ఈ క్యాన్సర్‌కు అసలు కారణాలేంటన్నది ఎవరికీ తెలియదు. పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కొన్ని ముఖ్యమైన అంశాలు:

  • వయస్సు పై బడడం (50+)
  • అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు
  • సమయానికి తినకపోవడం
  • శారీరక శ్రమ లేకపోవడం
  • జీర్ణశయ వ్యాధులు (IBD & IBS)
  • అకస్మాతుగా బరువు పెరగడం లేదా దీర్ఘకాలిక ఊబకాయం
  • ధుమపానం మరియు అతిగా మద్యం తీసుకోవడం 
  • నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తినడం
  • పెయిన్‌ కిల్లర్స్‌ను పదే పదే వాడడం
  • వంశపార్యంపరంగా పలు రకాల క్యాన్సర్లు రావడం
  • కడుపులో క్యాన్సర్ పాలిప్స్ ఉండటం
  • రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ ఎక్కువగా తినడం
  • పొట్ట క్యాన్సర్ చికిత్సలో భాగంగా రేడియేషన్ చికిత్స పొందిన వ్యక్తులకు కూడా పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
  • కొన్ని సార్లు నోటిలో ఉండే ఫ్యూసోబాక్టీరియం, న్యూక్లియేటమ్ అనే బ్యాక్టీరియా  కూడా పెద్దప్రేగు క్యాన్సర్ కు కారణమవుతుంది.

పెద్దప్రేగు క్యాన్సర్ జన్యు పరివర్తన మరియు వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది కావున, గతంలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇలాంటి సమస్యలుంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించి కొలనోస్కోపీ వంటి నిర్ధారణ పరీక్షలు  చేయించుకోవాలి.

Colorectal Blog reasons

పెద్దప్రేగు క్యాన్సర్ యొక్క దశలు

ఇతర క్యాన్సర్ల మాదిరిగానే, పెద్దప్రేగు క్యాన్సర్ కూడా 4 దశల ద్వారా అభివృద్ధి చెందుతుంది. 

దశ 1 : క్యాన్సర్ పెద్దప్రేగు లేదా పురీషనాళం యొక్క ఉపరితల లైనింగ్ (శ్లేష్మం) లో పెరిగినప్పటికీ పెద్దప్రేగు వాల్ లేదా పురీషనాళం దాటి వ్యాపించదు.

దశ 2 : ఈ దశలో క్యాన్సర్ పెద్దప్రేగు లేదా పురీషనాళం యొక్క గోడలలో పెరిగినప్పటికి సమీపంలోని శోషరస కణుపులకు వ్యాపించదు.

దశ 3 : క్యాన్సర్ సమీపంలోని శోషరస కణుపులపై ప్రభావం చూపినప్పటికీ శరీరంలోని ఇతర భాగాలను ప్రభావితం చేయదు.

 దశ 4 : ఈ దశలో క్యాన్సర్ ఉన్న చోటు నుంచి శరీరంలోని మరో భాగానికి వ్యాపిస్తే దాన్ని మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటారు. పెద్దప్రేగు క్యాన్సర్ కాలేయం, ఊపిరితిత్తులు, ఉదరంలోని పెరిటోనియం లేదా స్త్రీ అండాశయాలు వంటి ఇతర సుదూర అవయవాలకు వ్యాపిస్తుంది.

మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

పెద్దప్రేగు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు

ఈ క్రింది పరీక్షల ఆధారంగా పెద్దప్రేగు క్యాన్సర్ ను నిర్ధారించడం జరుగుతుంది

పెద్దప్రేగు క్యాన్సర్ నిర్ధారణకు నిర్వహించే పరీక్షల్లో కోలోనోస్కోపీ & ఎండోస్కోపీ ప్రధానమైనది,

పెద్దప్రేగు మరియు పురీషనాళం లోపలి భాగాన్ని మరియు జీర్ణవ్యవస్థలోని ప్రధాన భాగాలను  పరిశీలించడానికి ఉపయోగించే వైద్య ప్రక్రియనే కొలనోస్కోపీ అంటారు. కొలనోస్కోపీ జరిపే సమయంలో పెద్దప్రేగు లోపలి భాగాలను చూడడానికి సాగే ట్యూబ్‌ చివరి అంచున లైట్ & కెమెరాతో కూడిన పొడవైన ట్యూబ్‌ని పాయువు నుంచి పురీషనాళం ద్వారా పెద్దప్రేగులోకి పంపిస్తారు. ఈ పక్రియలో పెద్దప్రేగు లోపలి భాగాలను ట్యూబ్‌కి ఉన్న కెమెరా అక్కడ చిత్రాలను తీసి మానిటర్‌కు పంపుతుంది.

ఎండోస్కోపీ పరీక్షలో కూడా కడుపులోని వివిధ సమస్యలను తెలుసుకోవడం కోసం ఉపయోగిస్తారు. ఎండోస్కోపీలో ఒక చిన్న మైక్రో కెమెరా కలిగిన ట్యూబ్‌ను కడుపు లోపలికి పంపించి అంతర్గత అవయవాల (అన్నవాహిక, జీర్ణకోశం, పెద్ద, చిన్న పేగులు, పైత్యరసవాహిక) పనితీరును తెలుసుకోవడం జరుగుతుంది. తద్వారా ఆ ట్యూబ్ కి ఉన్న కెమెరా కడుపులోపలి చిత్రాలను తీసి కంప్యూటర్‌కు పంపిస్తుంది. 

ఈ పరీక్షలతో పాటుగా (శారీరక పరీక్ష, డిజిటల్‌ మల పరీక్ష (DRE మరియు ఎక్స్-రే, CT స్కాన్, మల ఇమ్యునోకెమికల్ టెస్ట్ (FIT), స్టూల్ DNA పరీక్ష, ఫ్లెక్సిబుల్ సిగ్మోయిడోస్కోపీ, ఫీకల్‌ అకల్ట్‌ బ్లడ్‌ టెస్ట్ (FOBT), కార్సినో ఎంబ్రియోనిక్ యాంటిజెన్ (CEA), పాలిపెక్టమీ, CT కాలనోగ్రఫీ, డబుల్-కాంట్రాస్ట్ బేరియం ఎనిమా, బయాప్సి, సిగ్మాయిడోస్కోపీ లేదా ఎంట్రోస్కోపీ వంటి అనేక పరీక్షలను చేయించుకోమని వైద్యులు సిపార్సు చేయవచ్చు).

పెద్దప్రేగు క్యాన్సర్ యొక్క నివారణ చర్యలు

ఆరోగ్యకరమైన జీవన విధానాలను అనుసరించడం ద్వారా సగానికి పైగా పేగు క్యానర్లను తగ్గించుకోవచ్చు.

  • శరీరాన్ని ఎప్పుడు హైడ్రేట్ గా ఉంచడం కోసం తగినంత నీరు త్రాగడం
  • 50 ఏళ్లు దాటిన వారు కడుపు ఉబ్బరం, మల బద్ధకం, కడుపులో మంట, రక్తహీనత వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు.
  • పౌష్టికాహారం మరియు విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ కలిగి ఉన్న వివిధ రకాల పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవడం.
  • శారీరక శ్రమ లేదా ప్రతిరోజూ కనీసం 20 నిమిషాల పాటు వ్యాయామాలు చేయడం.
  • ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడం
  • ధూమపానం మరియు మధ్యపానం వంటి వాటిని వదిలివేయడం
  • ఎక్కువగా వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ ఉన్నవి తింటూ, కొవ్వు తక్కువ ఉండేవి తినాలి. రోజుకి ఆరు నుంచి ఎనిమిది గ్లాస్‌ల నీటిని తాగుతూ ఉండాలి.
  • క్రమం తప్పకుండా పెద్దప్రేగు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం 
  • రెడ్‌ మీట్ మరియు జంక్ ఫుడ్, వేపుళ్లు, మసాలాలు, నిలువ ఉంచిన, ఊరబెట్టిన ఆహార పదార్థ్ధాలను తినకపోవడం
  • అధిక చెక్కర కలిగి ఉన్న పదార్ధాలను తినకపోవడం
  • తరచూ కామెర్లు, రక్తహీనత వంటి సమస్యలు బారిన పడడం క్యాన్సర్‌ సంకేతం కావచ్చు కావున అప్రమత్తమై వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

పెద్దప్రేగు క్యాన్సర్ చికిత్స పద్దతులు

పెద్దప్రేగు క్యాన్సర్ చికిత్స అనేది క్యాన్సర్ యొక్క స్థానం, పరిమాణం మరియు దశ, పునరావృతం కాదా లేదా అనేదానితో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. 

పెద్దప్రేగు క్యాన్సర్‌కు చికిత్స రకం ఎక్కువగా క్యాన్సర్ దశపై ఆధారపడి ఉంటుంది. వివిధ చికిత్సా ఎంపికల గురించి మీ ఆంకాలజిస్ట్‌తో చర్చించండి.

సాధారణంగా, పెద్దప్రేగు క్యాన్సర్ కు మూడు ప్రాథమిక చికిత్స ఎంపికలు ఉన్నాయి: 

పెద్దప్రేగు క్యాన్సర్‌కు చేసే అత్యంత సాధారణ చికిత్సలో పాలీపెక్టమీ ప్రధానమైనది  ఈ సర్జరీ విధానం క్యాన్సర్‌ ఉన్న భాగాన్ని గుర్తించి దానిని తొలగించడం జరుగుతుంది.

పెద్దప్రేగు క్యాన్సర్ చికిత్సలో భాగంగా  క్యాన్సర్‌ను కలిగి ఉండే చిన్న కణజాలం (పాలీప్స్) లను తొలగించడానికి కోలోనోస్కోపీ పక్రియను తరచుగా నిర్వహిస్తారు.

లోకల్‌ ఎక్సిషన్: ఉదర గోడను కత్తిరించకుండా ప్రారంభ దశ క్యాన్సర్‌ను తొలగించడానికి వైద్యుడు కట్టింగ్ సాధనంతో ట్యూబ్‌ను ఉపయోగించవచ్చు.

పార్షియల్‌ కోలెక్టమీ: కోలెక్టమీ అనేది పెద్దప్రేగు క్యాన్సర్‌కు చికిత్స చేయడానికి ఉపయోగించే శస్త్రచికిత్సా ప్రక్రియ. శస్త్రచికిత్సలో పెద్దప్రేగు లేదా పెద్ద ప్రేగులలో కొంత భాగాన్ని తొలగించడం జరుగుతుంది. పార్షియల్ కోలెక్టమీని లాపరోస్కోపిక్ లేదా రోబోటిక్ విధానంతో నిర్వహించవచ్చు.

సాధారణంగా వైద్య చికిత్సలో భాగంగా వైద్యుడు క్యాన్సర్ మరియు దాని చుట్టూ ఉన్న కొన్ని ఆరోగ్యకరమైన కణజాలాన్ని తొలగించి, ఆ పై పెద్దప్రేగు యొక్క ఆరోగ్యకరమైన భాగాలను తిరిగి కలుపుతాడు.

కోలోస్టోమీతో పెద్దప్రేగు యొక్క విచ్ఛేదనం: సర్జన్ పెద్దప్రేగును తిరిగి జోడించలేని సందర్భాల్లో, వ్యర్థాలు బయటకు వెళ్లేందుకు పొత్తికడుపు గోడలో స్టోమాను ఉంచుతారు.

క్యాన్సర్ చికిత్స మరియు శస్త్రచికిత్సలో పురోగతితో, యశోద హాస్పిటల్స్ లాప్రోస్కోపీ మరియు మినిమల్లీ ఇన్వాసివ్ విధానాలు (తక్కువ కోతలు మరియు వేగంగా కోలుకోవడానికి వీలయ్యే సర్జరీ పక్రియలు), కోలెక్టమీ లేదా డైవర్టింగ్ కొలోస్టోమీని నిర్వహిస్తుంది కాబట్టి మీరు వేగంగా కోలుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.

మీరు కణితులు మరియు శోషరస కణుపులను తొలగించడానికి సర్జరీ చేయించుకున్నట్లయితే, క్యాన్సర్ యొక్క ఏదైనా అవశేషాలను తొలగించడానికి మీ శరీరానికి మద్దతు ఇవ్వడానికి మీకు సహాయక కీమోథెరపీ కూడా సిపార్సు చేయవచ్చు.

పెద్దప్రేగు క్యాన్సర్‌కు ఇతర చికిత్స ఎంపికలు:

రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (RFA): క్యాన్సర్‌ కణజాలాన్ని నాశనం చేయడానికి మరియు క్యాన్సర్ కణితులు, నాడ్యూల్స్ లేదా శరీరంలోని ఇతర పెరుగుదలల పరిమాణాన్ని తగ్గించే అతితక్కువ ఇన్వాసివ్ పక్రియ.

క్రయోసర్జరీ: క్రయోసర్జరీ, క్రయోథెరపీ అని కూడా పిలుస్తారు, ఇది అసాధారణమైన లేదా వ్యాధిగ్రస్తులైన క్యాన్సర్‌ కణజాలాలను  నాశనం చేయడానికి ఉపయోగించే వైద్య ప్రక్రియ

కీమోథెరపీ: కీమోథెరపీ అనేది క్యాన్సర్‌ను చంపడానికి రసాయనాలను ఉపయోగించే క్యాన్సర్ చికిత్స. కీమోథెరపీ ద్వారా, క్యాన్సర్ కణాల పునరుత్పత్తిని ఆపివేసి, వాటి పెరుగుదలను నిరోధిస్తారు. కీమోథెరపీని ఇంట్రావీనస్ (సిర ద్వారా) లేదా ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు.

ఇమ్యునోథెరపీ: ఇమ్యునోథెరపీ అనేది ఒక రకమైన క్యాన్సర్ చికిత్స, ఇది రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థ మన శరీరం అంటువ్యాధులు మరియు ఇతర వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

శస్త్రచికిత్స చేయలేని అభ్యర్థులకు మరియు క్యాన్సర్ వ్యాప్తిని నిరోధించడానికి ఎంబోలైజేషన్, హెపాటిక్ ఆర్టరీ ఇన్ఫ్యూషన్ వంటి ఇతర చికిత్స ఎంపికలు కూడా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణితి కాలేయానికి వ్యాపించినప్పుడు చేసే చికిత్స పద్దతులు.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262681 మాకు కాల్ చేయగలరు.

About Author –

Dr. Sachin Marda the Best Oncologist in Hyderabad

Dr. Sachin Marda

MS, DNB (Gen. Surgery) (Mumbai) Gold Medalist
MCh, DNB (Surgical Oncology) MRCS Ed (UK)
Clinical Fellow (NCCS, Singapore)
Clinical Director
Senior Oncologist and Robotic Surgeon

X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567