%1$s

రక్తసంబంధ వ్యాధుల రకాలు, లక్షణాలు, నిర్ధారణ పరీక్షలు మరియు చికిత్సా విధానాలు

Blood Disorders blog banner telugu

ప్రస్తుత కాలంలో పోషకాహార లోపంతో పాటు మారిన జీవనశైలి కారణంగా రక్తసంబంధ వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. మన శరీరం లో 4.5 నుంచి 5.5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. ఇది శరీర సాధారణ బరువులో 7 శాతంగా ఉంటుంది. రక్తాన్ని ద్రవరూప కణజాలం అని అంటారు. శరీరంలోని అన్ని అవయవాలకు ప్రాణవాయువుతో (O2) సహా అవసరమైన పోషకాలను రవాణా చేయటంలో రక్తం ప్రధాన పాత్ర వహిస్తుంది. రక్తంలోని హిమోగ్లోబిన్‌తో పాటు ఎరుపు, తెలుపు కణాలు నిర్ణీత స్థాయికి మించి పెరిగినా, తగిన వ్యాధులు బారిన పడే అవకాశాలు ఉంటాయి. సాదారణంగా గుండెకు వచ్చే అన్ని రకాల వ్యాధులు రక్తానికి మరియు రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి ఉంటాయి.

రక్తసంబంధ వ్యాధుల రకాలు & వాటి యొక్క లక్షణాలు

రక్తంలో ప్రధానంగా 3 భాగాలు కలవు, అవి:

1. ఎర్ర రక్త కణాలు (RBC): 

ఎర్ర రక్త కణాలు చాలా చిన్న డిస్క్ ఆకారపు కణాలు. ఊపిరితిత్తుల నుంచి కణజాలాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడం మరియు కణజాలాల నుంచి ఊపిరితిత్తులకు కార్బన్ డయాక్సైడ్‌ను రవాణా చేయడం వీటి ముఖ్యమైన పని. ప్రతి RBCలో 280 మిలియన్ల వరకు హిమోగ్లోబిన్ అణువులు ఉంటాయి.

రక్తంలోని ఎర్రరక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్‌ శాతం తగ్గడాన్ని రక్తహీనతగా పిలుస్తారు. కొన్నిసార్లు ఎర్ర రక్తకణాల సమస్యలు, వ్యాధులను కూడా రక్తహీనతగా పిలుస్తారు. 

వీటి యొక్క రకాలు: 

  • పోషకాహార రక్తహీనత (న్యూట్రిషనల్‌ ఎనీమియా): ఇది అతిసాధారణ రక్తహీనత వ్యాధి. ఆహారంలో ఇనుము లోపం వల్ల వస్తుంది. ఎర్ర రక్తకణాల్లో ఉండే హిమోగ్లోబిన్‌ ఏర్పడటానికి ఇనుము అవసరం. అందుకే ఈ వ్యాధిలో హిమోగ్లోబిన్‌ శాతం తగ్గుతుంది.
  • పెరినీషియస్‌ ఎనీమియా: ఇది విటమిన్‌- బి12 లోపం వల్ల కలుగుతుంది. ఈ వ్యాధిలో ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గిపోయి, శరీర అభివృద్ధికి అటంకం కలుగుతుంది. 
  • మాక్రోసైటిక్‌ ఎనీమియా: దీనినే మెగాలోబ్లాస్టిక్‌ ఎనీమియా అని అంటారు. ఈ వ్యాధిలో ఎర్ర రక్తకణాల జీవితకాలం తగ్గి, పరిమాణం పెరిగి విచ్ఛిన్నమవుతాయి. దీనివల్ల వాటి సంఖ్య తగ్గిపోతుంది. ఫోలిక్‌ ఆమ్లం లోపం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. 
  • సికిల్‌సెల్‌ ఎనీమియా: ఇది జన్యు సంబంధ అనువంశిక వ్యాధి. ఒకతరం నుంచి మరొక తరానికి సంక్రమించే అవకాశం ఉంది. ఈ వ్యాధిలో ఎర్ర రక్తకణాలు కొడవలి ఆకారంలో మారతాయి. దీనివల్ల రక్తనాళాల్లో ఎర్రరక్త కణాల గుచ్ఛం ఏర్పడి ప్రమాదకర పరిస్థితిగా మారవచ్చు.
  • తలసేమియా: త‌ల‌సేమియా అనేది వంశ‌పార‌ప‌ర్యంగా త‌ల్లి లేదా తండ్రి నుంచి పిల్లల‌కు సంక్రమించే జ‌న్యు పరమైన రక్త వ్యాధి. ఎర్ర రక్త కణాలలో ఉండే హిమోగ్లోబిన్ ను శరీరం తగినంతగా ఉత్పత్తి చేయనప్పుడు ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిగ్రస్థులకు తరచుగా రక్తం ఎక్కించాలి.
  • హీమోలైటిక్‌ ఎనీమియా: ఎర్ర రక్తకణాలు త్వరగా విచ్ఛిన్నమవ్వడంతో రక్తహీనత ఏర్పడుతుంది. ఈ పరిస్థితినే హీమోలైసిస్‌ అంటారు.
  • సెప్టిక్‌ ఎనీమియా: రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ పెరిగి విషపూరితంగా మారే పరిస్థితిని సెప్టిక్‌ ఎనీమియా అంటారు.
  • ఎప్లాస్టిక్‌ ఎనీమియా: ఈ వ్యాధిలో ఎముక మజ్జ ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేయదు. దాంతో రక్తంలో వాటి సంఖ్య తగ్గిపోతుంది.

సాధారణ ఎర్ర రక్త కణాల రుగ్మతల యొక్క లక్షణాలు

Symptoms of a white blood disorder

  • అలసట లేదా బలహీనత
  • చర్మం పసుపు రంగులోకి మారడం
  • మూర్ఛ లేదా మైకము
  • ఎక్కువగా దాహం వేయడం
  • చెమటలు పట్టడం
  • శ్వాస ఆడకపోవుట
  • దిగువ కాలు తిమ్మిరిగా ఉండడం
  • పల్స్ బలహీనంగా & వేగంగా ఉండడం 
  • గుండె సంబంధిత (అసాధారణ గుండె లయలు, గుండె వైఫల్యం) వంటి లక్షణాలు ఉంటాయి

2. తెల్ల రక్త కణాలు (WBC):

తెల్ల రక్త కణాలు న్యూట్రోఫిల్స్, మోనోసైట్లు, బాసోఫిల్స్, ఇసినోఫిల్స్ మరియు లింఫోసైట్లు అనే 5 రకాలుగా ఉంటాయి. అవి ఇన్ఫెక్షన్ మరియు ఇతర వ్యాధులతో పోరాడటానికి సహాయపడే శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థలో భాగంగా పనిచేస్తాయి. 

  • ల్యుకేమియా: దీన్నే బ్లడ్‌ క్యాన్సర్‌ అంటారు. ఈ వ్యాధిలో తెల్ల రక్తకణాల సంఖ్య పెరుగుతుంది.
  • ల్యూకోపీనియా: ఈ వ్యాధిలో తెల్లరక్త కణాల సంఖ్య తగ్గుతుంది. 
  • మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్: మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అనేది తెల్ల రక్త కణాల యొక్క రక్త రుగ్మతల రకాల్లో ఒకటి. ఈ సమస్య ఉన్న వారి శరీరం ఆరోగ్యకరమైన రక్త కణాలను తయారు చేయలేకపోతుంది. ఒక వేళ చేసినప్పటికీ ఎముక మజ్జ అపరిపక్వ (పూర్తిగా అబివృద్ధి చెందని) రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది.
  •  న్యూట్రోపెనియా: న్యూట్రోపెనియా అనేది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి తగినంత మొత్తంలో తెల్ల రక్త కణాలను సూచించే పరిస్థితి. మీ తెల్ల రక్త కణాల న్యూట్రోఫిల్స్ సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది.

వైట్ బ్లడ్ డిజార్డర్ యొక్క లక్షణాలు

Symptoms of a white blood disorder

  • గొంతు మంట
  • తుమ్ములు మరియు ముక్కు కారటం
  • జీర్ణ సమస్యలు
  • చర్మం ఎర్రబడడం
  • తరచుగా మూత్రవిసర్జన
  • చెమటలు పట్టడం
  • శ్వాస ఆడకపోవడం లేదా ఛాతీ నొప్పి
  • తరచుగా అంటువ్యాధుల బారిన పడడం

3. ప్లేట్‌లెట్స్:

ప్లేట్‌లెట్స్ అనేవి శరీరానికి గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతాయి. ఇవి అందరిలోనూ ఒకే విధంగా ఉండవు. సాధారణంగా ఒక వ్యక్తిలో 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్‌లెట్స్ ఉంటాయి. ప్లేట్‌లెట్స్ కణం 7-10 రోజుల వరకు బతికి ఉంటుంది. ఎముక మజ్జలో ఏర్పడిన కొత్త ప్లేట్‌లెట్స్ మళ్లీ రక్తంలో చేరుతాయి. రక్తాన్ని గడ్డ కట్టించి ప్రాణరక్షణ కలిగించడంలో ఈ ప్లేట్‌లెట్స్ అనేవి కీలక పాత్రను పోషిస్తాయి.

  • థ్రోంబోసైటోపెనియా: ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడం ద్వారా ఈ సమస్య వస్తుంది. 
  • థ్రోంబోసైటోసిస్: ఈ రకమైన బ్లడ్ డిజార్డర్‌లో, ప్లేట్‌లెట్స్ అధికంగా ఉత్పత్తి అవుతాయి, దీని ఫలితంగా అధిక రక్తస్రావం మరియు రక్తం గడ్డకట్టడం జరుగుతుంది.
  • ప్లేట్‌లెట్ డిస్‌ఫంక్షన్ : ప్లేట్‌లెట్ డిస్‌ఫంక్షన్ డిజార్డర్స్ అంటే రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య తగినంతగా ఉన్నప్పటికీ సరిగ్గా పని చేయని రక్త పరిస్థితులు.
  •  పై వాటితో పాటుగా  గుండె సంబంధ వ్యాధులైన (బ్రాడీకార్డియా, టకీకార్డియా (TAA), కార్డియో, రూమటాయిడ్‌ హార్ట్‌ డిసీజ్) వంటి పలు సమస్యలు కూడా రక్తకణాలకు సంబంధించిన కోవలోకి వస్తాయి.

రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు:

  • రక్తనాళాలైన ధమనులు, సిరల్లో అడ్డంకులు; రక్తనాళాలు సన్నగా కావడం లాంటి పరిస్థితులు సంభవించడం. వాటిలో:
  • అథిరోస్ల్కీరోసిస్‌: రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్‌ పేరుకుపోవడంతో అవి సన్నగా మారడం వల్ల వచ్చే వ్యాధి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళమైన కరోనరి ధమనుల్లో చెడు కొవ్వు పేరుకుపోయి కరోనరి ఆర్టరీ వ్యాధి వస్తుంది. దీనివల్ల గుండెకు రక్తం సరఫరా కాకపోవడంతో గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది.
  • ఆర్టీరియోస్ల్కీరోసిస్‌: ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల కలిగే స్థితినే ఆర్టీరియోస్ల్కీరోసిస్‌ అంటారు. ఈ వ్యాధిలో ధమనులు గట్టిపడి మందంగా తయారవుతాయి. దీనివల్ల అవయవాలకు తగినంత రక్తసరఫరా జరగదు. 
  • వెరికోస్‌ వీన్స్‌: సిరల్లో ఉండే కవాటాలు దెబ్బతినడం వల్ల కలిగే వ్యాధి.

రక్తసంబంధ వ్యాధులను గుర్తించడానికి చేసే నిర్థారణ పరీక్షలు

  • హీమోసైటోమీటర్‌: ఎర్రరక్తకణాల సంఖ్యను గుర్తించడానికి ఉపయోగించే పరికరం
  • హిమటోక్రిట్‌: (ప్యాక్డ్‌ సెల్‌వాల్యూం) రక్తంలో ఎర్రరక్త కణాల నిష్పత్తిని తెలిపే పరీక్ష
  • హీమోమీటర్‌: రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని తెలిపేందుకు ఉపయోగపడే పరికరం
  • యాంజియోగ్రామ్‌: రక్తనాళాల్లోని అడ్డంకులను గుర్తించేందుకు ఈ పరీక్షను చేస్తారు
  • కరోనరీ యాంజియోగ్రామ్‌: గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలైన కరోనరి ధమనుల్లో పేరుకుపోయిన కొవ్వును లేదా అడ్డంకులను తెలుసుకోవడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది
  • యాంజియోప్లాస్టి: ధమనుల్లో పేరుకుపోయిన అడ్డంకులను లేదా కొవ్వును తొలగించడం కోసం ఈ పరీక్ష చేస్తారు.
  • కరోనరి యాంజియోప్లాస్టీ: గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరి ధమనుల్లో అడ్డంకులను, కొవ్వును తొలగించడం

బ్లడ్‌ క్యాన్సర్ యొక్క రకాలు & వాటి వివరణ

రక్త క్యాన్సర్లు అనేవి ల్యుకేమియా, లింఫోమా, మైలోమా అనే 3 ప్రధాన  రకాలుగా ఉంటాయి. అయితే వీటితో పాటు మైలోమా, మైలో ప్రొలిఫరేటివ్‌ నియోప్లాస్మ్స్‌, మైలోడిస్‌ప్లాస్టిక్‌ సిండ్రోమ్‌ లాంటివి కూడా రక్త క్యాన్సర్లలో భాగమే..

ల్యుకేమియా తెల్లరక్తకణాలకు సోకుతుంది. తెల్లరక్తకణాల ప్రాథమిక విధి అయిన వ్యాధి కారక క్రిములతో పోరాటాన్ని అడ్డుకుంటుంది. ల్యుకేమియా సాధారణంగా 15 ఏండ్లలోపు పిల్లల్లో కనిపిస్తుంది. రక్త క్యాన్సర్లలో తెల్ల రక్తకణాలకు వచ్చే ల్యుకేమియా వాటా 20 శాతం ఉంటుంది. 

శోషరస వ్యవస్థకు వచ్చే క్యాన్సర్‌నే లింఫోమా అంటారు. రక్త క్యాన్సర్లలో 60-65 శాతం వరకూ  లింఫోమా క్యాన్సర్లే ఉంటాయి. ఇది శోషరస కణాల మీద ప్రభావం చూపుతుంది. ఇవి కూడా ఒక రకం రక్తకణాలనే చెప్పవచ్చు. ఈ క్యాన్సర్లు అన్ని వయసుల వారికీ రావొచ్చు. 

ప్లాస్మా కణాలపై ప్రభావం చూపే క్యాన్సర్‌ నే మైలోమా అంటారు. ప్లాస్మా కూడా తెల్ల రక్తకణాల్లో భాగమే, కాబట్టి ఇది కూడా శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. మైలోమా కారణంగా మనలో రోగ నిరోధక శక్తి క్షీణించి శరీరం తేలికగా ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదం ఉంది. ప్లాస్మాకు వచ్చే మైలోమా 5-10 శాతం వాటా కలిగి ఉంటుంది.

రక్తాన్ని గడ్డకట్టనీయకుండా చేసే పదార్థాలను (హెపారిన్‌, హిరుడిన్‌, హీమోలైసిన్‌, సోడియం సిట్రేట్, సోడియం ఆక్సలేట్, ఈథైల్‌ డై అమైన్‌ టెట్రా ఎసిటిక్‌ ఆమ్లం (EDTA)) లను రక్తస్కంధన నిరోధకాలు అంటారు.

ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం కంప్లీట్ బ్లడ్ కౌంట్ వంటి పరీక్షలు (మీ ఆరోగ్య పరిస్థితి & ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ప్లేట్ లెట్ల సంఖ్య తెలుసుకోవడం మరియు రక్తహీనత, ఇన్ఫెక్షన్,రక్తం గడ్డకట్టే సమస్య తెలియజేస్తుంది) చేయించుకోవాలి. అంతే  కాకుండా శరీరంలో నిరంతరం జరిగే రక్త పంపిణీ, గుండె, రక్తనాళాలను ప్రభావితం చేసే ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూ వాటికి తగు చికిత్సలు తీసుకున్నట్లు అయితే  ఈ రక్తసంబంధ వ్యాధుల బారిన పడకుండా  ఉండవచ్చు.

About Author –

Dr. K. Karuna Kumar is the Best Haematologist in Hyderabad

Dr. K. Karuna Kumar

MD, DNB Clinical Hematology
Consultant Hematologist, Hemato-Oncologist & Bone Marrow Transplant Physician

X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567