%1$s

నిటారుగా కూర్చోండి.. నడుమునొప్పికి బై చెప్పండి!

Back pain care in telugu

పొలం పనులు చేసుకునే రైతులు.., బరువులు మోసే కూలీలు.. ఇంతకుముందైతే నడుంనొప్పికి కేరాఫ్‌ అడ్రస్‌లు వీళ్లు. ఇప్పుడు మాత్రం నడుము నొప్పో, మెడనొప్పో కనిపించని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎక్కువ సేపు కూర్చుని ఉండడం, కూర్చునే భంగిమ లాంటివన్నీ ఈ సమస్యలకు ప్రధాన కారణాలు. ఎక్కువ మంది భుజాలు జార్చి కూర్చుంటుంటారు. కాని కూర్చున్నా, నిల్చున్నా వెన్ను నిటారుగా ఉంచాలి. ఎక్కువ సమయం కూర్చోవాల్సి వస్తే వెనకాల సపోర్టు ఉండాలి. గంటకోసారి లేచి, అటూ ఇటూ నడవాలి. లేకుంటే ఆపరేషన్‌ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. 

ఇటీవలి కాలంలో నడుమునొప్పి, వెన్నునొప్పి లాంటి వాటికి చిన్నా పెద్దా వయసు తేడా లేకుండా పోయింది. యువతలో జీవనశైలి కారణమైతే చిన్న పిల్లల్లో కూడా నడుము నొప్పి రావడానికి కారణం మాత్రం స్కూల్‌ బ్యాగులే. కొందరు పిల్లలకు పుట్టుకతోనే ఎముక సమస్యలు ఉండడం వల్ల కూడా ఈ నొప్పులు రావొచ్చు. సాధారనంగా స్పైన్‌ ఫ్యూజన్స్‌ ఏర్పడి ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇక వయసు పెరిగిన వాళ్లలో ముఖ్యంగా ఆడవాళ్లలో కాల్షియం తగ్గిపోయి ఆస్టియోపోరొసిస్‌ సమస్య వస్తుంది. దీనివల్ల ఎముకలు అరిగిపోతాయి. ఎముకలు అరిగిపోవడం వల్ల నడుము నొప్పి, కీళ్లనొప్పులు సర్వసాధారణం. మెనోపాజ్‌ దాటినవాళ్లలో ఈ నొప్పులు సాధారణంగా కనిపిస్తాయి. గుంతల రోడ్లు, ైస్టెల్‌గా ముందుకు వంగి నడపాల్సిన బండ్లు కూడా డిస్క్‌ సమస్యలను తెస్తున్నాయి.

Consult Our Experts Now

లక్షణాలు:

  • నడుమునొప్పి వస్తూ పోతూ ఉంటుంది. కూర్చున్నప్పుడు, పనిచేసేటప్పుడు నొప్పి లేస్తుంది. మొదటి దశలో ఇలా నొప్పి వచ్చిపోవడానికి కారణం నడుము కండరాలు బలహీనంగా ఉండడం. ఎముక, కండరాలపై బరువు సమానంగా పడాలి. లేకపోతే నొప్పి వస్తుంది. ఇలాంటప్పుడు మూడు నాలుగు రోజులు మందులు వాడి, వ్యాయామం చేస్తే తగ్గుతుంది. కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి. – కూర్చుని లేచేటప్పుడు, ఎక్కువ సేపు నడిచినప్పుడు, ఎక్కువ సేపు కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు నొప్పి ఉంటుంది. మొదట్లో నొప్పి వస్తూ తగ్గుతూ ఉంటుంది. ఆ తరువాత ఎప్పటికీ నొప్పి ఉంటూనే ఉంటుంది. నొప్పి తీవ్రత పెరుగుతుంది. దీన్ని కూడా నిర్లక్ష్యం చేస్తే సయాటికా నొప్పిగా మారుతుంది.
  • కండరం పట్టేయడం (మజిల్‌ స్పాజ్మ్‌) వల్ల నొప్పి తీవ్రంగా ఉంటుంది. కండరం పట్టేయడానికి రెండు కారణాలుంటాయి. నడుము కండరం సంకోచించి అలాగే ఉండిపోవడం ఒక కారణం. పడుకున్నప్పుడు ఇది కొంచె రిలాక్స్‌ అవుతుంది. అందువల్ల రెస్ట్‌లో నొప్పి తగ్గుతుంది. ఇలాంటప్పుడు ఏ పనిచేసినా, నిల్చున్నా, నడిచినా నొప్పే ఉంటుంది. పడుకుంటే మాత్రం తగ్గుతుంది. ఇప్పుడు కూడా మూడు నాలుగు రోజులు మందులు వాడి, ఫిజియోథెరపీ చేస్తే నొప్పి తగ్గిపోతుంది. ఇకపోతే డిస్క్‌ చిరిగిపోయి దాని నుంచి రసాయనాలు విడుదలవడం వల్ల కూడా మజిల్‌ స్పాజ్మ్‌ అవుతుంది. 
  • చివరగా నడుము నుంచి నొప్పి కాళ్లకు పాకుతుంది. దీన్ని Sayatika అంటారు. చినిగిన డిస్క్‌ పక్కనున్న కాలుకు వెళ్లే Sayatika నరంపై ఒత్తిడి కలిగిస్తుంది. అందుకే నడుములో మొదలైన నొప్పి కాలుకు పాకుతుంది. ఇందుకు మరో కారణం Radikyulaitis – రసాయనాలు నరం మూలాన్ని ఇరిటేట్‌ చేసి నొప్పి కలిగిస్తాయి. దాంతో ఇది కాలికి పాకుతుంది. Sayatika ఉన్నవాళ్లకు రెడ్‌ ఫ్లాగ్‌ సంకేతాలు కనిపిస్తే ఎంఆర్‌ఐ చేసి వెంటనే సర్జరీ చేయాల్సి ఉంటుంది. 

Back pain symptoms

రెడ్‌ ఫ్లాగ్‌ సంకేతాలు:

  • కాళ్లకు పట్టు ఉండదు. చెప్పులు వేసుకుంటే కూడా కాలి నుంచి జారిపోతాయి.
  • మూత్ర విసర్జన సమస్య – Inkantinens ఉంటుంది. 
  • మల విసర్జనపై పట్టు ఉండదు. 
  • డిస్క్‌లో ఇన్‌ఫెక్షన్‌ ఉంటే నడుము నొప్పితో పాటు తీవ్రమైన జ్వరం కూడా ఉంటుంది.

Consult Our Experts Now

సమస్యకు మూలాలివే..

  • ట్రామా: అకస్మాత్తుగా బైక్‌ మీద నుంచి కింద పడడం, మెట్లు ఎక్కుతూ, దిగుతూ కింద పడడం
  • వెన్నుపాములో ఇన్‌ఫెక్షన్లు: క్షయ, ఇతర బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు వెన్నుపాములో కణుతులు
  • Disk Degeneration: డిస్క్‌లోని కొల్లాజన్‌ తగ్గిపోవడం. వయసుతో పాటు కొల్లాజన్‌ తగ్గడం వల్ల గ్యాప్‌ తగ్గి, నరం మూలం ఇరిటేట్‌ అవుతుంది. 
  • Disk bulge: డిస్క్‌పై ఒత్తిడి వల్ల అది బయటికి వస్తూ, లోపలికి వెళ్తూ ఉంటుంది. నడుము కండరాలు బలహీనంగా ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. 
  • Disc protrusion: డిస్క్‌పై బరువు పడడం వల్ల డిస్క్‌ బయటికి వచ్చేస్తుంది. దీన్నే డిస్క్‌ ప్రొలాప్స్‌ అంటారు. 
  • Extruded disk: డిస్క్‌పై చిన్నగా టేర్‌ అవుతుంది. దాని నుంచి రసాయనాలు బయటకు వస్తాయి. 
  • Migrated disk: డిస్క్‌ మొత్తం వెళ్లి ఇంకోచోట ఉంటుంది.

Diagnosis:

శారీరక పరీక్షల్లో భాగంగా Straight Leg Rising టెస్ట్‌ చేస్తారు. కాలును పైకి లేపడం, ఇటూ అటూ కదిలించడం లాంటివి చేయించి పరీక్షిస్తారు. నరంపై ఒత్తిడి ఉంటే కాలును 30 డిగ్రీల కన్నా ఎక్కువ పైకి లేపలేరు. L5 నరం ప్రభావితం అయితే పాదాలను కదల్చలేరు. కాళ్ల కదలికలను బట్టి అంటే ఏ రకంగా కదల్చలేకపోతున్నారూ అనే దాన్ని బట్టి సమస్య ఏది, ఎక్కడుందనేది నిర్ధారిస్తారు. ఈ పరీక్ష వల్ల నొప్పికి కారణం కండరమా, నరమా, ఎముకా అనేది తెలుస్తుంది. అవసరాన్ని బట్టి ఎక్స్‌రే, ఇన్‌ఫెక్షన్‌ కోసం రక్తపరీక్ష, ఎంఆర్‌ఐ కూడా చేస్తారు. 

వీళ్లలో ఎక్కువ:

  • డ్రైవర్లు – ఎక్కువ దూరం డ్రైవ్‌ చేసినప్పుడు ఎక్కువసేపు కూర్చుని ఉంటారు కాబట్టి నడుము నొప్పి వస్తుంది.
  • కూలీపని చేసేవాళ్లు, బరువులు మోసేవాళ్లలో ఎక్కువ.
  • సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఎప్పుడూ కూర్చునే పనిచేయాలి కాబట్టి వీళ్లలో మెడనొప్పి ఎక్కువ. 
  • మెనోపాజ్‌ దశకు చేరిన మహిళలు

Consult Our Experts Now

సర్జరీ:

  • Open laminectomy – Open Dissectomy: వీటి ద్వారా ఎముకను కట్‌ చేసి దాని ద్వారా వెళ్లి డిస్క్‌ను తొలగిస్తారు. ఈ సంప్రదాయిక సర్జరీ ద్వారా ఎముక తీయకుండా డిస్క్‌ను తీయడం సాధ్యం కాదు. నడుము వెనుక నుంచి వెళ్లి ఈ సర్జరీ చేస్తారు.
  • Microscopic Discectomy:  ఓపెన్‌ సర్జరీ కన్నా చిన్న కోత (1 సెంటీమీటర్‌) పెట్టి మైక్రోస్కోప్‌లో చూస్తూ సర్జరీ నిర్వహిస్తారు. వీటి తర్వాత ఇప్పుడు ఎక్కువ కోత అవసరం లేని సర్జరీలు చేస్తున్నారు. 
  • Keyhole – Endoscopic Discectomy: నడుము పక్క వైపు నుంచి 1 సెం.మీ కన్నా చిన్న రంధ్రం పెడతారు. దీని నుంచి డైరెక్ట్‌గా డిస్క్‌ స్పేస్‌లోకి వెళ్తారు. మైక్రోస్కోప్‌లో చూస్తూ నరం మీద ఒత్తిడిని తీసేసి  నరాన్ని ఒత్తిడి నుంచి ఫ్రీ చేస్తారు.
  • Radio ablation: రేడియో ఫ్రీక్వెన్సీని పంపి డీజనరేట్‌ అయిన డిస్క్‌ను అబ్లేట్‌ చేస్తారు.
  • Fixation: కొన్నిసార్లు డిస్క్‌ డీజనరేషన్‌ వల్ల ఒక ఎముక ఇంకోదానిపై నుంచి కిందకి జారుతుంది (లిస్తెసిస్‌). ఈ సమస్యకు ఇంతకుముందు ఓపెన్‌ సర్జరీ చేసేవాళ్లు ఇప్పుడు మినిమల్లీ ఇన్వేసివ్‌ స్పైన్‌ సర్జరీ (ఎంఐఎస్‌ఎస్‌) ద్వారా జారిపోయిన దాన్ని సరిచేసి స్క్రూలతో ఫిక్స్‌ చేస్తున్నారు.

Read more about Back Pain symptoms, causes and treatment

If you find any of the above mentioned Symptoms of Back Pain then
Book an Appointment with the best spine surgeon in hyderabad

About Author –

Dr. K S Kiran

Dr. K S Kiran

MS, MCH (Neurosurgery)
Consultant Neurosurgeon
X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567