%1$s

కడుపు నొప్పి రకాలు, లక్షణాలు, చికిత్స పద్దతులు మరియు నివారణ చర్యలు

Abdominal pain types, symptoms, causes, treatment methods and preventive measures blog banner telugu

ప్రస్తుత జీవనశైలిలో మార్పులు కారణంగా చాలా మంది సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో కడుపు నొప్పి ప్రధానమైంది. సాధారణంగా ఛాతీకి, తొడ, గజ్జకు మధ్యలో భాగం లో వచ్చే నొప్పిని కడుపునొప్పి అంటారు. ముఖ్యంగా కడుపునొప్పి అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు వయస్సు, లింగం తేడా లేకుండా ప్రతి ఒక్కరిని బాధపెడుతుంటుంది. కడుపు నొప్పి సమస్యతో బాధపడే వారు ఏ పనుల మీద దృష్టి సారించలేక ఇబ్బంది పడుతుంటారు. నోటి నుంచి మొదలుకుని జీర్ణాశయం, కాలేయం, క్లోమం, చిన్నప్రేగులు, పెద్దప్రేగుల వరకూ విస్తరించిన జీర్ణకోశ వ్యవస్థ అన్నీ కడుపులోని భాగాలే. వీటిలో ఎక్కడ ఇబ్బంది తలెత్తిన కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.

కడుపు నొప్పి యొక్క రకాలు

కడుపు నొప్పి వచ్చే స్థానం ఆధారంగా ఎగువ, దిగువ, కుడి వైపు మరియు ఎడమ వైపు కడుపు నొప్పి అని నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు: 

  1. ఎగువ కడుపు నొప్పి: ముఖ్యంగా ఎగువ కడుపు నొప్పి కడుపు, ఛాతీ, మెడ మరియు భుజాల పై భాగంలో సంభవిస్తుంది. ఉబ్బరం, యాసిడ్ రిఫ్లక్స్, ఆకలి లేకపోవటం, వికారం, గుండెల్లో మంట వంటి లక్షణాల వల్ల కూడా ఈ రకమైన కడుపునొప్పి రావొచ్చు.
  2. దిగువ కడుపు నొప్పి: సాధారణంగా దిగువ కడుపు నొప్పి మూత్రవిసర్జనలో ఇబ్బంది, వెన్నునొప్పి , ఉబ్బరం, అతిసారం మొదలైన వివిధ లక్షణాలతో కడుపు క్రింది భాగంలోని ప్రాంతంలో వస్తుంది. 
  3. ఎడమ వైపు కడుపు నొప్పి : ఈ నొప్పి సాధారణంగా కిడ్నీలో రాళ్లు లేదా ఎడమ కిడ్నీలో ఇన్ఫెక్షన్ వంటి తీవ్రమైన పరిస్థితి కారణంగా వస్తుంది. పెద్దప్రేగులో ఇన్ఫెక్షన్లు కూడా ఎడమ వైపు కడుపు నొప్పి కారణం కావొచ్చు.
  4. కుడి-వైపు కడుపు నొప్పి : అపెండిసైటిస్ వంటి సమస్యలు మరియు ఉదర సంబంధ సమస్యలు కూడా కుడి-వైపు కడుపు నొప్పికి కారణమవుతాయి. 

 పైన పేర్కొన్న వాటితో పాటుగా కడుపు నొప్పి యొక్క తీవ్రత ఆధారంగా మూడు వర్గాలుగా  వర్గీకరించవచ్చు:

  1. స్వల్పమైన కడుపు నొప్పి (మైల్డ్ పెయిన్) : ఈ రకమైన కడుపు నొప్పి సాధారణంగా వచ్చి పోతుంటుంది. కాలక్రమేణా తీవ్రమవుతుంది మరియు సాధారణంగా ఇతర లక్షణాలతో వస్తుంది. 
  1. దీర్ఘకాలిక నొప్పి: దీర్ఘకాలిక కడుపు నొప్పి వారాలు, నెలలు లేదా సంవత్సరాల పాటు కొనసాగవచ్చు.
  2. తీవ్రమైన నొప్పి: తీవ్రమైన కడుపు నొప్పి జ్వరం మరియు అతిసారం వంటి ఇతర లక్షణాలతో కొన్ని గంటలు లేదా రోజుల పాటు ఉంటుంది. ఈ కడుపునొప్పి అనేది భరించలేని విధంగా ఉంటుంది. వీరికి తక్షణ వైద్య సహాయం అవసరం కావొచ్చు.

కడుపు నొప్పి యొక్క లక్షణాలు

Abdominal pain symptoms

కడుపు నొప్పి యొక్క సాధారణ లక్షణాలు:

  • కడుపులో నొప్పి & మంట 
  • కడుపు ఉబ్బరం 
  • వికారం లేదా వాంతులు
  • జ్వరం
  • బరువు తగ్గిపోవడం
  • అతిసారం
  • మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది
  • చర్మం పసుపు రంగులోకి మారడం

ముఖ్యంగా మహిళల్లో ఋతుక్రమం కాని సమయంలో కూడా, యోని నుంచి రక్తస్రావం కావడం, రక్త వాంతులు, క్రమం తప్పిన ఋతుచక్రం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.

ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

కడుపు నొప్పికి గల కారణాలు

కడుపు నొప్పి రావడానికి తీసుకునే ఆహారంతో పాటు అనేక రకాల కారణాలు ఉంటాయి.

ఫుడ్ పాయిజనింగ్: సరిగా ఉడకని లేదా చెడిపోయిన ఆహారం, అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నిల్వ చేసిన ఆహారం వంటివి తినడం మరియు కలుషితమైన నీటిని తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. 

కొన్ని ఆహారాలకు దూరంగా ఉండడం: కడుపునొప్పిని ప్రేరేపించే కారంగా ఉండే ఆహారాలు, జంక్ పుడ్స్, ఫాస్ట్ పుడ్స్,కాఫీ మరియు మద్యం వంటి వాటిని అధికంగా తీసుకోవడం వల్ల కడుపు లైనింగ్‌ దెబ్బతిని కడుపు నొప్పి వస్తుంది.  

అతిగా తినడం: ఆహారాన్ని అతిగా తినడం వల్ల కడుపు దాని సహజ సామర్థ్యానికి మించి సాగుతుంది, దీని వల్ల కడుపులో ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు అసౌకర్యాన్ని కలిగించడంతో కడుపు నొప్పి వస్తుంది .

మలబద్ధకం: పేగులో ఎక్కువ వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు, పేగులపై ఒత్తిడి పెరిగి కడుపు నొప్పి రావొచ్చు. 

యాసిడ్ రిఫ్లక్స్: కడుపులో యాసిడ్ తక్కువగా ఉండడం, మెగ్నీషియం తగినంత లేకపోవడం, వేగంగా ఆహారం తీసుకోవడం వల్ల కూడా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.

మూత్ర సంబంధ సమస్యలు: కిడ్నీ స్టోన్స్, బ్లాడర్ ఇన్ఫెక్షన్లు మరియు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ (UTIs) లు పొత్తికడుపు నొప్పికి కారణమవుతాయి

ఇన్ఫెక్షన్లు: గ్యాస్ట్రోఎంటెరిటిస్, ఫుడ్ పాయిజనింగ్, అపెండిసైటిస్ మరియు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ (PID) వంటి సమస్యలు కూడా కడుపు నొప్పికి కారణమవుతాయి.

పునరుత్పత్తి సమస్యలు: అండాశయ తిత్తులు, ఎండోమెట్రియోసిస్ లేదా వంటి పునరుత్పత్తి అవయవాలను ప్రభావితం చేసే పరిస్థితుల వల్ల కూడా మహిళల్లో కడుపు నొప్పి రావొచ్చు.

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అపెండిక్స్ వాపు, క్లోమగ్రంధి వాపు, హెర్నియా, పెగుల్లో అడ్డంకి,  కీటో అసిడోస్, కామెర్లు, కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు కూడా కడుపు నొప్పికి కారణమవుతాయి.

కడుపు నొప్పి యొక్క నివారణ చర్యలు

కడుపు నొప్పి సమస్య నివారణకు తప్పనిసరిగా ఆహారంలో మార్పులు చేసుకోవడంతో పాటుగా సరైన జీవనశైలిని అనుసరించడం చాలా అవసరం

  • డీహైడ్రేషన్‌ను నివారించడానికి పుష్కలంగా నీరు త్రాగాలి
  • కలుషితమైన ఆహారాన్ని మరియు నీటిని తీసుకోకూడదు
  • క్రమం తప్పకుండా ఆహార వేళలను పాటించాలి
  • ప్రాసెస్‌ చేసిన, కొవ్వుతో కూడిన పదార్థాలను పరిమితంగా తీసుకోవడం మంచిది.
  • తక్కువ భోజనం చేయడం మరియు స్పైసీ, జంక్ ఫుడ్‌, ఆయిల్ పుడ్స్ ను నివారించడం
  • ఆకుకూరలు, కూరగాయలు మరియు పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న బొప్పాయి, ఆపిల్, దానిమ్మ, అరటి, పియర్ వంటి పండ్లను తీసుకోవడం
  • దాలియా, రెడ్ రైస్, పోహా, రాజ్‌గిరా, పప్పులు వంటి హోల్ గ్రెయిన్స్ వంటివి కూడా కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో తోడ్పడతాయి
  • ఆహారాన్ని బాగా నమిలి మింగాలి (ఆహారం బాగా జీర్ణం అయి జీర్ణ వ్యవస్థపై భారం తగ్గుతుంది) 
  • కూల్‌డ్రింకులు, సోడాలను తాగడం, బబుల్‌గమ్‌లు నమలడం కడుపు ఉబ్బరానికి దారితీస్తాయి కావున వాటికి దూరంగా ఉండాలి
  • మద్యపానం మరియు ధూమపానం అలవాట్లను మానుకోవడం ఉత్తమం
  • నిద్రలేమి, ఆందోళన, భయం, ఉద్వేగం వంటి మానసిక సమస్యలను తగ్గించుకోవాలి
  • శరీరానికి తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా కూడా కడుపుకు కలిగే అసౌకర్యం నుంచి బయటపడవచ్చు.
మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

కడుపు నొప్పి యొక్క నిర్థారణ పరీక్షలు

కడుపు నొప్పి ఎలా మొదలవుతుంది, ఎంతసేపు ఉంటుంది, తిరిగి కడుపునొప్పి ఎప్పుడొస్తుంది, కడుపులో సరిగ్గా ఏ ప్రదేశంలో వస్తుందనే విషయాలను డాక్టర్ అడిగి తెలుసుకోని ఈ క్రింది పరీక్షలు చేసి  నిర్థారించడం జరుగుతుంది.

  • సిబిసి ( కంప్లీట్‌ బ్లడ్‌ కౌంట్)
  • H B (హెమోగ్లోబిన్‌) అంచనా
  • కాలేయ పనితీరు పరీక్షలు (LFT)
  • మూత్ర పరీక్షలు
  • ఛాతీ మరియు కడుపు X-Ray
  • ఉదర అల్ట్రాసౌండ్‌ పరీక్ష (CT, MRI)
  • ఇంట్రవీనస్‌ పైలోగ్రామ్‌ (కిడ్నీ సంబంధ పరీక్ష)
  • లాపరోస్కోపీ పరీక్ష మరియు ఎండోస్కోప్‌ పరీక్షలు

తేలికపాటి కడుపు నొప్పి అయితే సాధారణంగా ఒకటి లేదా రెండు రోజులకు తర్వాత దానంతట అదే పోతుంది. అలా కాకుండా దీర్ఘకాలంగా కడుపు నొప్పితో బాధపడుతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించి సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే ఈ కడుపు నొప్పి సమస్య తీవ్రతరం కాకుండానే నివారించుకునేందుకు వీలు ఉంటుంది.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262676 మాకు కాల్ చేయగలరు.

About Author –

Dr. Kiran Peddi,Senior Consultant Medical Gastroenterologist, Yashoda Hospitals - Hyderabad
MRCP (UK), FRCP (Lon), CCT Gastro (UK), Fellowship in Advanced Endoscopy and IBD (Aus)

Best Consultant Medical Gastroenterologist

Dr. Kiran Peddi

MRCP (UK), FRCP (Lon), CCT Gastro (UK), Fellowship in Advanced Endoscopy and IBD (Aus)
Senior Consultant Medical Gastroenterologist and IBD Specialist

X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567