యశోదమ్మ స్మృతిలో
మాతృమూర్తి కీ.శే. గోరుకంటి యశోదా దేవి జ్ఞాపకాలు ప్రతి ఒక్క మహిళకు స్ఫూర్తిదాయకం. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తల్లిగా, పిల్లలకు తన ప్రేమవాత్సల్యాలను పంచిపెట్టడమే కాకుండా బాధ్యులైన పౌరులుగా వారిని తీర్చిదిద్దడంలోనూ, సామాజిక బాధ్యతను వారు గుర్తెరిగి తమ వంతు సేవ చేయడంలోనూ వారికి దిశానిర్దేశం చేసిన ఆమె చిరస్మరణీయ మాతృమూర్తిగా నిలిచిపోతారు.
తెలుగు రాష్ట్రాలలో అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ హాస్పిటల్స్ గ్రూప్ అయిన యశోద హాస్పిటల్స్ స్థాపనకు ప్రేరణగా నిలిచిన మాతృమూర్తి కీర్తిశేషులు గోరుకంటి యశోదా దేవి అమ్మదనానికే ఆదర్శం. కన్నబిడ్డలు తల్లి మీద అభిమానం, ప్రేమ, గౌరవంతో ఆమె పేరు మీద స్థాపించినదే యశోద హాస్పిటల్స్. గోరుకంటి యశోదా దేవి పేరులోనే కాదు, పలకరింపు, మాటలలో కూడా ఆప్యాయత, అభిమానం, ప్రేమ తొణికిసలాడేవి. ఆ అత్యుత్తమ మాతృమూర్తి జీవితం నేటి మహిళలకు ఒక ఆదర్శం. మార్గదర్శనం, ఆచరణీయం.
మాతృమూర్తే స్పూర్తి
ఈరోజు యశోద హాస్పిటల్స్ 2500కు పైగా పడకలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అత్యున్నత వైద్య సంస్థగా రూపుదిద్దుకోవడానికి స్పూర్తి ప్రదాత యశోదమ్మే. ఆమె కని, పెంచి, తీర్పిదిద్దిన ఆమె కుమారుల క్రమశిక్షణ, అంకితభావం, కార్యదక్షత కారణంగా ఈరోజు ప్రైవేట్ వైద్య రంగంలోనే యశోద హాస్పిటల్స్ గ్రూప్ ఒక అత్యున్నత సంస్థగా, భారతదేశంలోనే అత్యుత్తమ హాప్పిటల్స్ గ్రూప్స్ లో ఒకటిగా నిలివింది. ఇదంతా ఆవిడ చలవే… ఆవిడ ఆశీస్సులే… యశోదమ్మ పేరు బలమే…
కన్న బిడ్డలకు మార్గనిర్దేశకత్వం
ఒక సామాన్య, మధ్య తరగతి కుటుంబీకులు అయినప్పటికీ పిల్లలు బాగా చదువుకోవాలన్నదే యశోదమ్మ కల. అదే ఆవిడ జీవిత లక్షం. కేవలం పిల్లల చదువుల కోసమే ఆమె జీవితంలో కష్టపడి మార్గదర్శనం చేసి, చదివించి, వారిని ఇంత ప్రయోజకులను చేశారు. పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోనవకుండా, క్రమశిక్షణతో పెంచి వారికి మార్గనిర్దేశం చేశారు. ఈ రోజు యశోద హాస్పిటల్స్లో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పదిహేను వేల కుటుంబాలకు పైగానే ఉపాధి పొందుతున్నాయి. దీనికి మార్గదర్శకత్వం కచ్చితంగా యశోదమ్మదే.
ఒక సామాన్య మహిళ తన జీవితకాలంలో, సహధర్మచారిణిగా, తల్లిగా, కుటుంబానికి పెద్ద దిక్కుగా, సంకల్పంతోనూ, శ్రమించే తత్వంతోనూ, అంకితభావంతోనూ, క్రమశిక్షణతోనూ, ఓర్పు, ధైర్యం, పట్టుదలతోనూ, సామర్ద్యం…అన్నింటికి మించి స్వయంకృషే ఆలంబనగా ఒక అత్యున్నత వైద్య సంస్థకు ప్రేరణగా నిలిచిన ఒక మాతృమూర్తిగా యశోదమ్మ ఎప్పటికీ నిలిచిపో తారు. ఎందరికో ఆదర్శమూర్తి అయిన ఆమె జీవితం ఈతరం తల్లులందరికీ ఒక జీవితపాఠం అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Newspaper Credit: Telangana Today
News Coverage:
- Mana Telangana: https://www.manatelangana.news/story-about-yashoda-hospital-history/
- Surya: https://www.suryaa.co.in/2020/12/10/in-the-memory-of-yashodamma/
- Namasthe Telangana: https://www.ntnews.com/zindagi/2020-12-10-109161
<< Previous Article
Yashoda Hospitals Launches awareness program on 'Brain Stroke'Next Article >>
Successful Dry Run of Covid-19 Vaccine at Yashoda Hospitals