%1$s

ప్రపంచ ఆస్టియోఫోరోసిస్ డే సందర్భంగా సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాకథాన్ విజయవంతం

ప్రతి సంవత్సరం అక్టోబర్ 20న జరుపుకునే ప్రపంచ ఆస్టియోఫోరోసిస్ డే సందర్భంగా ఈరోజు సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా వద్ద వాకథాన్ నిర్వహించడం జరిగింది. ఈ వాకథాన్ ను యశోద హాస్పిటల్స్, డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాకథాన్ లో 100మందికిపైగా జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు చేసుకున్న పేషెంట్ల్లు, 1000 మందికి పైగా డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొని వాకథాన్ ను విజయవంతం చేసారు.

ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్, డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. కీళ్లనొప్పులు ఉంటే నడవకూడదనే అపోహను తొలగించేందుకె ఈ అవగాహన కార్యక్రమం (వాకథాన్) ను నిర్వహిస్తున్న మన్నారు. ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, మస్క్యులోస్కెలెటల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించడం కోసమే ఈ మెగా వాకథా‌న్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

యశోద హాస్పిటల్స్, సీనియర్ ఆర్థోపెడిక్‌ సర్జన్,‌ డాక్టర్.‌ సునీల్‌ దాచేపల్లి, మాట్లాడుతూ… కీళ్లను ప్రభావితం చేసే ఆర్థరైటిస్ ‌వ్యాధిపై  అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. ఆర్థరైటిస్ ముదిరి, సర్జరీ వరకు రాకుండా మోకాళ్ళకు తీసుకోవలసిన జాగ్రత్తలు, బోన్ సాంద్రత పెంచి ఆస్టియోఫోరోసిస్ వరకు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దారితీసే పరిస్థితులపై అవగాహన చాలా అవసరం.సర్జరీలపై ఉన్న మెజారిటి పేషెంట్ల అపోహలు, సందేహాలను తీర్చడం మా వాకథాన్ యెక్క ముఖ్య ఉద్దేశమని డాక్టర్.‌ సునీల్‌ దాచేపల్లి తెలియజేసారు.