ప్రతీయేటా అక్టోబర్ 20న ప్రపంచ ఆస్టియోపోరోసిస్ దినోత్సవంగా జరుపుకుంటాము. మోనోపాజ్ తరువాత మహిళలను ఇబ్బంది పెట్టే సమస్యలలో ఆస్టియోపోరోసిస్ (బోలు ఎముకల వ్యాధి) కూడా ఒకటి. దీనిలో ఎముక సాంద్రత తగ్గి, పటుత్వం కోల్పోయి అవి గుల్లబారతాయి. ఎముక గుల్లబారటం చాలా నెమ్మదిగా జరగటం వలన చాలా మందిలో ఎముకలు విరిగేంతవరకు ఎలాంటి లక్షణాలు కనబడవు. 2015లో WHO సర్వే ప్రకారం యాభై పైబడినవారిలో మన దేశంలో ప్రతీ ముగ్గురు స్త్రీలలో ఒకరు. ప్రతీ ఎనిమిది మంది మగవారిలో ఒకరు ఆస్టియోపోరోసిస్తో బాధపడుతున్నారు. సుమారుగా 2015 నాటికి 5 కోట్ల మంది ఈ వ్యాధికి లోనైయ్యారు. జీవనశైలిలో మార్పులు, పౌషకాహారం తీసుకోవడం, సరియైన వ్యాయామం చేయడం మరియు వ్యాధిని తొలిదశలో గుర్తించడం వలన ఆస్టియోపోరోసిస్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
సాధారణంగా ఎముక నిర్మాణం మరియు ఎదుగుదలలో భాగంగా ఎముకలోని పాతకణాలు పోయి కొత్తకణాలు చేరతాయి. దీన్ని ఎముక రిమాడలింగ్ (Bone Remodelling) అంటారు. ఈ ప్రక్రియ చిన్నతనంలో మొదలై కౌమారదశ వరకు అతివేగంగా ఉండి సుమారుగా 30 ఏళ్లకు పూర్తి స్థాయికి చేరుతుంది. ఈ దశలో కొత్తకణాలు ఎక్కువగా ఉండి ఎముక దృఢంగా ఉంటుంది. ఈ దశను Peak Bone Mass అంటారు. దీని తర్వాత క్రమేణా కొత్త కణాలు చేరడం తగ్గుతుంది. తద్వారా 50 యేళ్ళు వచ్చేసరికి ఎముక సాంద్రత తగ్గి గుల్లబారుతుంది.
ఆస్టియోపోరోసిస్ అనేది ప్రధానంగా రెండు రకాలు-ప్రైమరీ మరియు సెకండరీ.. పైన చెప్పిన విధంగా మోనోపాజ్ తర్వాత మరియు 65 ఆపైన ఎముక క్రమంగా సాంద్రత తగ్గడం వల్ల వచ్చే ఆస్టియోపోరోసిస్ ను ప్రైమరీ అంటారు. ఇస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ లాంటి కొన్ని హార్మోన్లు, కాల్షియం, విటమిన్ డి లాంటి పోషకాలు ఈ ఎముక రిమాడలింగ్ను కొంత వరకు ప్రభావితం చేస్తాయి.
ఎముక రిమాండలింగ్ ప్రక్రియను నిరోధించే కారకాల వలన 50 యేళ్ళ లోపే ఆస్టియోపోరోసిస్ రావచ్చు. దీర్ఘకాలిక కిడ్నీ మరియు లివర్ సమస్యలు, కొన్ని రకాల జీర్ణకోశ వ్యాధులు, రుమటాయిడ్ వ్యాధులు, థైరాయిడ్ మరియు డయాబెటిస్ కొన్ని కారణాలు .ఇవే కాకుండా జన్యుపరమైన కారణాలు, స్టెరాయిడ్స్, ఫిట్స్ మందులు, హెపారిన్ మందులు చాలా రోజులు వాడటం, అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం, పొగత్రాగడం, శారీరక శ్రమ లేకపోవడం, అతి తక్కువ బరువు, కాల్షియం, విటమిన్ డి లోపం వలన కూడా ఆస్టియోపోరోసిన్ రావచ్చు.
ఆస్టియోపోరోసిస్ ను Silent Disease అంటారు. చాలా మందికి ఎముకలు విరిగేంతవరకు ఎలాంటి లక్షణాలు కనపడవు. నెమ్మదిగా నడుము వంగిపోవడం, వెన్నునొప్పి, ఎత్తుతగ్గడం, అలసట.. లాంటివి కొంత మందిలో కనిపిస్తాయి. అన్ని ఎముకలు దీనితో ప్రభావితం చేయబడినా, వెన్నుపూస, తుంటి మరియు ముంచేతి ఎముకలకు ఇది ఎక్కువగా వస్తుంది.
ఎక్స్ రే (X-Ray) / CT స్కాన్లతో ఫ్రాక్చర్స్ కనుక్కొవడం జరుగుతుంది. బిఎండి (BMD-Bone Mineral Density) పరీక్ష / Dexa Scanతో ఎముక సాంద్రతను పరీక్ష చేస్తారు. దీంట్లో T. Score అనే విలువ -2.5 లేదా అంతకన్నా తక్కువ ఉంటే ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ అయినట్లే. వెన్నుపూస, తుంటి భాగంలో ఈ పరీక్ష చేస్తారు.
బిఎండి పరీక్ష ఫలితాలు మరియు మీకు ఉన్న అనుబంధిత (Secondary) కారణాలను దృష్టిలో పెట్టుకొని మీరు మాత్రలు వాడాలా లేదా అన్నది వైద్యులు నిర్ధారిస్తారు.
బిస్ఫోస్పోనేట్స్ (Bisphosphonates), టేరీపరటైడ్ (Teriparatide), కాల్సిటోనిన్ (Calcitonin), డెనోసోముబాబ్ (Denosumab) మరియు కొన్ని రకాల హార్మోన్ మందులు ఆస్టియోపోరోసిస్కి వాడుతారు. దీనితో పాటు కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది.
మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వకపోవడాన్ని అజీర్తి అంటాం, ఇది చిన్న సమస్యలాగా అనిపించవచ్చు, కానీ అజీర్తి వలన జీవనశైలి…
యూరిక్ యాసిడ్ అనేది మన శరీరం ప్యూరిన్‌లను (కొన్ని ఆహారాలు మరియు శరీర కణజాలాలలో లభించే పదార్థాలను) విభజన చేయడం…
మానవుని జీర్ణవ్యవస్థలో నోటి నుండి తీసుకున్న ఆహారం అన్నవాహిక ద్వారా జీర్ణాశయం/ కడుపు లోకి చేరుతుంది. అన్నవాహిక చివరిలో ఒక…
మానవ శరీరంలో హార్మోన్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రోజువారీ జీవితంలో శరీరానికి అవసరమైన చర్యలు అంటే ఆకలి, నిద్ర,…
ఒకప్పుడు ప్రధాన రక్తనాళాల సంబంధిత సమస్యలకు బహిరంగ శస్త్రచికిత్స అనేది తరుచుగా సూచించబడేది, కానీ నేడు ఈ సమస్యలను సులువుగా…
టైఫాయిడ్ అంటే సాల్మొనెల్లా టైఫీ అనే బాక్టీరియా వలన కలిగే వ్యాధి, ఈ వ్యాధి సాధారణంగా రెండు నుండి మూడు…