ఈ మధ్య కాలంలో హైపర్‌టెన్షన్ బారినపడే వారి నంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చాలా మందికీ ప్రారంభంలో తమకు హైపర్‌టెన్షన్ ఉందనే భావన కూడా ఉండడం లేదు. తీవ్ర స్థాయికీ చేరుకుంటే కానీ వైద్యుడి వద్దకు పరుగులు తీయడం లేదు. తలనొప్పి, జ్వరం, దగ్గు శరీరపు నొప్పులతో వచ్చే వారికి పరీక్షలు చేస్తే హైపర్ టెన్షన్ బయట వడుతుందని, అప్పటి వరకు వారికి తమకు ఫలాన ఇబ్బంది ఉందనే భావన వారికి తెలియడం లేదని కార్డియాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. నూటికి 80 శాతం మందికీ హైవర్‌టెన్షన్ ఉందని తెలియడం లేదంటున్నారు. ముఖ్యంగా మధుమేహం, పక్షవాతం మరియు కిడ్నీ ఫెయిల్యూర్, థైరాయిడ్, ఆర్థో సమస్యలు ఉన్నవారు హైపర్‌టెన్షన్‌తో ఎక్కువగా బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు.
కొందరు ఏ కారణం లేకుండానే హైపర్‌టెన్షన్ బారిప వడుతున్నారు. దీని బారిన పడిన వారికీ చాల మందికి కారణాలే తెలియడం లేదు. కొందరిలో రెండు పదులు దాటితే… వంశపారం పర్యంగా హైపర్‌టెన్షన్ వచ్చే అవకాశముంది. కొందరికి 18 ఏళ్ల వయస్సులోనే హైపర్‌టెన్షన్ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. పరీక్షలు వేస్తేగానీ బీపీ ఉందనేది నిర్దారణ కాదు. యువతలో ఈ నమన్య ఎక్కువగా కనిపిస్తోంది. 20నుంచి 30 ఏళ్ల వయస్సు వారిలో 5 శాతం, 30 నుంచి 40ఏళ్ల వారిలో 10 శాతం, 40 నుంచి 50 ఏళ్ల వయస్సు వారిలో 5 శాతం, 50 నుంచి 60 ఏళ్ల వారిలో 15 శాతం మంది హైపెర్టెన్షన్ తో ఇబ్బంది పడుతున్నారు.. ప్రతి ముగ్గురు బాధితుల్లో ఒక యువతికి ఉండవచ్చని వ్యాధులు పరిగణిస్తున్నారు.
ఉదయం ఇంటి నుంచి బయలుదేరితే ఏ ఆర్థరాత్రికే వస్తున్నారు. దీంతో భోజనం చేయాలనే ఆలోచనే ఉండడం లేదు. ఎక్కడ పడితే ఆక్కడ, ఏదీ పడితే అది తినేస్తున్నారు. ఇందులో ఉప్పు ఉన్న ఆహార పదార్ధాలే ఎక్కువ ఉంటున్నాయి. ప్రానెస్ ఫుడ్, పీజ్జాలు, బర్గర్‌లు, రెడీమేడ్ మాంసం, కూల్‌డ్రింక్‌లు, ప్రిజ్‌లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిలో 20 శాతం ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఆల్కాహాల్ 1.2 ఎంఎల్‌కు మించితే బీపీ పెరిగే అవకాశాలూ ఉన్నాయి. దాదాపు 15 శాతం ట్రాఫిక్ టెన్షన్‌తో జనం హైవర్‌టెన్షన్‌కు గురువుతున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు. ట్రాఫిక్‌లో ఎక్కువగా తిరిగే వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మార్కెట్ ఫీల్డ్, మెడికల్ రిప్రజెంటేటివ్స్, సేల్స్‌మెన్, డైవర్సు ఇలా తదితర వర్గాల్లో హైవర్‌టెన్షన్‌కు గురవుతున్నఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.
హైవడ్‌టెన్షన్‌తో దాదాపు 10 శాతానికి మించి గుండె జబ్బుకు గురువతున్నట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. హైపర్‌టెన్షన్‌తో ఉన్నవారిలో పది శాతం మంది పక్షవాతం బారిన పడగా… మరో అయిదు శాతం కిడ్నీసమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ టెన్షన్ వల్ల కొందరికీ బైయిన్ స్టోక్ కూడా వచ్చే ప్రమాదముంది. ఇటీవల కాలంలో బ్రెయిన్ స్టోక్ గుండె సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. హైపర్‌టెన్షన్ ఉన్నవారికీ కిడ్నీ రక్తనాళంలో అడ్డంకులు ఏర్పడుతాయి. దీని వల్ల కిడ్నీ దెబ్బతిని పని వేయకుండా పోయే ప్రమాదముంది. ఆదేవిధంగా రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడడం వల్ల గుండె, బ్రెయిన్ స్ట్రోక్‌లు వస్తున్నాయి.
నిద్రపోయే సమయంలో బీపీ ఉంటే ఆది ప్రాణానికి ముప్పుగా మారుతుంది. చాలా మందికీ ఉదయం ఉండేస్థాయిలో పడుకున్న తరువాత బీపీ ఉండదు. రాత్రి పూట బీపీ ఎక్కువ ఉంటే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదము ఉంటుంది. 24 గంటల్లో బీపీ స్థాయి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆంబులేటరి బీపీ మానిటర్ ద్వారా పరీక్షించుకోపచ్చు. దీని వల్ల ఏ సమయంలో బీపీ ఉందొ తెలుస్తుంది.
బిపి అతి తీవ్ర స్థాయికీ పెరిగినప్పుడు వివరీతమైన తలనొప్పి నిద్రలేమి, చూపు మసకభారతం, విపరీతమైన అలనట, చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వానతీనుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడటం లక్షణాలు కనిపిస్తాయి. గుండెకు రక్తం అందించే ధమనులు కుచించుకుపోతాయి. మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం రావచ్చు. కళ్లు దెబ్బతింటాయి. మూత్రపిండాలు, గుండె పనితీరు మందగించి ప్రాణాలకు ముప్పు రావచ్చు. హైపర్‌టెన్షన్‌ను సులువుగా అదుపు చేయవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి అలవాట్లతో నిరోధించవచ్చు. వ్రమాదకరస్థాయికి చేరకుండా నిరోధించేందుకు జాగ్రతగా చికిత్స అందించాలి.
Source: https://epaper.andhrajyothy.com/c/39473345
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బాధించే "సోరియాసిస్", ఒక దీర్ఘకాలిక స్వయం ప్రతిరక్షక వ్యాధి (ఆటో ఇమ్యూన్ వ్యాధి). చర్మం మంట,…
విరామ ఉపవాసం (ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్) అనేది ఆహారం తీసుకోవడంపై కాకుండా, ఆహారం తీసుకునే సమయంపై దృష్టి సారించే ఒక ప్రత్యేకమైన…
మారిన జీవనశైలి మరియు వివిధ రకాల ఆహారపు అలవాట్ల వల్ల ఫురుషులు, మహిళలు అనే లింగభేధం లేకుండా ప్రస్తుతం చాలా…
ఇటీవల కాలంలో మారిన జీవనశైలి మరియు పని వేళల వల్ల ప్రస్తుతం చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సాధారణంగా జీవితంలో…
కుటుంబాన్ని ప్రారంభించడం అనేది ఒక ముఖ్యమైన మరియు ఉత్తేజకరమైన మైలురాయి. ఇది ఎన్నో ఆశలతో కూడిన ప్రయాణం, అయితే సరైన…
వేసవి కాలం అంటేనే సూర్యరశ్మి, విహారయాత్రలు, ఆహ్లాదకరమైన వాతావరణం. కానీ, చాలా మందికి ఈ కాలం అలర్జీల రూపంలో అసౌకర్యాన్ని…