Hematology & BMT

హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ లక్షణాలు మరియు కారణాలు, గుర్తించే పరీక్షల వివరాలు

తలభాగం శరీరంలోనే అత్యంత కీలకం. అంతటి ముఖ్యమైన భాగం క్యాన్సర్‌ రూపంలో విజృంభిస్తున్నది. హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్‌ ప్రమాదకరంగా మారుతున్నది.

హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్‌ అంటే ఏంటి , ఎన్ని రకాలు ?

హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్‌ మనదేశంలో రెండో స్థానం వైపు దూసుకెళ్తున్నది. ప్రతి లక్షలో 20 మంది వరకు ప్రభావితం చేస్తుంది. దీనిలో రకాలు ఉన్నాయి.

  • ఓరల్‌ కేవిటీ: ఇది పెదాలు, బుగ్గలు, నాలుక, నోరుకు వ్యాపిస్తుంది.
  • ఫెయిరింగ్స్‌: ఇది ట్యూబ్‌ ఆకారంలో ముక్కు, నోరు, గొంతు వరకు విస్తరిస్తుంది.

ఈ నిర్మాణాలు అన్నీ హెడ్‌ అండ్‌ నెక్‌లోని లోపలి భాగంతో సంబంధం ఉన్నవే. ఈ భాగాలలో ఏవైనా క్యాన్సర్‌కు గురైతే హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్‌ అంటారు.

హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్‌కు కారణాలు ఏమిటి?

  • పాన్‌, తంబాకు, జరా, సిగరెట్‌ తీసుకోవడం.
  • అతిగా మద్యం సేవించడం.
  • వక్క పొడి, గుట్కా తినడం.
  • <రక్షణలేని, అక్రమ ఓరల్‌ సెక్స్‌ వల్ల వస్తుంది.

లక్షణాలు ఏంటి?

  • తల లేదా మెడలో ఎంతకూ మానని, తగ్గని బొబ్బలు ఏర్పడుతాయి.
  • నోటిలో అల్సర్లు ఏర్పడతాయి మరియు కొంతకాలం తెల్లని లేదా ఎర్రని చారికలు నోట్లో ఉంటాయి.
  • ఎడతెగని దగ్గు, గొంతు బొంగురుపోవడం.
  • విపరీతమైన చెవి పోటు, తీవ్రమైన తలనిప్పి.
  • ఊపిరి పీల్చుకోవడం, ఆహారం మింగడంలో ఇబ్బంది.
  • నోటి నుంచి అసాధారణ రక్తస్రావం.
  • ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం.

హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలి?

pఇది క్యాన్సరా కాదా అని తెలుసుకోవడానికి క్లినికల్‌ ఎగ్జామినేషన్‌ . ఒకవేళ ఉన్నట్లు నిర్ధారణ అయితే ఏ స్థాయిలో ఉంది. ఎంతమేరకు వ్యాపించి ఏేంది. అనేవి తెలుసుకోవాలి. అందుకోసం సీటీ స్మాన్‌, ఎమ్‌ఆర్‌ఐ, పెట్‌సిటీస్కాన్లు చేసి తెలుసుకుంటారు. కచ్చిర్త్‌మైన నిర్ధారణ కోసం స్యామౌస్‌ సెల్‌ కార్సినోమా టెస్ట్‌కి పంపిస్తారు.

చికిత్స ఏంటి?

క్యాన్సర్‌ ఉన్నట్లు బయాప్సీలో నిర్ధారణ అయితే అది ఏస్థాయిలో ఉందో తలుసుకోపొలి. తర్వాత తగిన చికిత్స ప్రారంభించాలి.

  • స్టేజ్‌ 1 &2: సాధారణంగా సర్జరీ లేదా రేడియేషన్‌లను అవలంభిస్తారు.
  • స్టేజ్‌ 3&4 – సర్జరీ, రేడియేషన్‌, కీమో థెరపీలు లేదా రేడియేషన్‌, కీమోథెరపీ విధానాన్ని అనుసరిస్తారు.

రేడియేషన్‌ పాత్ర

రేడియేషన్‌ థెరపీ అనగానే చాలామందిలో అపోహ ఉంది.ఈ కిరణాలతో మంటపుట్టడం లేదా నొప్పి రావడంతోపాటుగా సైడ్‌ ఎఫెక్ట్స్‌ వల్ల పేషెంట్‌ మంచానికే అతుక్కు పోతాడనే భ్రమలున్నాయి. కానీ అవన్నీ నిజం కావు. క్యాన్సర్‌ మహమ్మారిని సమూలంగా పారదోలటానికి ఐఎంఆర్‌టి, రాపిడ్‌ ఆర్క్‌, ఐజీఆర్‌టి లాంటి అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్‌ ఉండవు. వెన్నెముక, ట్రెయిన్‌ స్టెమ్‌, సలైవరీ గ్లాండ్స్‌ లాంటి సున్నితమైన భాగాలకు ఎలాంటి హాని తల పెట్టవు. ఈ రేడియేషన్‌ థెరపీ వెలువరించే కిరణాలు కేవలం క్యాన్సర్‌ సెల్స్‌ను మాత్రమే సమూలంగా నిర్మూలిస్తాయి. జాగ్రత్తలు సాధారణంగా ట్రీట్‌మెంట్‌ తర్వాత పేషెంట్లలో క్యాన్సర్‌ మహమ్మారి మొదటి రెండేళ్లలో మళ్లీ తిరగబడే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. అందుకే చికిత్స అనంతరం రోగి వైద్యుల సలహా మేరకు కచ్చితంగా నడుచుకోవాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరం పాటు నెలకోసారి డాక్టర్‌ని సంప్రదించాలి. రెండో సంవత్సరం రెండు నెలలకోసారి, మూడో సంవత్సరం మూడు నెలలకోసారి, నాలుగు, ఐదో సంవత్సరంలో ఆరు నెలలకోసారి ఆ తర్వాత సంవత్సరానికోసారి కలిస్తే సరిపోతుంది.

నివారణ మార్గాలు:

  • పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.
  • మద్యం అధికంగా సేవించరాదు.
  • మంచి ఆహార అలవాట్లు కలిగి ఉండాలి. తరచుగా డెంటిస్ట్‌ను కలవాలి.
  • రక్షణ లేని వివాహేతర లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలి.
  • సూర్యుడి కిరణాలకు ఎక్కువగా గురికాకుండా చూసుకోవాలి.
Yashoda Hopsitals

Recent Posts

DBS vs. FUS: A Comprehensive Analysis of Deep Brain Stimulation & Focused Ultrasound for Neurological Disorders

Neurological disorders such as Parkinson's disease, essential tremor, and epilepsy are notorious for impairing quality…

2 hours ago

అజీర్తి ఎందువలన వస్తుంది? అజీర్తి లక్షణాలు, దీర్ఘకాలంలో వచ్చే సమస్యలు, చికిత్స

మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వకపోవడాన్ని అజీర్తి అంటాం, ఇది చిన్న సమస్యలాగా అనిపించవచ్చు, కానీ అజీర్తి వలన జీవనశైలి…

5 hours ago

యూరిక్ యాసిడ్: ఆరోగ్యంపై యూరిక్ యాసిడ్ యొక్క ప్రభావం, అసమతుల్యతలకు కారణాలు, మరియు నియంత్రణ

యూరిక్ యాసిడ్ అనేది మన శరీరం ప్యూరిన్‌లను (కొన్ని ఆహారాలు మరియు శరీర కణజాలాలలో లభించే పదార్థాలను) విభజన చేయడం…

6 hours ago

గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) : కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు, చికిత్స

మానవుని జీర్ణవ్యవస్థలో నోటి నుండి తీసుకున్న ఆహారం అన్నవాహిక ద్వారా జీర్ణాశయం/ కడుపు లోకి చేరుతుంది. అన్నవాహిక చివరిలో ఒక…

3 days ago

ఎండోక్రైన్ రుగ్మతలు: కారణాలు, నిర్దారణ, లక్షణాలు, చికిత్స, పూర్తి వివరాలు

మానవ శరీరంలో హార్మోన్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రోజువారీ జీవితంలో శరీరానికి అవసరమైన చర్యలు అంటే ఆకలి, నిద్ర,…

4 days ago

రక్తనాళ శస్త్రచికిత్సలో రూపాంతరాలు: నూతన విధానాలు, పరిధి యొక్క విస్తరణ & ప్రయోజనాలు

ఒకప్పుడు ప్రధాన రక్తనాళాల సంబంధిత సమస్యలకు బహిరంగ శస్త్రచికిత్స అనేది తరుచుగా సూచించబడేది, కానీ నేడు ఈ సమస్యలను సులువుగా…

6 days ago