నవంబర్ వచ్చిందంటే చాలు శీతాకాలం ప్రారంభమై చలి తీవ్రత పెరగడం వల్ల అనేక వ్యాధులు ప్రజానీకంపై దాడి చేస్తుంటాయి. ఏ వయసు వారైనా శీతకాలంలో కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా శీతాకాలం వచ్చిందంటే చాలు వ్యాధులు వాటంతట అవే వస్తుంటాయి.
సీజన్ మార్పుతో అనేక రకాల వ్యాధులు విజృంభిస్తుండడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వాతావరణం చల్లగా ఉంటుండడంతో హానికార వైరస్ లు శరీరంలోకి ప్రవేశించి హాని కల్గిస్తున్నాయి. ఈ కాలంలో సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, ఫ్లూ వంటి వ్యాధులు సంభవిస్తాయి. వీటితో పాటు పలు రకాల అంటువ్యాధులు, కంటి వ్యాధులే కాకుండా ఎలర్జీలు, ఆస్తమా, సీవోపీడీ, అలర్జిక్ బ్రాంకైటిస్, నిమోనియా వంటి శ్వాసకోశ వ్యాధుల తీవ్రత
గొంతు నొప్పి: చలికాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే ప్రధాన సమస్యల్లో గొంతునొప్పి ఒకటి. సీజన్ మారే సమయంలో చాలా మందికి ముందుగా గొంతునొప్పి వస్తుంది. గొంతులో ఇన్‌ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు చేరడం వల్ల ఈ నొప్పి మొదలవుతుంది. గొంతులో ఇన్ఫెక్షన్ వల్ల మాటలు సరిగ్గా మాట్లాడలేకపోవడం, గొంతులో గరుకుగా ఉండడం వంటి ఇబ్బందులు వస్తాయి.
జలుబు: సీజన్ మారే సమయంలో చాలా మందికి గొంతు నొప్పి తరువాత దగ్గు, జలుబు వస్తాయి. శీతకాలంలో చిన్న పిల్లలు, పెద్దవారు అనే తేడా లేకుండా వచ్చే సీజనల్ జలుబు ప్రతి ఒక్కరిని చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ కాలంలో మరి ముఖ్యంగా చిన్నపిల్లలు తరచుగా జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతుంటారు. కాస్త వాతావరణం మారినా, తాగే నీరులో మార్పు కనిపించినా, పిల్లల్లో జలుబు లక్షణాలు పెరుగుతాయి.
ఫుడ్ పాయిజనింగ్: శీతకాలంలో ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ. కలుషిత ఆహారం తిన్నప్పుడు కడుపులో నొప్పి, వికారం, వాంతులు అవుతాయి. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా శరీరంలో బలహీనంగా అనిపించడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ కాలంలో ఆహారంపై జాగ్రత్తలు అవసరం.
కడుపు నొప్పి: శీతకాలంలో జీర్ణక్రియ బలహీనంగా ఉండటం వల్ల కడుపు నొప్పి అనేది సాధారణంగా వచ్చే సమస్య. విరేచనాలు, వాంతులు, ఈ సీజన్‌లో తరచుగా వస్తుంటాయి. దీనిని నివారించేందుకు ఈ సీజన్‌లో ఆహారం, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
జ్వరం: శీతాకాలంలో సాధారణంగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోతాయి. ఉష్ణోగ్రతలు తగ్గితే, వైరస్‌కు వ్యాప్తి చెందే శక్తి పెరుగుతుంది. అందుకే శీతకాలంలో వైరల్ జ్వరాలు కూడా ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పు కారణంగా కూడా చాలామందికి తరచూ జ్వరం వస్తుంది. శరీర ఉష్ణోగ్రత 98.6-101 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు ఉంటే దానిని మీరు సాధారణ జ్వరంగా పరిగణించవచ్చు.
ఫ్లూ: ఫ్లూ శీతాకాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి, ఫ్లూ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధిగ్రస్తులు తరచూగా ముక్కు, కళ్ళు మరియు చెవులను తాకడం మానుకోవాలి.
చర్మ వ్యాధులు: శీతకాలంలో చర్మవ్యాధులైన సొరియాసిస్, దురద లాంటివి ఎక్కువగా వస్తాయి. ముఖంపై మొటిమలు, కాళ్ల పగుళ్లు, చర్మం చెడిపోవడం వంటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే పలు రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకుతాయి. దీన్ని నివారించడానికి మన శరీరాన్ని ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి.
పాదాల పగుళ్లు: శీతకాలంలో చాలా మందికి పాదాల పగుళ్ల సమస్య ఎదురవుతుంది. దీనివల్ల పాదాలు నొప్పిగా ఉండడం, నడవడం ఇబ్బందిగా ఉంటుంది. పాదాలు అందవికారంగా తయారవుతాయి. వాతావరణం కారణంగా ఈ సీజన్‌లో కాళ్ళు పొడిబారుతాయి. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే మడమల దగ్గర చర్మానికి పగుళ్ళు వస్తాయి.
ఆస్తమా (ఉబ్బసం): ఆస్తమాతో బాధపడేవారు శీతాకాలంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. గొంతు నొప్పి, కఫం, ఛాతీ బిగుతు శ్వాస ఆడకపోవటానికి కారణమవుతుంది. ఇది ఉబ్బసానికి కూడా దారితీస్తుంది. ఇటువంటి సమస్యలున్నవారు మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
న్యుమోనియా: ఊపిరితిత్తులకు కలిగే అనారోగ్యాన్ని న్యుమోనియా అంటారు. న్యుమోనియా వ్యాధి వైరస్, బాక్టీరియా, క్షయవ్యాధి వల్ల వ్యాప్తి చెందుతుంది. పొగతాగడం, చలిగాలిలో తిరగడం, కుటుంబ పరంగా అస్తమా, అనారోగ్య పరిస్థితుల వల్ల ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 2 ఏళ్లలోపు చిన్నారుల్లో అలాగే 65 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.
కాబట్టి శీతకాలంలో చల్లటి వాతవరణాన్ని ఆనందిస్తూనే మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ శీతకాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుంది. ఈ కాలంలో కొన్ని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నప్పటికీ కొన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల వారి వారి ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకోవచ్చు.
About Author –
Dr. Hari Kishan Boorugu, Consultant Physician & Diabetologist, Yashoda Hospitals, Hyderabad
మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం మెదడు, మనం ఏ పని చేయాలన్నా మెదడు నుండి సంకేతాలు రావాలి, మన…
పైల్స్ ముఖ్యంగా మొలలు లేదా అర్శమొలలు అని కూడా పిలువబడే ఈ సమస్య, ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని బాధించే ఒక…
Deep brain stimulation (DBS) is a revolutionary remedy for neurological conditions; however, it is often…
ఆస్తమా అనేది శ్వాస మార్గాల వాపు మరియు అధిక ప్రతిచర్యను కలిగి ఉన్న ఒక సంక్లిష్ట పరిస్థితి. ఆస్తమాలో, శ్వాసనాళాలు…
Heat rash, or prickly heat or miliaria, is a common and irritating dermatologic condition that…
Hyperglycemia, or elevated blood sugar, is a condition defined by an excess of glucose in…